వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆస్ట్రేలియా సిరీస్‌కు టీమిండియా స్పెషలిస్ట్ బౌలర్: చీఫ్ సెలెక్టర్ దృష్టిలో: కఠోర సాధన

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: ఆస్ట్రేలియా పర్యటనకు బయలుదేరి వెళ్లిన భారత్ క్రికెట్ జట్టులో మరో ప్లేయర్ త్వరలో చోటు దక్కించుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. టెస్ట్ మ్యాచ్‌లు ఆరంభం కావడానికి ఇంకా నెలరోజుల పాటు సమయం ఉండటం వల్ల అతణ్ని ఎంపిక చేయొచ్చని తెలుస్తోంది. టెస్ట్ స్పెషలిస్ట్ బౌలర్‌గా పేరున్న ఇషాంత్ శర్మ.. గాయం కారణంగా ఆస్ట్రేలియా పర్యటనకు ఎంపిక కాలేదు. భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) సెలెక్టర్లు అతని పేరును పరిశీలనలోకి తీసుకున్నప్పటికీ.. పూర్తిస్థాయిలో ఫిట్‌నెస్ సాధించలేకపోవడంతో ఎంపిక చేయలేదు.

చిన్నస్వామి స్టేడియంలో కఠోర నెట్ ప్రాక్టీస్..

చిన్నస్వామి స్టేడియంలో కఠోర నెట్ ప్రాక్టీస్..

గాయం కోలుకున్న అతను నెట్ ప్రాక్టీస్‌‌పై దృష్టి పెట్టాడు. కఠోరంగా శ్రమిస్తున్నాడు. నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్‌సీఏ)లో సుదీర్ఘ స్పెల్‌ను బౌల్ చేశాడతను. ప్రస్తుతం అతను బెంగళూరులో ఉంటున్నాడు. ఇక్కడి చిన్నస్వామి స్టేడియంలో ఏకధాటిగా కొన్ని గంటల పాటు నెట్ ప్రాక్టీస్‌ చేస్తూ కనిపించాడు. టీమిండియా చీఫ్ సెలెక్టర్ సునీల్ జోషి, బీసీసీఐ డైరెక్టర్ రాహుల్ ద్రవిడ్, నేషనల్ క్రికెట్ అకాడమీ కోచింగ్ స్టాఫ్ పరాస్ మాంబ్రే, మన్సూర్ ఖాన్‌ల సమక్షంలో ఇషాంత్ శర్మ సుదీర్ఘంగా బౌలింగ్ చేశాడు. పూర్తిస్థాయి రన్నప్‌ను సాధించాడు. లైన్ అండ్ లెంగ్త్‌తో కట్టుదిట్టంగా బంతులను సంధించాడు.

బౌలింగ్ పట్ల చీఫ్ సెలెక్టర్ సంతృప్తి..

బౌలింగ్ పట్ల చీఫ్ సెలెక్టర్ సంతృప్తి..

ఇషాంత్ శర్మ బౌలింగ్ శైలి, అతని ఫిట్‌సెస్ లెవెల్స్ పట్ల సునీల్ జోషి, రాహుల్ ద్రవిడ్ సంతృప్తిని వ్యక్తం చేశారు. ఆసీస్ జట్టుతో టెస్ట్ సిరీస్ ఆరంభం కావడానికి ఇంకా సమయం ఉన్నందున.. ఈ లోగా అతను మరింత రాటుదేలుతాడని, ఆస్ట్రేలియా సిరీస్‌తో ఆడించే అవకాశాలు లేకపోలేదని రాహుల్ ద్రవిడ్ పేర్కొన్నారు. షెడ్యూల్ ప్రకారం.. అడిలైడ్ టెస్ట్ మ్యాచ్ వచ్చనెల 17న ప్రారంభం కానుంది. అప్పటికల్లా ఇషాంత్ శర్మ తమకు అందుబాటులోకి వస్తాడంటూ ఇదివరకే బీసీసీఐ ఛైర్మన్ సౌరభ్ గంగూలీ కూడా వ్యాఖ్యానించిన నేపథ్యంలో.. అతను ఎంపిక కావడం ఖాయంగా కనిపిస్తోంది.

సుదీర్ఘ బౌలింగ్..

సుదీర్ఘ బౌలింగ్..

భారత్ తరఫున 97 టెస్ట్‌మ్యాచ్‌లను ఆడిన ఇషాంత్ శర్మ 297 వికెట్లు పడగొట్టాడు. 300 వికెట్ల క్లబ్‌కు మూడు వికెట్ల దూరంలో.. వంద టెస్టుల క్లబ్‌లో చేరడానికి మూడు మ్యాచ్‌ల దూరంలో ఉన్నాడతను. ఈ సిరీస్‌కు ఎంపికైతే.. ఈ రెండూ అతని ఖాతాలో చేరుతాయి. టెస్ట్ స్పెషలిస్ట్ బౌలర్‌గా పేరుంది ఇషాంత్ శర్మకు. వేగం సడలకుండా సుదీర్ఘంగా బౌలింగ్ చేయగల సత్తా ఉంది. టెస్ట్ మ్యాచ్‌లకు కావాల్సింది అదే. టెస్టుల్లో 11 సార్లు అయిదు వికెట్లను తీసుకున్నాడు. 10 సార్లు నాలుగు వికెట్లను పడగొట్టాడు. ఐపీఎల్-2020 సీజన్ ఆరంభంలోనే గాయం కారణంగా తప్పుకొన్నాడు. ఐపీఎల్‌లో అతను ఢిల్లీ కేపిటల్స్‌కు ప్రాతినిథ్యాన్ని వహిస్తున్నాడు.

ఇదీ షెడ్యూల్..

ఇదీ షెడ్యూల్..

భారత్, ఆస్ట్రేలియా మధ్య మూడు వన్డే ఇంటర్నేషనల్స్, మూడు టీ20లు, నాలుగు టెస్ట్ మ్యాచ్‌లు సాగనున్నాయి. తొలి వన్డే: నవంబర్ 27 (సిడ్నీ), రెండో వన్డే: నవంబర్ 29 (సిడ్నీ), మూడో వన్డే: డిసెంబర్ 2 (క్యాన్‌బెర్రా ), తొలి టీ20: డిసెంబర్ 4 (క్యాన్‌బెర్రా), రెండో టీ20: డిసెంబర్ 6 (సిడ్నీ), మూడో టీ20: డిసెంబర్ 8 (సిడ్నీ), తొలి టెస్ట్: డిసెంబర్ 17 నుంచి 21 (అడిలైడ్), రెండో టెస్ట్: డిసెంబర్ 26 నుంచి 30 (మెల్‌బోర్న్), మూడో టెస్ట్: జనవరి 7 నుంచి 11 (సిడ్నీ), నాలుగో టెస్ట్: జనవరి 15 నుంచి 19 (బ్రిస్బేన్).

English summary
India’s senior-most fast bowler Ishant Sharma on Wednesday bowled full tilt at the National Cricket Academy with an aim to get fit for India’s four-match Test series in Australia, starting December 17.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X