వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కరోనా లాక్‌డౌన్: నలుగురిలో ఒకరు నిరుద్యోగులుగా, రూరల్ కంటే పట్టణాల్లోనే ఎక్కువ

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో అనేక పరిశ్రమలు, కంపెనీలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో పలు కంపెనీలు కొత్త ఉగ్యోగులను తీసుకోవడం నిలిపివేయడంతోపాటు ఉన్న ఉద్యోగుల్లో కొందర్ని వదిలించుకుంటున్నాయి. దీంతో దేశంలో నలుగురిలో ఒకరు నిరుద్యోగులుగా మారారు.

పెరిగిన నిరుద్యోగితా రేటు..

పెరిగిన నిరుద్యోగితా రేటు..


కాగా, మార్చి 24 నుంచి మనదేశంలో నిరుద్యోగిత రేటు 20శాతం కంటే ఎక్కువగా పెరగడం గమనార్హం. ది సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకనామి(సీఎంఐఈ) ప్రకారం మే 24తో ముగిసిన వారానికి 24.3శాతం నిరుగ్యోగితా రేటు ఉంది. ఏప్రిల్ 20 నుంచి పలు లాక్‌డౌన్ సడలింపులు ప్రకటించినప్పటికీ నిరుద్యోగితా రేటు ఎలాంటి మార్పు కనిపించలేదు.

గ్రామీణం కంటే పట్టణాల్లోనే ఎక్కువ..

గ్రామీణం కంటే పట్టణాల్లోనే ఎక్కువ..

మే 17తో ముగిసిన వారానికి పట్టణ నిరుద్యోగితా రేటు 27 శాతంగా ఉండగా, గ్రామీణ నిరుద్యోగితా రేటు 25 శాతం ఉంది. అంటే పట్టణ నిరుద్యోగితా రేటు గ్రామీణ నిరుగ్యోగితా రేటు కంటే ఎక్కువ ఉంది. లాక్ డౌన్ కారణంగానే అనేక కంపెనీలు ఉద్యోగాల నియామకాలను నిలిపివేయడం గమనార్హం. దీంతోనే నిరుద్యోగితా రేటు మరింత పెరిగింది.

ఉద్యోగుల తొలగింపు.. జీతాల కోతలు..

ఉద్యోగుల తొలగింపు.. జీతాల కోతలు..

ఇప్పుడున్న పరిస్థితిలో ఉద్యోగులను తొలగించడంతోపాటు ఉన్న ఉద్యోగుల జీతాల్లో కోతలను విధిస్తున్నాయి అనేక కంపెనీలు. నష్టాలను భర్తీ చేసుకునేందుకు వస్త్ర దిగ్గజం రేమండ్ వందలమంది ఉద్యోగులను తొలగించింది. ఓలా, ఉబెర్, జోమాటో, స్విగ్గీ లాంటి సంస్థలు కూడా తమ ఉద్యోగులను తగ్గించుకుంటున్నాయి. ఇలాగే అనేక కంపెనీలు జీతాల కోతలు పెట్టడంతోపాటు ఉద్యోగులను తొలగిస్తున్నాయి.

కరోనా లాక్‌డౌన్ తర్వాత తగ్గే అవకాశం..

కరోనా లాక్‌డౌన్ తర్వాత తగ్గే అవకాశం..


కరోనా మహమ్మారి కారణంగా దేశ ఆర్థిక వ్యవస్థ కూడా తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయింది. 2020-21 మూడో త్రైమాసిక ఫలితాలు మరింత ఆందోళనకరంగా ఉండనున్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు. మహమ్మారి కథ ముగిసిన తర్వాత ఉద్యోగుల తొలగింపు, జీతాల కోతలు తగ్గే అవకావం ఉందని డన్ అండ్ బ్రడ్‌స్ట్రీత్ పేర్కొంది. లాక్ డౌన్ సడలింపులు, ఉపసంహరణ అనేవి ఆర్థిక వ్యవస్థపై కీలక ప్రభావం చూపనున్నాయని డీఅండ్ బీ ఇండియా చీఫ్ ఎకనామిస్ట్ అరుణ్ సింగ్ తెలిపారు.

English summary
1/4 of Indians in the working age is unemployed and one out ofevery four workers in rural India is also unemployed.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X