• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఎలుకలు న్యూఇయర్ పార్టీ చేసుకున్నాయా..? వెయ్యి లీటర్ల మద్యం తాగేశాయట..!

|

బరేలి: కల్లు తాగిన కోతి గురించి మీరు వినే ఉంటారు... మరి మందు తాగిన మూషికం గురించి విన్నారా...? ఇదేదో కబుర్లు చెప్పడం కాదండీ... నిజంగా ఎలుకలే మందు కొట్టాయట. ఇదేదో మేము చెబుతున్నది కాదు.. సాక్షాత్తు పోలీసులే చెబుతున్నారు. ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా 1000 లీటర్ల మద్యాన్ని ఎలుకలు తాగాయని బరేలీ కంటోన్మెంట్ పోలీసులు చెబుతున్నారు.

మాయమైన వెయ్యి లీటర్ల మద్యం

మాయమైన వెయ్యి లీటర్ల మద్యం

ఇక అసలు విషయానికి వస్తే.... అక్రమ మద్యంను పోలీసులు స్వాధీనం చేసుకుని స్టోర్ హౌజ్‌లో ఉంచారు. దాదాపు వెయ్యి లీటర్ల మద్యాన్ని పోలీసులు స్టోర్ హౌజ్‌లో ఉంచారు. అయితే నిల్వ ఉంచిన మద్యం ఒక్కసారిగా మాయమైంది. ఇదేంటని ప్రశ్నిస్తే ఎలుకలు తాగాయనే సమాధానం పోలీసుల నుంచి వచ్చింది. ఇలా ఎలుకలు ఒక్క మందు కొట్టడం బరేలీలో తొలిసారి కాదు.. అంతకుముందు బీహార్‌లో కూడా ఎలుకలు మద్యాన్ని తాగేశాయనే వార్తలు వచ్చాయి. మద్యంతో పాటు జార్ఖండ్‌లో మాదక ద్రవ్యాలు, అస్సోంలో డబ్బు కట్టలను తినేసిన ఉదంతాలు వెలుగు చూశాయి.అంతేకాదు బీహార్‌లో వరదలు వస్తే అవి ఎలుకల వల్లే వచ్చాయని ఓ మంత్రి వ్యాఖ్యలు చేయడం కూడా అప్పట్లో షికారు చేసింది. మొత్తానికి ఎలుకలు ఇన్ని దొంగపనులు చేస్తుంటే అధికార యంత్రాంగం ఏమి చేస్తోందంటూ సోషల్ మీడియాలో నెటిజెన్లు ప్రశ్నిస్తున్నారు.

మద్యాన్ని ఎలుకలే తాగేశాయన్న పోలీసులు

మద్యాన్ని ఎలుకలే తాగేశాయన్న పోలీసులు

ఇక తాజాగా బరేలీలోని ఓ స్టోర్‌హౌజ్‌లో స్వాధీనం చేసుకున్న మద్యం మాయమవడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఓ కుక్క ఆ స్టోర్ హౌజ్‌లోకి దూరింది . కొన్ని రోజుల తర్వాత అది చనిపోయింది. గది నుంచి దుర్వాసన రావడంతో ఆ తలుపులు తెరిచి చూశారు అధికారులు. చనిపోయి ఉన్న కుక్కను గమనించడంతో పాటు మాయమైన మద్యంను కూడా చూశారు. దీనిపై ఆరా తీయగా ఎలుకలు మద్యంను తాగి ఉంటాయనే సమాధానం పోలీసుల నుంచి వినిపించడం హాస్యాస్పదంగా మారింది. అయితే దీనిపై విచారణకు ఆదేశించారు ఎస్పీ అభినందన్ సింగ్. అసలు ఎలుకలే మద్యాన్ని తాగాయా లేక ఎవరైనా మాయం చేశారా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

 వెయ్యి లీటర్ల మద్యంను ఎలుకలు తాగడం అసాధ్యం: ప్రొఫెసర్

వెయ్యి లీటర్ల మద్యంను ఎలుకలు తాగడం అసాధ్యం: ప్రొఫెసర్

స్వాధీనం చేసుకున్న మద్యంను శాంపిల్స్ కోసం కొంత తీసుకుని మిగతావాటిని ధ్వంసం చేయాలని తాను అధికారులకు పలుమార్లు లేఖ రాసినప్పటికీ ఎవరూ పట్టించుకోలేదని చెప్పాడు కంటోన్మెంట్ స్టోర్ హౌజ్ క్లర్క్ నరేష్ పాల్. ఇదిలా ఉంటే ఎలుకలు ఒకే చోట ఉంటే.. వాటికి నీటి సదుపాయం లేకపోతే కొంతవరకు మద్యం తీసుకునే అవకాశం ఉందని బరేలీ కాలేజీలో జువాలజీ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న ఓ వ్యక్తి చెప్పారు. అయితే వెయ్యిలీటర్ల మద్యంను ఎలుకలు తాగాయంటే అది నమ్మశక్యంగా లేదని చెప్పారు. మద్యం వాసన ఎలుకలకు పడదని చెప్పిన ఆయన వెయ్యి లీటర్ల మద్యం ఎలుకలు తాగడం అసాధ్యం అని అన్నారు. ఈ మద్యం బాటిళ్లను ఎవరో దొంగతనం చేసి ఉంటారనే అభిప్రాయం ఆయన వ్యక్తం చేశారు.

English summary
Over 1000 litres of seized liquor kept in the storehouse of Bareilly’s Cantonment police station has disappeared and local policemen blame rats for guzzling it down.Rats have also earlier been blamed for polishing off seized liquor in dry Bihar, narcotics in Jharkhand and currency notes in Assam. They were also held guilty of causing floods in Bihar.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X