రెండో టెస్ట్: హైదరాబాదీ సిరాజ్ పరాక్రమం: 16 ఏళ్ల రికార్డ్ తుక్కు: అరుదైన బౌలర్‌గా: మలింగ
మెల్బోర్న్: భారత క్రికెట్ జట్టుకు ప్రాతినిథ్యాన్ని వహిస్తోన్న హైదరాబాదీ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్.. ఆస్ట్రేలియా జట్టు వెన్ను విరిచాడు. బ్యాటింగ్ లైనప్‌ను ధ్వంసం చేశాడు. ఆస్ట్రేలియాపై ఆడిన తొలి టెస్ట్ మ్యాచ్‌లోనే అయిదు వికెట్లను పడగొట్టిన మొనగాడిగా నిలిచాడు. తొలి ఇన్నింగ్‌లో రెండు, రెండో ఇన్నింగ్‌లో మూడు కీలక వికెట్లను తీసుకున్నారు. ఆస్ట్రేలియా జట్టు భారీ స్కోరును సాధించడాన్ని అడ్డుకోగలిగాడు. ఫలితంగా- ఆస్ట్రేలియా జట్టు 70 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని టీమిండియా ముందు ఉంచగలిగింది.
రేవంత్ రెడ్డి నుంచి ప్రాణభయం: డీజీపీకి లేఖ రాసిన వీహెచ్: రక్షణ కల్పించాలంటూ
200 పరుగులకు ఆలౌట్
మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్లో ఆరు వికెట్ల నష్టానికి 133 పరుగుల ఓవర్‌నైట్ స్కోర్‌తో నాలుగో రోజు ఆటను ఆరంభించిన ఆస్ట్రేలియా.. ఏ దశలోనూ కోలుకోలేకపోయింది. కనీస ప్రతిఘటన ఇవ్వలేకపోయింది. భారత బౌలింగ్ దాడిని ధీటుగా ఎదుర్కొనలేకపోయింది. మహ్మద్ సిరాజ్, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రా విజృంభణకు తల వచ్చింది. సెకండ్ ఇన్నింగ్స్‌లో మరో 67 పరుగులను మాత్రమే జోడించ గలిగింది. 200 పరుగులకు ఆలౌట్ అయింది. సిరాజ్ మూడు వికెట్లు తీసుకున్నాడు. బుమ్రా, అశ్విన్, జడేజా రెండేసి వికెట్లు పడగొట్టారు.
లసిత్ మలింగ సరసన..
రెండో టెస్ట్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఆర్డర్ కుప్పకూలడంలో కీలక పాత్ర పోషించాడు మహ్మద్ సిరాజ్. తొలి ఇన్నింగ్‌లో రెండు, మలి ఇన్నింగ్‌లో మూడు వికెట్లను పడగొట్టాడు. రెండో ఇన్నింగ్‌లో ట్రవిస్ హెడ్, కామెరూన్ గ్రీన్, నాథన్ లియాన్‌ను పెవిలియన్ దారి పట్టించాడు. తొలి ఇన్నింగ్‌లో మార్ముస్ లాంబుషేన్, కామెరూన్ గ్రీన్‌లను అవుట్ చేశాడు. సిరాజ్‌కు ఆస్ట్రేలియాపై ఆస్ట్రేలియాలో ఇదే తొలిటెస్ట్. ఆడిన తొలి మ్యాచ్‌లోనే అయిదు వికెట్లను పడగొట్టిన అరుదైన బౌలర్ల జాబితాలో చోటు దక్కించుకున్నాడు. ఇదివరకు శ్రీలంక పేసర్ లసిత్ మలింగ ఈ ఫీట్‌ను సాధించాడు.
16 సంవత్సరాల తరువాత..
2004లో లసిత్ మలింగ ఈ రికార్డును నెలకొల్పాడు. 2004లో ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన శ్రీలంక జట్టులో కొత్త ముఖంగా చేరిన మలింగ.. కంగారూల జట్టును ఠారెత్తించాడు. మహ్మద్ షమీ గాయపడటంతో తుదిజట్టులోకి చోటు దక్కించుకున్న అతను తాను ఆడిన తొలి టెస్ట్ మ్యాచ్‌లో 92 పరుగులకు ఆరు వికెట్లను పడగొట్టాడు. ఆ తరువాత ఆస్ట్రేలియాలపై తొలి టెస్ట్ ఆడిన ఓ బౌలర్.. అయిదు వికెట్లను అందుకోవడం ఇదే తొలిసారి. ఇదివరకు ఫిల్ డెఫ్రిటాస్-94 పరుగులుకు అయిదు వికెట్లు, అలెక్స్ ట్యూడర్-108 పరుగులకు అయిదు వికెట్లను పడగొట్టారు. ఈ ముగ్గురి సరసన హైదరాబాదీ బౌలర్ సిరాజ్ చేరాడు.

టీమిండియా తరఫున ఏడేళ్ల తరువాత..
టీమిండియా తరఫున కూడా ఏడేళ్ల కిందటి రికార్డు బద్దలైంది. ఇదివరకు రవిచంద్రన్ అశ్విన్.. ఈ రికార్డును అందుకున్నాడు. ఆడిన తొలి టెస్ట్ మ్యాచ్‌లో అయిదు వికెట్లను పడగొట్టాడు. వెస్టిండీస్‌పై ఈ ఘనతను సాధించాడు. 2011 నవంబర్‌లో న్యూఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా మైదానంలో వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో అశ్విన్.. తొమ్మిది వికెట్లను తీసుకున్నాడు. తాజాగా- సిరాజ్ సాధించిన ఈ అరుదైన రికార్డు పట్ల సోషల్ మీడియాలో అతనిపై ప్రశంసల వర్షం కురుస్తోంది. లక్షలాదిమంది అభిమానులు అతణ్ని ఆకాశానికెత్తేస్తున్నారు.