వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఐపీఎల్ మత్తులో ఆసీస్: సిడ్నీ పిచ్‌పై కోహ్లీ..గల్లీ క్రికెటర్ కంటే అధ్వాన్నం: లోయెస్ట్ యావరేజ్

|
Google Oneindia TeluguNews

సిడ్నీ: ప్రాణాంతక కరోనా వైరస్ వల్ల అనివార్యంగా ఏర్పడిన సుదీర్ఘ విరామం అనంతరం భారత క్రికెట్ జట్టు చేపట్టిన ఆస్ట్రేలియా పర్యటన బోణీ సగటు అభిమానిని తీవ్రంగా నిరాశపరిచింది. నాసిరకం బౌలింగ్.. దానికి అనుగుణంగా బ్యాటింగ్ శైలి సిరీస్ మొత్తంపై ప్రభావాన్ని చూపేలా కనిపిస్తోంది. తొలి వన్డే ఆడిన సిడ్నీ క్రికెట్ గ్రౌండ్‌లోనే ఇంకాస్సేపట్లో రెండో వన్డేలో ఆరంభం కాబోతోంది. భారత కాలమానం ప్రకారం ఉదయం 9:10 నిమిషాలకు మ్యాచ్ ప్రారంభమౌతుంది. ఈ సిరీస్‌ను ఓటమితో ఆరంభించిన టీమిండియా.. పుంజుకోవాలంటే.. గెలిచి తీరాల్సిన మ్యాచ్ ఇది. ఇందులో ఓడితే సిరీస్ ఆసీస్ వశమౌతుంది. మూడు వన్డేల సిరీస్‌లో ఆసీస్ 0-1తో ముందంజలో ఉంది.

ఐపీఎల్ మత్తులో ఆసీస్..

ఐపీఎల్ మత్తులో ఆసీస్..

ఆస్ట్రేలియా క్రికెటర్లు ఇంకా ఇండియన్ ప్రీమియర్ లీగ్ మత్తులోనే ఉన్నట్టుంది. తొలి వన్డేలో వారి విధ్వంసకర బ్యాటింగ్.. ఐపీఎల్ టోర్నమెంట్‌ను తలపించింది. ప్రత్యేకించి- స్టీవ్ స్మిత్, గ్లెన్ మ్యాక్స్‌వెల్ బ్యాటింగ్ అచ్చంగా ఐపీఎల్ తరహాలోనే సాగింది. సాధారణంగా 50 ఓవర్ల మ్యాచ్‌లో సెంచరీ సాధించడాన్ని గొప్పగా భావిస్తారు. కళ్లు చెదిరే స్ట్రైక్ రేట్‌తో సెంచరీని బాది అవతల పారేస్తే.. అదో అద్భుతమే అవుతుంది. తొలి వన్డేలో స్టీవ్ స్మిత్ అలాంటి అద్భుతాన్నే ఆవిష్కరింపజేశాడు. 66 బంతుల్లోనే 105 పరుగులు చేశాడు. ఇందులో నాలుగు సిక్సర్లు, 11 ఫోర్లు ఉన్నాయి. ఇంత తక్కువ బంతుల్లో సెంచరీ చేయడం వన్డేల్లో అరుదు.

మ్యాక్స్‌వెల్‌దీ అదే దారి..

మ్యాక్స్‌వెల్‌దీ అదే దారి..

ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్‌ సైతం అదే తరహాలో సుడిగాలి ఇన్నింగ్ ఆడాడు. మిడిలార్డర్‌లో క్రీజ్‌లోకి వచ్చిన గ్లెన్ మ్యాక్స్‌వెల్.. తన అసలు సిసలు ఆటను ప్రదర్శించాడు. హార్డ్ హిట్టర్ అనే పేరును నిలుపుకొనేలా అతని బ్యాటింగ్ శైలి కొనసాగింది. 19 బంతుల్లోనే 45 పరుగులు చేశాడు. మూడు సిక్సులు, అయిదు ఫోర్లు బాదాడు. ఇందులో స్విచ్ షాట్ సిక్స్.. మ్యాచ్‌కే హైలెట్. అంత స్వేచ్ఛగా ఆడాడతను. టీమిండియా బౌలర్లపై ఆధిపత్యాన్ని చలాయించాడు. అద్భుతమైన ట్రైక్ రేట్‌ను అందుకున్నాడు. 236.84 స్ట్రైక్ రేట్‌ను నమోదు చేశాడు.

సిడ్నీలో విరాట్ కోహ్లీ బ్యాటింగ్ అధ్వాన్నం..

సిడ్నీలో విరాట్ కోహ్లీ బ్యాటింగ్ అధ్వాన్నం..

వరల్డ్ క్లాస్ క్రికెటర్ విరాట్ కోహ్లీకి కొన్ని బలహీనతలు ఉన్నాయి. సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ అంటే అతను ఉలికి పడుతున్నాడు. గల్లీ క్రికెటర్ స్థాయి కంటే అధ్వాన్నంగా ఆడుతున్నారు. ఈ గ్రౌండ్‌లో అతని బ్యాటింగ్ యావరేజ్ లెక్కలు.. ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. సిడ్నీలోో అతని బ్యాటింగ్ యావరేజ్.. 11.40. మూడో లోయెస్ట్ బ్యాటింగ్ యావరేజ్ ఇది. ఇదే సిడ్నీలో అతను ఇప్పటిదాకా అయిదు మ్యాచ్‌లను ఆడాడు. తొలివన్డేలో చేసిన 21 పరుగులతో ఈ యావరేజ్.. కొద్దిగా మెరుగుపడింది. అంతకుముందు మరింత అధ్వాన్నంగా ఉండేది. మిగిలిన స్టేడియాల్లో టన్నుల కొద్దీ పరుగులు చేస్తున్నాడు గానీ.. సిడ్ని పిచ్ అతని బలహీనతగా మారింది.

రెండు జట్ల లైనప్ ఇలా ఉండొచ్చు..

రెండు జట్ల లైనప్ ఇలా ఉండొచ్చు..

భారత జట్టులో మార్పులు చోటు చేసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. తొలివన్డేలో భారీగా పరుగులను సమర్పించుకున్న యజువేంద్ర చాహల్ స్థానంలో కుల్‌దీప్ యాదవ్‌ను ఆడించవచ్చని తెలుస్తోంది. బ్యాక్ పెయిన్ ఇబ్బందులను ఎదుర్కొంటోన్న నవదీప్ షైనీకి బదులుగా టీ నటరాజన్ లేదా శార్దుల్ ఠాకూర్‌లల్లో ఒకరిని తీసుకుంటారు. జట్టు కూర్పు.. శిఖర్‌ ధావన్‌, మయాంక్ అగర్వాల్‌, విరాట్ కోహ్లీ (కెప్టెన్‌), శ్రేయస్‌ అయ్యర్‌, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్‌ షమీలతో కూడి ఉంటుంది.

English summary
Virat Kohli's ODI average at the Sydney Cricket Ground as 11.40, the third lowest he averages at any ground, and the lowest on a ground where he's batted at least five times.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X