వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రవిశాస్త్రి మెడకు టీమిండియా ఘోర వైఫల్యం: ద్రవిడ్‌ను కోచ్‌గా: కోహ్లీ స్థానంలో రోహిత్ రీప్లేస్?

|
Google Oneindia TeluguNews

అడిలైడ్: ఒక్క దారుణ పరాజయం..భారత క్రికెట్ జట్టును అథోఃపాతాళానికి తొక్కేసింది. టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఇప్పటిదాకా సాధించుకున్న ప్రతిష్ఠను మసకబారేలా చేసింది. 36 పరుగులకే టీమిండియా బ్యాటింగ్ లైనప్ పేకమేడలా కుప్పకూలిపోవడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఇలాంటి ఓటమిని వైఫల్యాన్ని ఎప్పుడూ చూడలేదని అభిమానులు, నెటిజన్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికి ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నిస్తున్నారు. ఈ వైఫల్యానికి భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) వివరణ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.

Recommended Video

Ind vs Aus 1st Test : Remove Ravi Shastri- Bring Rahul Dravid as Team India Coach : Netizens Demands

96 ఏళ్ల నాటి టెస్ట్ క్రికెట్ చరిత్రను తిరగరాసిన టీమిండియా .. 1924 తరువాత తొలిసారిగా: ఏంటా చెత్త రికార్డు?96 ఏళ్ల నాటి టెస్ట్ క్రికెట్ చరిత్రను తిరగరాసిన టీమిండియా .. 1924 తరువాత తొలిసారిగా: ఏంటా చెత్త రికార్డు?

లక్ష్యం వైపు ఆసీస్..

ఆస్ట్రేలియాతో అడిలైడ్‌ స్టేడియంలో జరుగుతోన్న తొలి టెస్ట్ మ్యాచ్‌లో భారత క్రికెట్ జట్టు ఘోరంగా విఫలం చెందిన విషయం తెలిసిందే. రెండో ఇన్నింగ్‌లో తొమ్మిది వికెట్ల నష్టానికి 36 పరుగులు చేసింది. టెయిలెండర్ బ్యాట్స్‌మెన్ మహ్మద్ షమీ చేతికి గాయం కావడంతో అతను రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు. దీనితో 36 పరుగుల వద్ద కేప్టెన్ విరాట్ కోహ్లీ ఇన్నింగ్‌ను డిక్లేర్ చేశాడు. తొలి ఇన్నింగ్‌లో సాధించిన ఆధిక్యతను కలుపుకొంటే.. 90 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా.. ఆస్ట్రేలియా ముందు ఉంచింది. ఈ చిన్నపాటి లక్ష్యాన్ని ఛేదించే వైపు దూసుకెళ్తోంది ఆసీస్ టీమ్.

రిమూవ్ రవిశాస్త్రి..

ఈ ఘోర పరాభవానికి, బ్యాటింగ్ వైఫల్యానికి క్రికెట్ అభిమానులు దిగ్బ్రాంతికి లోనవుతున్నారు. ఇంత దారుణ స్కోర్‌బోర్డును ఎప్పుడూ చూడలేదని అంటున్నారు. దీనికి నైతిక బాధ్యతను హెడ్ కోచ్ రవిశాస్త్రి తీసుకోవాల్సి ఉంటుందని డిమాండ్ చేస్తున్నారు. రవిశాస్త్రిని వెంటనే తొలగించాలని పట్టుబడుతున్నారు. ట్వీట్లతో సోషల్ మీడియాను మోతెక్కిస్తున్నారు. రవిశాస్త్రికి బదులుగా టీమిండియా మాజీ కేప్టెన్ రాహుల్ ద్రవిడ్‌ను కోచ్‌గా నియమించాలని సూచిస్తున్నారు. రాహుల్ ద్రవిడ్.. జట్టును విజయం వైపు నడిపించే సమర్థుడని కితాబిస్తున్నారు.

విరాట్ కోహ్లీ స్థానంలో రోహిత్ శర్మ..

కేప్టెన్‌గా విరాట్ కోహ్లీని తొలగించి.. అతని స్థానంలో రోహిత్ శర్మను నియమించాలనే డిమాండ్ కూడా ఊపందుకుంటోంది. నిజానికి- విరాట్ కోహ్లీకి ఇదే చివరి టెస్ట్ మ్యాచ్. ఈ మ్యాచ్ అనంతరం అతను స్వదేశానికి తిరుగుముఖం పట్టబోతోన్నాడు. మూడో టెస్ట్‌కు అజింక్య రహానే సారథ్యాన్ని వహించే అవకాశం ఉంది. చివరి రెండింటికీ రోహిత్ శర్మ పగ్గాలను అందుకోబోతోన్నాడు. విరాట్ కోహ్లీ గైర్హాజరీలో రోహిత్ శర్మ.. తన సారథ్యంలో చివరి రెండు మ్యాచ్‌ల్లో భారత్‌ను గెలిపించగలిగితే.. ఇక శాశ్వతంగా కొనసాగే అవకాశాలు లేకపోలేదు.

ఐపీఎల్ 2020 నుంచే బీజం..

ఇప్పటికే.. ఆస్ట్రేలియా టోర్నమెంట్ ఆరంభం నుంచీ రోహిత్‌కు కేప్టెన్సీని అప్పగించాలనే డిమాండ్ వినిపిస్తోంది. దీనికి ఈ దారుణ వైఫల్యం తోడు కావడంతో.. కోహ్లీ కేప్టెన్సీకి ఎసరు పడినట్టే కనిపిస్తోంది. రోహిత్ శర్మతో పోల్చుకుంటే విరాట్ కోహ్లీ ఐపీఎల్ ట్రాక్ రికార్డు ఏ మాత్రం బాగోలేదు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు కేప్టెన్‌గా విరాట్ కోహ్లీ..ఒక్కసారి కూడా జట్టుకు ట్రోఫీని అందించలేకపోయాడు. ఫైనల్‌కు చేరిన సందర్భాలు కూడా నామమాత్రమే. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా సాగిన ఐపీఎల్-2020 సీజన్‌లోనూ అదే పరిస్థితి. టోర్నమెంట్ లీగ్ దశలో ఆర్సీబీ వరుస విజయాలను అందుకున్నప్పటికీ.. మ్యాచ్‌లు సాగుతున్న కొద్దీ డీలా పడింది. అతి కష్టం మీద ప్లేఆఫ్‌కు చేరుకుంది. అక్కడా బోల్తా కొట్టింది.

English summary
Fans and Netizens demad for Remove Ravi Shastri as Coach of India Cricket team and bring Rahul Dravid. Netizens wanted that Rahul Dravid is the best choice for Team India's Coach instead of Ravi Shastri.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X