వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రైల్వే బుకింగ్స్ జోష్: కేవలం 2 గంటల్లోనే లక్షా50వేల టికెట్ల అమ్మకాలు

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా కరోనా లాక్‌డౌన్ సడలింపుల నేపథ్యంలో సుమారు 2 నెలల తర్వాత భారత రైల్వే తన సేవలను ప్రారంభిస్తున్న విషయం తెలిసిందే. జూన్ 1 నుంచి నడపబోయే రైళ్లకు ముందస్తు రిజర్వేషన్‌ను గురువారం నుంచి ప్రారంభించడంతో రైలు టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడైపోయాయి.

 ఎస్ఐ సహకారం: కరోనా స్పెషల్ డీఎస్పీనంటూ అక్రమాలకు తెగబడ్డ వ్యక్తి అరెస్ట్ ఎస్ఐ సహకారం: కరోనా స్పెషల్ డీఎస్పీనంటూ అక్రమాలకు తెగబడ్డ వ్యక్తి అరెస్ట్

బుకింగ్ ప్రారంభించిన కేవలం 2 గంటల్లోనే 1.50లక్షల టికెట్లు విక్రయించినట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. మొత్తం 200 రైళ్లకు గానూ మధ్యాహ్నం 12 గంటల వరకు కేవలం 73 రైళ్లకు మాత్రమే టికెట్లు మిగిలాయని రైల్వే అధికారి తెలిపారు. 2,90,510 మంది ప్రయాణికులకు గానూ 1,49,025 టికెట్లు జారీ చేసినట్లు వెల్లడించారు.

1.4 lakh tickets booked 73 trains within 2 hrs of opening, says Railways.

కేటాయించిన టికెట్లు పూర్తయిన తర్వాత 200 వరకు వెయిటింగ్ లిస్ట్ టికెట్లను అవకాశం కల్పిస్తున్నామని తెలిపారు. జూన్ 1 నుంచి 17 జన్ శతాబ్ది, ఐదు దురంతో ఎక్స్ ప్రెస్, సంపర్క్ క్రాంతి, పూర్వ ఎక్స్ ప్రెస్ లాంటి రైళ్లు కూడా నడుస్తాయని తెలిపారు. వీటితోపాటు ఏసీ, నాన్ ఏసీ రైళ్లు నడుస్తాయని చెప్పారు.

ముంబై-హైదరాబాద్ హుస్సేన్ సాగర్ ఎక్స్ ప్రెస్(02701/02), హౌరా-సికింద్రాబాద్ ఫలక్ నుమా ఎక్స్‌ప్రెస్ (02703/04), హైదరాబాద్- న్యూఢిల్లీ తెలంగాణ ఎక్స్‌ప్రెస్(02723/24), దానాపూర్-సికింద్రాబాద్ దానాపూర్ ఎక్స్‌ప్రెస్(02791/92), సికింద్రాబాద్-హజ్రత్ ఎక్స్‌ప్రెస్(02285/86-వారానికి రెండు సార్లు)

విశాఖపట్నం-ఢిల్లీ ఏపీ ఎక్స్‌ప్రెస్(02805/06), గుంటూరు-సికింద్రాబాద్ గోల్కొండ ఎక్స్‌ప్రెస్ (07201/02), తిరుపతి-నిజామాబాద్ రాయలసీమ ఎక్స్‌ప్రెస్(02793/94), హైదరాబాద్-విశాఖపట్నం గోదావరి ఎక్స్‌ప్రెస్(02727/28)

English summary
1.4 lakh tickets booked 73 trains within 2 hrs of opening, says Railways.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X