వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రెండురోజుల్లో తొలి టెస్ట్: ఆసీస్ స్టార్ బ్యాట్స్‌మెన్‌కు బ్యాక్ పెయిన్: జట్టులో యంగ్ క్రికెటర్‌

|
Google Oneindia TeluguNews

అడిలైడ్: భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య మరో రెండు రోజుల్లో టెస్ట్ సిరీస్ ఆరంభం కాబోతోంది. సుమారు నెల రోజుల పాటు సాగే సుదీర్ఘమైన సిరీస్ ఇది. గురువారం ఈ రెండు జట్ల మధ్య తొలి టెస్ట్ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ పరిస్థితుల్లో ఆస్ట్రేలియా స్టార్ బ్యాట్స్‌మెన్ స్టీవ్ స్మిత్..వామప్‌కు దూరం కావడం కలకలం రేపుతోంది. వామప్‌ కోసం గ్రౌండ్‌లోకి దిగిన ఆ బ్యాట్స్‌మెన్.. 10 నిమిషాల్లో మళ్లీ డ్రెస్సింగ్ రూమ్ దారి పట్టాడు. ఇక మళ్లీ వెనక్కి రాలేదు. అతను బ్యాక్ పెయిన్‌తో బాధపడుతున్నట్లు తెలుస్తోంది.

రెండు రోజుల్లో తొలి టెస్ట్ మ్యాచ్ ఆరంభం కాబోతోండగా.. మరో స్టార్ గాయాల బారిన పడటం కంగారూ జట్టును కంగారెత్తిస్తోంది. మంగళవారం అతను వామప్, నెట్ ప్రాక్టీస్‌లో పాల్గొనడానికి స్టీవ్ స్మిత్ అడిలైడ్ గ్రౌండ్‌లో దిగాడు. కొంతసేపు నెట్ ప్రాక్టీస్ చేశాడు. నెట్స్‌లో తోటి సభ్యులతో కలిసి బ్యాటింగ్ ప్రాక్టీస్‌లో పాల్గొన్నాడు. ఎక్కువ సేపు నెట్స్‌లో నిలవలేకపోయాడు. గంటపాటైనా అతను బ్యాటింగ్ చేయలేకపోయాడు.

బంతిని విసరడంలో, ఫీల్డింగ్ చేయడంలో కొంత ఇబ్బందులకు గురయ్యాడు. వామప్‌లో పాల్గొన్న తరువాత ఇక నొప్పిని భరించలేకపోయినట్టు కనిపించింది. వామప్‌లో పాల్గొన్న 10 నిమిషాలకే అతను డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్లిపోయాడు. ఇక మళ్లీ తిరిగి రాలేదు. స్టీవ్ స్మిత్.. బ్యాక్ పెయిన్‌తో బాధపడుతున్నాడని ఆస్ట్రేలియా జట్టు అధికార ప్రతినిధి ఒకరు వెల్లడించారు. ఫీల్డింగ్ చేసే సమయంలో, బంతిని విసిరేటప్పుడు ఇబ్బందిపడుతున్నట్లు గుర్తించామని చెప్పారు.

Ind vs Aus 2020 1st Test: Steve Smith training adds more chaos to Adelaide test

అతని బ్యాక్ పెయిన్ తీవ్రమైనదేమీ కాదని, ఆందోళన పడాల్సిన అవసరం లేదని వివరించారు. అయినప్పటికీ- టెస్ట్ మ్యాచ్‌కు రెండురోజుల ముందు కీలకంగా భావించే వామప్, నెట్ ప్రాక్టీస్‌ నుంచి స్టీవ్ స్మిత్ అర్ధాంతరంగా డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్లడం జట్టు సభ్యుల్లో కలకలం రేపుతోంది. ఈ పరిస్థితిని ముందుగానే గమనించినట్టుంది క్రికెట్ ఆస్ట్రేలియా. కామెరూన్ గ్రీన్‌కు టెస్ట్ స్క్వాడ్‌లోకి తీసుకుంది. అతణ్ని టెస్ట్ జట్టులోకి తీసుకున్నట్లు వెల్లడించింది.

ఆస్ట్రేలియా జట్టులో ఇప్పటికే స్టార్ ప్లేయర్లు గాయాల బారిన పడ్డారు. గజ్జల్లో గాయం కారణంగా డేవిడ్ వార్నర్ జట్టుకు దూరం అయ్యాడు. రెండో టెస్ట్ మ్యాచ్ నాటికి అతను ఫిట్‌నెస్ సాధించే అవకాశం ఉంది. యువ కెరటం విల్ పుకోవ్‌స్కీ కాంకషన్‌కు గురి అయ్యాడు. తొలి టెస్ట్‌లో అతను ఆడేది అనుమానమే. వ్యక్తిగత కారణాల వల్ల ఫాస్ట్ బౌలర్ మిఛెల్ స్టార్క్.. ఇప్పటికే జట్టు నుంచి వైదొలిగాడు. టీ20ల్లోనూ అతను ఆడలేదు. తాజాగా స్టీవ్ స్మిత్ బ్యాక్ పెయిన్‌తో బాధపడటం ఆసీస్ జట్టును ఆందోళనలోకి నెట్టేసింది.

English summary
A head of First Test against India, Australia’s chaotic lead-up has struck another potential hurdle with Steve Smith leaving training early at Adelaide Oval on Tuesday. Smith warmed up and trained for about 10 minutes before leaving the arena for the dressing-room shaking his left arm.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X