వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

డిజిటల్ చెల్లింపులపై డిస్కౌంట్ ఈ రాత్రి నుంచే

పెట్రోల్ బంకుల్లో డిజిటల్ చెల్లింపులపై 0.75 శాతం డిస్కౌంట్ ఈ అర్థరాత్రి నుంచి అమలులోకి రానుంది. నగదు రహిత లావాదేవీలు ప్రోత్సహించడానికి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

By Pratap
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ప్రభుత్వ ఆధ్వర్యంలోని పెట్రోల్ బంకుల్లో డిజిటల్ చెల్లింపులపై 0.75 శాతం డిస్కౌంట్ నిర్ణయం సోమవారం అర్ధరాత్రి నుంచి అమలు కానుంది. నగదురహిత లావాదేవీలను ప్రోత్సహించడానికి కేంద్రం కొద్ది రోజుల కిందట ఈ నిర్ణయాన్ని ప్రకటించింది.

పెట్రోల్, డీజిల్ కొనుగోలుకు డెబిట్, క్రెడిట్ కార్డులు, మొబైల్ వ్యాలెట్‌ ఉపయోగించిన వారికి ఈ రాయితీ లభిస్తుంది. ఇది మూడు రోజుల్లోగా క్యాష్‌బ్యాక్‌ మాదిరిగా వినియోగదారుడి ఖాతాకు జమవుతుంది. డిజిటల్ లావాదేవీలను పెంచడానికి ప్రభుత్వం డిసెంబర్ 8వ తేదీన కొన్ని నిర్ణయాలను ప్రకటించింది. అందులో పెట్రోల్ బంకుల్లో డిజిటల్ చెల్లింపులపై డిస్కౌంట్ ఇవ్వడం ఒకటి.

సబర్బన్ టికెట్ కౌంటర్లు, బీమా విధానాలు వంటివాటిల్లో డిజిటల్ చెల్లింపులకు డీస్కౌంట్స్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ డిస్కౌంట్లు అమలయ్యే తేదీలను మాత్రం ప్రకటించలేదు. ప్రభుత్వ రంగ చమురు సంస్థలు ఆ నిర్ణయం వెలుడినప్పటి నుంచి బ్యాంకులతో, ఈ వ్యాలెట్ కంపెనీలతో, సర్వీస్ ప్రొవైడర్లతో ఏలా అమలు చేయాలనే విషయంపై చర్చలు జరుపుతూ వచ్చాయి.

petrol bunk

చివరకు సోమవారం అర్థరాత్రి నుంచి అమలు చేయడానికి సిద్ధమయ్యాి. గరిష్టంగా మూడు పనిదినాల్లో డిస్కౌంట్ మొత్తాలు క్యాష్ బ్యాక్ పద్ధతిలో కస్టమర్ ఖాతాల్లో జమ అవుతాయి.

English summary
The government on Monday announced that customers buying petrol and diesel at State-run pumps will get a 0.75 per cent discount if they pay using their credit or debit cards from December 13 onwards.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X