చిత్తుగా ఓడిన టీమిండియా: సిరీస్ ధారదాత్తం

ఫ్లోరిడా: అమెరికా ఫ్లోరిడాలోని లాడర్‌హిల్ స్టేడియంలో ఆదివారం రాత్రి జరిగిన అయిదో టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లో భారత జట్టు చిత్తుగా ఓడింది. సిరీస్‌ను కోల్పోయింది. టెస్ట్, వన్డే ఇంటర్నేషనల్స్ సిరీస్‌‌ను గెలిచి దూకుడు మీద ఉన్న భారత జట్టుకు టీ20 సిరీస్‌లో బ్రేకులు వేశారు విండీస్ వీరులు. డిసైడర్‌ మ్యాచ్‌లో ఘన విజయం సాధించారు. సిరీస్‌ను 2-3 తేడాతో సొంతం చేసుకున్నారు.

అయిదు మ్యాచ్‌ల టీ20 ఇంటర్నేషనల్ సిరీస్ ఇది. తొలి రెండు మ్యాచ్‌లల్లో వెస్టిండీస్ గెలిచింది. ఆ తరువాత జరిగిన రెండు మ్యాచ్‌లను గెలచుకుని సిరీస్‌ను 2-2తో సమం చేసింది భారత్. డిసైడర్ మ్యాచ్‌లో తడబాటును ప్రదర్శించింది. బౌలింగ్ డిపార్ట్‌మెంట్ అట్టర్ ఫ్లాప్ అయింది. భారత్ నిర్దేశించిన 165 పరుగుల లక్ష్యాన్ని ఇంకా రెండు ఓవర్లు మిగిలివుండగానే ఛేదించింది వెస్టిండీస్. 18 ఓవర్లల్లో రెండు వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది.

Ind vs Wi

లాడర్‌హిల్ స్టేడియంలో జరిగిన చివరి టీ20లో తొలుత బ్యాటింగ్ చేసింది భారత్. నిర్దేశిత 20 ఓవర్లల్లో తొమ్మిది వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. సూర్యకుమార్ యాదవ్ ఒక్కడే అర్ధసెంచరీతో సత్తా చాటాడు. 45 బంతుల్లో మూడు సిక్సర్లు, నాలుగు ఫోర్లతో 61 పరుగులు చేశాడు.

యశస్వి జైస్వాల్- 5, శుభ్‌మన్ గిల్- 9, తిలక్ వర్మ- 27, సంజు శాంసన్- 13, హార్దిక్ పాండ్యా-14, అక్షర్ పటేల్- 13, అర్ష్‌దీప్ సింగ్-8, కుల్‌దీప్ యాదవ్-0 పరుగులు చేశారు. విండీస్ బౌలర్లల్లో రొమారియో షెప్పర్డ్ విజృంభించాడు. నాలుగు ఓవర్లల్లో 31 పరుగులు ఇచ్చి నాలుగు వికెట్లు కూల్చాడు. అకీల్ హొస్సైన్, జేసన్ హోల్డర్ రెండు చొప్పున, రొస్టన్ ఛేజ్ ఒక వికెట్ తీసుకున్నారు.

Tilak Varma

అనంతరం బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్.. తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. ఆ జట్టు ఓపెనర్లు తొలి ఓవర్ నుంచి భారత్ బౌలర్లపై విరుచుకుపడ్డారు. కైలే మేయర్స్ 10 పరుగులకే అవుట్ అయినా.. ఆ తరువాత వచ్చిన నికొలస్ పూరన్, మరో ఓపెనర్ బ్రెండన్ కింగ్.. దుమ్ము లేపారు. 10కి పైగా రన్‌రేట్‌ను నమోదు చేశారు.

జట్టు స్కోరు 13.2 ఓవర్లల్లో 119 పరుగుల వద్ద ఉన్నప్పుడు నికొలస్ పూరన్ అవుట్ అయ్యాడు. 35 బంతుల్లో నాలుగు భారీ సిక్సర్లు, ఒక ఫోర్ కొట్టిన పూరన్.. తిలక్ వర్మ బౌలింగ్‌లో హార్దిక్ పాండ్యాకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అప్పటికే వెస్టిండీస్ సేఫ్ జోన్‌కు చేరిపోయింది. ఆ తరువత కొద్దిసేపు వర్షం ఆటంకం కలిగించింది గానీ.. టీమిండియా పరాజయాన్ని మాత్రం అడ్డుకోలేకపోయింది.

Pooran

పూరన్ అవుట్ అయిన తరువాత క్రీజ్‌లోకి వచ్చిన షై హోప్.. అప్పటికే క్రీజ్‌లో పాతుకుపోయిన బ్రెండన్ కింగ్.. భారత్ బౌలర్లకు ఏ మాత్రం అవకాశం ఇవ్వలేదు. మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడ్డారు. బౌలర్లపై ఎదురుదాడికి దిగారు. ఇంకా రెండు ఓవర్లు మిగిలివుండగానే లక్ష్యాన్ని ఛేదించారు. 2-3 తేడాతో సిరీస్‌ను సొంతం చేసుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+