వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పాక్‌కి షాక్: కులభూషణ్ మరణశిక్షపై ఇంటర్నేషనల్ కోర్టు స్టే, భారత్ హర్షం

పాకిస్థాన్‌కు అంతర్జాతీయ న్యాయస్థానం షాకిచ్చింది. భారత నేవీ మాజీ అధికారి కులభూషణ్‌ జాదవ్‌కు పాకిస్థాన్‌ విధించిన మరణశిక్షపై అంతర్జాతీయ కోర్టు స్టే విధించింది.

|
Google Oneindia TeluguNews

దిహేగ్: పాకిస్థాన్‌కు అంతర్జాతీయ న్యాయస్థానం షాకిచ్చింది. భారత నేవీ మాజీ అధికారి కులభూషణ్‌ జాదవ్‌కు పాకిస్థాన్‌ విధించిన మరణశిక్షపై అంతర్జాతీయ కోర్టు స్టే విధించింది.

భారత్ అప్పీలు

నేవీ నుంచి పదవీ విరమణ పొందిన తర్వాత ఇరాన్‌లో వ్యాపారం చేసుకుంటున్న జాదవ్‌ను కిడ్నాప్‌ చేశారని అంతర్జాతీయ కోర్టుకు భారత్‌ సోమవారం అప్పీలు చేసుకుంది. దీనిపై నివేదిక అందించింది. దీంతో అతడి మరణశిక్షపై న్యాయస్థానం స్టే విధించింది.

పాక్ ప్రధానికి లేఖ

ఈ మేరకు పాక్‌ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌కు లేఖ పంపించినట్లు అధికార వర్గాల సమాచారం. అంతర్జాతీయ కోర్టు న్యాయస్థానం తీర్పుపై కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్‌ హర్షం వ్యక్తం చేశారు. కోర్టు నిర్ణయాన్ని కులభూషణ్‌ జాదవ్‌ తల్లికి చెప్పినట్లు ఆమె ట్వీట్‌ చేశారు.

కిడ్నాప్ చేసి..

గూఢచర్యం, విద్రోహచర్యలకు పాల్పడ్డారన్న ఆరోపణలతో జాదవ్‌కు పాక్‌ ప్రభుత్వం ఇటీవల మరణశిక్ష విధించిన విషయం తెలిసిందే. గత సంవత్సరం మార్చిలో జాదవ్‌ను బలూచిస్థాన్‌ నుంచి అరెస్టు చేసినట్లు పాక్‌ చెబుతోంది. అయితే ఈ చర్యపై భారత్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

పాక్‌కు హెచ్చరిక

పాక్‌కు హెచ్చరిక

జాదవ్‌ ఇరాక్‌లో వ్యాపారం చేసుకుంటున్నారని, అతడిని కిడ్నాప్‌ చేసి, తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని పాక్‌పై మండిపడింది. జాదవ్‌కు మరణశిక్ష అమలు చేస్తే పథకం ప్రకారం చేసిన హత్యగా భావించాల్సి వస్తుందని పాకిస్థాన్‌ను హెచ్చరించింది. అయితే పాక్‌ మాత్రం తమ వద్ద ఆధారాలున్నాయంటూ జాదవ్ మరణశిక్షను సమర్థించుకుంది. కాగా, అంతర్జాతీయ న్యాయస్థానం జాదవ్ మరణశిక్షపై స్టే విధించడంపై భారత్ హర్షం వ్యక్తం చేసింది.

జాదవ్ విచారణ కోరిన ఇరాన్

భారత గూఢచారి అంటూ పాకిస్థాన్ మిలిటరీ కోర్టు మరణశిక్ష విధించిన భారత మాజీ నేవీ అధికారి కులభూషణ్ జాదవ్‌ను విచారించేందుకు అనుమతివ్వాలని ఇరాన్.. పాకిస్థాన్‌ను కోరింది. ఈ మేరకు పాక్ మీడియా కథనాలు పేర్కొన్నాయి.

English summary
It was a major victory for India as the International Court of Justice at The Hague stayed the execution of Kulbhushan Jadhav. The ICJ has written to Pakistan to put on hold the execution of Jadhav, the retired Indian Navy officer who was convicted of espionage by a military court in Pakistan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X