వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

1 కోటి మంది వైద్యారోగ్య సిబ్బందికి ఫస్ట్: వారికి తర్వాత పోలీసు, భద్రతా బలగాలకు వ్యాక్సిన్

|
Google Oneindia TeluguNews

కరోనా వైరస్ టీకా త్వరలో అందుబాటులోకి రానుంది. అయితే పరిమిత సంఖ్యలో వ్యాక్సిన్ రావడంతో ఎవరికీ తొలుత ఇవ్వాలనే చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే చాలాసార్లు స్పష్టంచేయగా.. తాజాగా మరోసారి క్లారిటీ ఇచ్చింది. ప్రభుత్వ/ ప్రైవేట్ విభాగాల్లోని వైద్యారోగ్య సిబ్బందికి తొలుత వ్యాక్సిన్ అందజేస్తామని కేంద్రం స్పష్టంచేసింది. ఇప్పటికే 2 కోట్ల మంది ఫ్రంట్ లైన్ వర్కర్స్‌ను గుర్తించారు. అయితే అందులో కోటి మందికి తొలుత వ్యాక్సిన్ అందజేస్తారు.

వైద్యారోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి వివరించారు. కోటి మందిలో వైద్యులు, నర్సులు ఉంటారని పీటీఐ వార్తా సంస్థ రిపోర్ట్ చేసింది. తర్వాత పోలీసులు, భద్రతా దళాలు, మున్సిపల్ సిబ్బందికి వ్యాక్సిన్ అందజేస్తారు. కరోనా వైరస్ వ్యాక్సిన్ కోసం అఖిలపక్ష సమావేశాన్ని ప్రధాని మోడీ వర్చువల్‌గా నిర్వహించిన సంగతి తెలిసిందే.

1 Crore Healthcare Workers Will Be 1st To Get COVID-19 Vaccine

రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్, హోంమంత్రి అమిత్ షా, వైద్యారోగ్యశాఖ మంత్రి హర్షవర్థన్ కూడా సమావేశంలో పాల్గొన్నారు. కరోనా వైరస్ కోసం టీకా గురించి చర్చించి.. నిర్ణయం తీసుకుంటున్నారు. ఇటీవల ఫార్మా కంపెనీలను ప్రధాని మోడీ సందర్శించిన సంగతి తెలిసిందే. తర్వాత మూడు కంపెనీలతో వర్చువల్ విధానంలో కూడా మీట్ అయ్యారు.

English summary
COVID-19 vaccine will be first given to about one crore health workers from both the public and private sectors Union Health Ministry said
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X