• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఆడపిల్ల పుట్టిన అదృష్టం: ఆ సన్‌రైజర్స్ బౌలర్ ఇక వన్డేల్లోనూ: షైనీకి గాయం: కాస్సేపట్లో మ్యాచ్

|

సిడ్నీ: ఆడపిల్ల పుడితే.. ఇంటికి మహాలక్ష్మి వచ్చిందని సంతోషిస్తారు.. అదృష్టం కలిసి వస్తుందని నమ్ముతారు. ఆ సెంటిమెంట్ మరోసారి రుజువైంది. తొలుత టీమిండియాకు నెట్ బౌలర్‌గా మాత్రమే ఎంపికైన ఆ తమిళనాడు పేసర్ టీ నటరాజన్.. ఇక వన్డే జట్టులోనూ చోటు దక్కించుకున్నాడు. ఇంకొన్ని గంటల్లో ఆస్ట్రేలియాతో తొలి వన్డే మ్యాచ్ ఆరంభం కాబోతోందనగా.. ఫాస్ట్ బౌలర్ నవదీప్ షైనీ వెన్నునొప్పితో ఇబ్బందులకు గురయ్యాడు. దీనితో అతని స్థానంలో నటరాజన్‌ను తీసుకున్నారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ మ్యాచుల్లో అతను సన్ రైజర్స్ హైదరాబాద్ తరఫున ఆడుతున్నాడు.

ఆడపిల్ల పుట్టిన వెంటనే..

ఆడపిల్ల పుట్టిన వెంటనే..

యునైటెడ్ అరబ్ ఎమిరేట్ప్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్‌తో కలిసి ఐపీఎల్-2020 మ్యాచ్‌లను ఆడుతున్న సమయంలోనే అతనికి ఆడపిల్ల పుట్టిన విషయం తెలిసిందే. నటరాజన్ భార్య పవిత్ర ఆడపిల్లకు జన్మనిచ్చారు. ఆ తరువాత రెండురోజుల వ్యవధిలోనే భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) తీపి కబురు అందించింది. ఆస్ట్రేలియాలో పర్యటించే టీ20 జట్టులోకి తీసుకుంది. ఆసీస్‌తో మూడు వన్డే మ్యాచ్‌లన ఆడే టీ20 స్క్వాడ్‌లోకి చేరింది. ప్రస్తుతం నటరాజన్.. టీమిండియా జట్టుతో కలిసి సిడ్నీలో ఉంటున్నాడు.

నవదీప్ షైనీకి గాయం..

తొలి వన్డే ఆరంభానికి కొన్ని గంటల ముందు- నవదీప్ షైనీ బ్యాక్ పెయిన్‌తో ఇబ్బందులు పడ్డాడు. ఈ మూడు వన్డే ఇంటర్నేషనల్స్‌ సిరీస్‌లో ఆడతాడా? లేదా? అనేది అనుమానమే. దీనితో ముందుజాగ్రత్త చర్యగా టీమ్ మేనేజ్‌మెంట్ టీ నటరాజన్‌ను వన్డే జట్టులోకి తీసుకుంది. ఈ మేరకు బీసీసీఐ రాత్రికి రాత్రి ఈ నిర్ణయాన్ని ప్రకటించింది. నవదీప్ షైనీకి బ్యాకప్‌గా నటరాజన్‌ను తీసుకున్నట్లు వెల్లడించింది. టీ20 మ్యాచ్‌లతో పాటు వన్డే ఇంటర్నేషనల్స్‌లో జట్టులో కూడా అతను ఆడతాడని పేర్కొంది.

 నెట్ బౌలర్ స్థాయి నుంచి..

నెట్ బౌలర్ స్థాయి నుంచి..

నిజానికి- నటరాజన్ ఆస్ట్రేలియా పర్యటనకు ఎంపికైనప్పటికీ.. నెట్ బౌలర్‌గా మాత్రమే అతణ్ని తీసుకున్నారు. టీమిండియా నెట్ ప్రాక్టీస్ బౌలర్ల జాబితాలో అతని పేరును చేర్చింది. ఆడపిల్ల పుట్టిన అదృష్టం.. నెట్ బౌలర్ స్థాయి నుంచి టీ20 స్క్వాడ్‌లో చేరాడు. బలమైన ఆస్ట్రేలియా జట్టుతో మూడు టీ20 ఇంటర్నేషనల్స్‌ను ఆడే అవకాశాన్ని అందుకున్నాడు. తాజాగా నవదీప్ షైనీ గాయపడటంతో వన్డే ఇంటర్నేషనల్స్‌లోనూ స్థానం సాధించుకోగలిగాడు.

సన్ రైజర్స్ హైదరాబాద్‌లో అద్భుత ప్రదర్శన

సన్ రైజర్స్ హైదరాబాద్‌లో అద్భుత ప్రదర్శన

ఐపీఎల్-2020 సీజన్ 13వ ఎడిషన్‌లో టీ నటరాజన్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. సన్ రైజర్స్ హైదదరాబాద్ జట్టులో అన్ క్యాప్డ్ ప్లేయర్‌గా చోటు దక్కించుకున్న తమిళనాడు పేసర్.. ఎదిగిన క్రమం అద్భుతం. జస్‌ప్రీత్ బుమ్రాతో సమానంగా యార్కర్లను సంధించగలడనే పేరును తెచ్చుకున్నాడు. సన్ రైజర్స్ హైదరాబాద్ ప్రధాన బౌలర్ భువనేశ్వర్ కుమార్ గాయం కారణంగా తప్పుకోవడంతో నటరాజన్‌కు అవకాశం దక్కింది. ఈ అవకాశాన్ని ఏ మాత్రం జారవిడచుకోలేదతను. నిప్పులు చెరిగే బంతులను సంధించాడు. టీమిండియా సెలెక్టర్ల కంట్లో పడ్డాడు. ఆసీస్ టూర్‌ ఛాన్స్‌ను కొట్టేశాడు.

వన్డే మ్యాచ్‌లను ఆడే టీమిండియా ఇదీ..

వన్డే మ్యాచ్‌లను ఆడే టీమిండియా ఇదీ..

ఆసీస్‌తో మూడు వన్డే మ్యాచ్‌లను ఆడబోయే జట్టుకు విరాట్ కోహ్లీ సారథ్యాన్ని వహిస్తాడు. శిఖర్ ధావన్, శుభ్‌మన్ గిల్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), సంజు శాంసన్ (వికెట్ కీపర్), శ్రేయాస్ అయ్యర్, మనీష్ పాండే, హార్దిక్ పాండ్యా, మయాంక్ అగర్వాల్, రవీంద్ర జడేజా, యజువేంద్ర చాహల్, కుల్‌దీప్ యాదవ్, జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, నవదీప్ షైనీ, శార్దుల్ ఠాకూర్, టీ నటరాజన్.

English summary
Left-arm pacer T Natarajan has been added as Navdeep Saini's back-up ahead of the three-match ODI series against Australia, set to start with the first game at Sydney Cricket Ground (SCG) on November.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X