• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

పృథ్వీ షా ఫెయిల్యూర్స్..కంటిన్యూస్: అధ్వాన్న బ్యాటింగ్: రెండో బంతికే: కోహ్లీ..ఏరికోరి

|

అడిలైడ్: భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య సుదీర్ఘమైన టెస్ట్ సిరీస్.. ఏ మాత్రం ఆశాజనకంగా ఆరంభం కాలేదు. నాలుగు టెస్ట్ మ్యాచ్‌లో ఈ సిరీస్‌ తొలి మ్యాచ్‌.. తొలి నిమిషంలోనే భారత క్రికెట్ జట్టు తడబాటును ప్రదర్శిస్తోంది. తక్కువ పరుగులకే ఓపెనర్లను కోల్పోయింది. టెస్టుల్లో సుదీర్ఘమైన ఇన్నింగ్‌ను ఆడాల్సిన ఓపెనర్ పృథ్వీ షా దారుణంగా విఫలం అయ్యాడు. ఇన్నింగ్ రెండో బంతికే క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. ఆస్ట్రేలియా ఓపెనింగ్ బౌలర్ మిఛెల్ స్టార్క్ సంధించిన బంతిని ఆడలేక పోయాడు. బంతి ఎడ్జ్ తీసుకుని బెయిల్స్‌ను గాల్లోకి లేపింది.

డే/నైట్ మ్యాచ్. బ్యాడ్ బిగినింగ్

డే/నైట్ మ్యాచ్. బ్యాడ్ బిగినింగ్

కేప్టెన్ విరాట్ కోహ్లీ.. ఏరికోరి మరీ అతణ్ని తుది జట్టులోకి తీసుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ రెండు జట్ల మధ్య తొలి డే/నైట్ టెస్ట్ మ్యాచ్.. అడిలైడ్‌ స్టేడియంలో ఆరంభమైంది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు విరాట్ కోహ్లీ. పృథ్వీ షా, మయాంక్ అగర్వాల్ ఇన్నింగ్‌ను ఆరంభించారు. స్కోర్ బోర్డు మీద ఒక్క పరుగు కూడా జమ కాకముందే.. వికెట్‌ను కోల్పోయింది టీమిండియా. ఇన్నింగ్ రెండో బంతికే పృథ్వీ షా పెవిలియన్ చేరాడు. మిఛెల్ స్టార్క్ సంధించిన గుడ్‌లెంగ్త్ ఇన్‌స్వింగర్‌కు బలి అయ్యాడు.

బంతిని అంచనా వేయలేక..

బంతిని అంచనా వేయలేక..

ఆఫ్ స్టంప్‌కు అవతల పడి అనూహ్యంగా ఇన్‌స్వింగ్ అయిన బంతిని కవర్స్ వైపు ఆడటానికి ప్రయత్నించాడు పృథ్వీ షా. పిచ్ పడి గాల్లోకి లేచిన ఆ బంతిని ఏ మాత్రం అంచనా వేయలేకపోయాడు. కవర్స్ వైపు ఆడటానికి ప్రయత్నించిన అతని బ్యాట్‌ను ముద్దాడుతూ వెళ్లి. బెయిల్స్‌ను ఎగుర గొట్టేసింది. పృథ్వీ షా వరుస వైఫల్యాలకు అతని బ్యాటింగ్ అద్దం పట్టింది. ఇంతకుముందు- ఇండియన్ ప్రీమియర్ లీగ్-2020 సీజన్‌లోనూ అతను వరుసగా విఫలమౌతూ వచ్చాడు. ఐపీఎల్-2020లో మూడుసార్లు అతను సున్నాకే అవుట్ అయ్యాడు. ఒకదశలో టీమిండియాకు ఎంపిక అయ్యేది కూడా కష్టమేనని భావించారు.

మయాంక్.. రెండో వికెట్..

మయాంక్.. రెండో వికెట్..

తొలి ఓవర్.. రెండో బంతికే పృథ్వీ షా రూపంలో వికెట్‌ను కోల్పోయిన టీమిండియాకు ప్యాట్ కమ్మిన్స్ షాక్ ఇచ్చాడు. రెండో వికెట్‌ను పడగొట్టాడు. మరో ఓపెనర్ మయాంక్ అగర్వాల్‌ను పెవిలియన్ దారి పట్టించాడు. కమిన్స్ సంధించిన గుడ్‌లెంగ్త్ బంతికి మయాంక్.. క్లీన్ బౌల్డ్ అయ్యాడు. డిఫెన్స్ ఆడటానికి ప్రయత్నించిన అతను బ్యాట్‌ను అడ్డు పెట్టేలోపే.. బుల్లెట్‌టా దూసుకెళ్లందా బాల్. వికెట్లను గిరాటేసింది. అతను అవుట్ అయ్యే సమయానికి భారత జట్టు రెండు వికెట్ల నష్టానికి 32 పరుగులు. 40 బంతులను ఎదుర్కొన్న మయాంక్ అగర్వాల్.. రెండు ఫోర్లతో 17 పరుగులు చేశాడు. ప్రస్తుతం విరాట్ కోహ్లీ, చేతేశ్వర్ పుజారా క్రీజ్‌లో ఉన్నారు.

ప్రాక్టీస్ మ్యాచ్‌లోనూ డకౌట్..

ప్రాక్టీస్ మ్యాచ్‌లోనూ డకౌట్..

ఇదివరకు టెస్ట్ మ్యాచుల్లో జట్టు ఇన్నింగ్‌ను ఆరంభించిన పృథ్వీ షా ప్రస్తుతం.. ఏ మాత్రం ఫామ్‌లో ఉండట్లేదు. ఐపీఎల్‌లో టోర్నమెంట్‌లో మూడుసార్లు డకౌట్ అయిన అతను.. తన ఆటతీరును ఏ మాత్రం మెరుగుపర్చుకోలేకపోతున్నాడు. ఆస్ట్రేలియా-ఏ టీమ్‌తో జరిగిన ప్రాక్టీస్‌ మ్యాచ్‌లోనూ ఓ ఇన్నింగ్‌లో సున్నాకే అవుట్ అయ్యాడు. ఆత్మస్థైర్యాన్ని కోల్పోయాడు. మిగిలిన ఇన్నింగ్‌లల్లోనూ భారీ స్కోరును నమోదు చేయలేకపోయాడు. ఈ పరిస్థితుల్లో పృథ్వీ షాను ఓపెనర్‌గా పంపించి.. టీమిండియా సాహసం చేసింది. జట్టు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకోలేకపోయాడతను.

English summary
Team India opener Prithvi Shaw had a nightmarish start to the Australian summer as he was dismissed for a second-ball duck in the opening session of the Pink Ball Test on Thursday at the Adelaide Oval.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X