• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

తొలి టెస్ట్‌ ముంగిట్లో ఒక్క గాయం.. టీమిండియా జట్టు కూర్పు చిందరవందర

|

లండన్: నెలన్నర రోజులుగా ఎదురు చూస్తోన్న భారత్-ఇంగ్లాండ్ జట్ల మధ్య అయిదు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్ ప్రారంభానికి ముహూర్తం సమీపించింది. ఇంకొక్క రోజే వెయిటింగ్. బుధవారం మధ్యాహ్నానికి తొలి టెస్ట్ ఆరంభమౌతుంది. భారత కాలమానం ప్రకారం.. మధ్యాహ్నం 3:30 గంటలకు టాస్ పడుతుంది. సెప్టెంబర్ 14వ తేదీ వరకు సాగే సుదీర్ఘ సిరీస్ ఇది. దీనికోసం రెండు జట్లు కఠోర సాధన చేస్తోన్నాయి. ముమ్మరంగా నెట్ ప్రాక్టీస్ సాగిస్తోన్నాయి. ఈ ప్రాక్టీసే టీమిండియా కొంప ముంచింది. నెట్ ప్రాక్టీస్ చేస్తోన్న సమయంలో ఓపెనర్ మయాంక్ అగర్వాల్ గాయపడటం వల్ల జట్టు కూర్పు మొత్తం చిందరవందరగా తయారైంది.

తొలి టెస్ట్ మ్యాచ్ కూర్పులో చివరి నిమిషంలో మార్పులు చేర్పులు చోటు చేసుకున్నాయి. ఇక రోహిత్ శర్మతో కలిసి కర్ణాటక బ్యాట్స్‌మెన్ కేఎల్ రాహుల్ జట్టు ఇన్నింగ్‌ను ఆరంభించడం ఖాయమైంది. ఇదివరకు రోహిత్ శర్మ-మయాంక్ అగర్వాల్‌ను ఓపెనర్లుగా నిర్ణయించుకుంది టీమిండియా మేనేజ్‌మెంట్. మయాంక్ గాయపడటంతో ఇక ఓపెనర్ స్థానాన్ని కేఎల్ రాహుల్‌తో భర్తీ చేయాల్సి వచ్చింది. రాహుల్‌ను మిడిలార్డర్‌లో పంపించాలనుకున్నప్పటికీ.. ఇక అది కుదరకపోవచ్చు.

 IND vs ENG 2021 1st test: KL Rahul set to open with Rohit Sharma, India to play with 1 spinner

ఆలస్యంగా జట్టులోకి ఎంపికైన పృథ్వీ షా, సూర్యకుమార్ యాదవ్‌ ఇంకా ఇంగ్లాండ్‌కు రావాల్సి ఉంది. అతను జట్టులో చేరితే ఓపెనర్‌ ఇబ్బందులు ఉండకపోవచ్చు. రెండేళ్ల తరువాత టెస్ట్ మ్యాచ్ ఆడబోతోన్నాడు కేఎల్ రాహుల్. మయాంక్ అగర్వాల్ కంటే కేఎల్ రాహుల్‌కే ఇంగ్లాండ్ గడ్డపై ఆడిన అనుభవం ఉంది. ఇప్పటిదాకా అతను అయిదు టెస్ట్ మ్యాచ్‌లను ఆడాడు. 299 పరుగులు చేశాడు. ఇందులో ఓ సెంచరీ కూడా ఉంది. ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లను కూడా ఆడిన అనుభవం కూడా రాహుల్‌కు ఉంది.

తొలి టెస్ట్ మ్యాచ్‌కు ఆతిథ్యాన్ని ఇస్తోన్న నాటింగ్ హామ్ ట్రెంట్‌బ్రిడ్జ్ స్టేడియం.. గ్రీనిష్ లుక్‌ను సంతరించుకుంది. పిచ్‌పై అక్కడక్కడ పచ్చిక కనిపిస్తోంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఒక స్పిన్నర్‌ను ఆడించే అవకాశాన్ని పరిశీలిస్తోన్నారు హెడ్ కోచ్ రవిశాస్త్రి. ఒక స్నిన్నర్‌ను జట్టులోకి తీసుకుంటే- ఒక ఫాస్ట్ బౌలర్‌ను తగ్గించాల్సి రావొచ్చనే అంచనాలు ఉన్నాయి. ఒక స్పిన్నర్‌ను తీసుకోవాల్సి వస్తే.. రవిచంద్రన్ అశ్విన్ లేదా రవీంద్ర జడేజాల్లో ఒకరికి మాత్రమే తుది జట్టులో చోటు దక్కుతుంది. ఆల్‌రౌండర్ కావడం వల్ల రవీంద్ర జడేజా వైపే మేనేజ్‌మెంట్ మొగ్గు చూపొచ్చు.

English summary
KL Rahul to open first test match against England along with Rohit Sharma after Mayank Agarwal injury. The first will kick starting August 4.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X