• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

రెండురోజుల్లో తొలి వన్డే: సంకట స్థితిలో కోహ్లీసేన: లైనప్‌లో ప్రయోగాలు: చేతులు కాల్చుకుంటారా?

|

సిడ్నీ: భారత క్రికెట్ జట్టు సరికొత్తగా సంకట పరిస్థితులను ఎదుర్కొంటోంది. రెండు రోెజుల్లో తొలి వన్డే ఆరంభం కాబోతోన్న ప్రస్తుత పరస్థితుల్లో.. ఇప్పటికీ ఆ సంకట స్థితిని అధిగమించలేకపోతోంది. ఫలితంగా జట్టు బ్యాటింగ్ లైనప్‌లో ప్రయోగాలకు ఆస్కారం ఇచ్చినట్టయింది. ఈ ప్రయోగాలు ఎలాంటి ఫలితాలనిస్తాయనేది టీమిండియా జట్టు ప్రదర్శన మీద ఆధారపడి ఉంది. అత్యంత బలమైన ఆస్ట్రేలియాను ఢీ కొట్టబోతోన్న సమయంలో ప్రయోగాలకు పూనుకుంటోంది.

  India vs Australia ODI Series : Likely Opening Pair Of Indian Team In The Absence Of Rohit Sharma

  విరాట్ కేప్టెన్సీకి ఎసరు పెట్టిన రోహిత్ శర్మ: కోహ్లీకి అగ్నిపరీక్షగా ఆసీస్ టూర్విరాట్ కేప్టెన్సీకి ఎసరు పెట్టిన రోహిత్ శర్మ: కోహ్లీకి అగ్నిపరీక్షగా ఆసీస్ టూర్

  శిఖర్ ధావన్‌కు జోడీ ఎవరు?

  శిఖర్ ధావన్‌కు జోడీ ఎవరు?


  ఏ క్రికెట్ జట్టుకైనా అదరగొట్టేలా ఇన్నింగ్‌ను ఆరంభించడం అత్యవసరం. కొత్త బంతిని ఎదుర్కొనడం, బౌలర్లపై ఎదురుదాడి చేయగల అటాకింగ్ బ్యాట్స్‌మెన్లను ఓపెనర్‌గా పంపిస్తుంటారు. ప్రస్తుతం భారత క్రికెట్ జట్టు ఓపెనర్ కొరతను ఎదుర్కొంటోంది. ఎవరితో ఇన్నింగ్‌ను ఆరంభించాలనే స్పష్టత కొరవడింది. శిఖర్ ధావన్‌కు సరితూగ గల, అతని వేగాన్ని అందుకోగల ఓపెనర్ స్థానాన్ని ఎవరితో భర్తీ చేస్తుందనే అంశాన్ని అధికారికంగా వెల్లడించట్లేదు టీమ్ మేనేజ్‌మెంట్.

   రోహిత్ శర్మ గాయపడటంతో..

  రోహిత్ శర్మ గాయపడటంతో..

  ఆస్ట్రేలియాతో సిరీస్‌కు రోహిత్ శర్మ ఎంపిక కాలేదు. గాయం కారణంగా అతను వన్డే, టీ20 సిరీస్‌లకు దూరం అయ్యాడు. టెస్ట్ మ్యాచుల్లో ఆడే అవకాశాలు కూడా అంతంత మాత్రమే. హిట్ మ్యాన్ రోహిత్ శర్మ అందుబాటులో ఉన్నన్ని రోజులూ ఓపెనింగ్ జోడీపై భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీ) బేఫికర్‌గా కనిపించింది. అతను గాయపడటం, ఆసీస్‌తో సిరీస్‌కు దూరం కావడం కొత్త సమస్యలను పుట్టించినట్టయింది.

  మయాంక్ వైపే మొగ్గు..

  మయాంక్ వైపే మొగ్గు..

  ప్రస్తుతం అందుబాటులో ఉన్న బ్యాట్స్‌మెన్లలో ఇన్నింగ్‌ను ఆరంభించగల సత్తా ఇద్దరు, ముగ్గురికి ఉంది. విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్‌కు కొత్త బంతిని సమర్థవంతంగా ఎదుర్కొనే సామర్థ్యం ఉంది. విరాట్ కోహ్లీని ఓపెనర్‌గా పంపించడం వల్ల వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు ఎవరు వెళ్తారనేది సమస్యగా మారింది. అందుకే విరాట్‌ స్థానాన్ని కదిలించట్లేదు. అలాగే మిడిలార్డర్‌లో క్రీజ్‌లో పాతుకునిపోయి, బౌలర్లపై ఎదురుదాడి చేయగలడు కేఎల్ రాహుల్. అతణ్ని ఓపెనర్‌గా పంపించడం వల్ల మిడిలార్డర్ దెబ్బతింటుందని మేనేజ్‌మెంట్ భావిస్తోంది. అందుకే మయాంక్ అగర్వాల్ వైపు మొగ్గు చూపుతోంది.

  ఆస్ట్రేలియా బౌలర్లను ఎదుర్కొనగలడా?

  ఆస్ట్రేలియా బౌలర్లను ఎదుర్కొనగలడా?

  మయాంక్ అగర్వాల్‌తో ఇన్నింగ్ ఓపెనింగ్ చేయించడం దాదాపు ఖాయమైనట్టే కనిపిస్తోంది. లెఫ్ట్ అండ్ రైట్ కాంబినేషన్‌తో భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పడానికి అవకాశం ఉంటుందని మేనేజ్‌మెంట్ అంచనా వేస్తోంది. కఠినమైన ఆసీస్ పిచ్‌లపై మయాంక్ అగర్వాల్ ఏ మేరకు క్రీజ్‌లో పాతుకుని పోగలడనేది తేలాల్సి ఉంది. తొలి వన్డేలోనే ఈ విషయం తేలిపోతుంది. మయాంక్ కుదురుకోగలిగితే ఇబ్బందులు ఉండవ్. అదే తడబడితే మాత్రం.. దాని ప్రభావం రెండు, మూడో వన్డేపైనా ఉంటుంది. అందుకే- ఆచితూచి నిర్ణయాన్ని తీసుకంటోంది మేనేజ్‌మెంట్.

  English summary
  Sachin Tendulkar backed Mayank Agarwal to be the first-choice opener for the Tests against Australia and said Rohit Sharma should be picked if he is fit and available for the much-anticipated 4-match Test series.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X