వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కోటి మంది: వలసకూలీలు తరలింపు, శ్రామిక్ రైళ్లలో ఆహారం, నీరు.. మరో కోటి మంది..

|
Google Oneindia TeluguNews

కరోనా వైరస్ లాక్ డౌన్ వల్ల పొట్ట చేత పట్టుకొని వచ్చిన వలసకూలీలు తమ స్వస్థలాలకు వెళ్లిపోయారు. మార్చి నుంచి ఇప్పటివరకు అలా కోటి మంది వరకు తమ స్వగ్రామాలకు చేరుకున్నారు. సోమవారం లోక్ సభలో సభ్యులు అడిగిన ప్రశ్నకు కేంద్రమంత్రి సంతోష్ కుమార్ గంగ్వార్ రాతపూర్వక సమాధానం ఇచ్చారు.

దేశంలో 4 కోట్ల మంది వలసకూలీలు వివిధ చోట్ల మంది పనిచేస్తున్నారని ఆయన తెలిపారు. అందులో 25 శాతం అంటే కోటి 5 లక్షల మంది లాక్ డౌన్ సమయంలో ఇంటి బాట పట్టారని పేర్కొన్నారు. ఇందులో ఉత్తరప్రదేశ్ నుంచి 32.50 లక్షల మంది ఉన్నారని పేర్కొన్నారు. తర్వాత బీహర్ 15 లక్షల మంది ఉన్నారని వివరించారు. అయితే ఇందులో ఒడిశా, ఛత్తీస్ ఘడ్, ఉత్తరాఖండ్, కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్, ఢిల్లీ, గోవాకు చెందిన వలసకూలీల వివరాలు లేవు. అయితే ఈ రాష్ట్రాల నుంచి కూడా కోటి 5 లక్షల మంది వలసకూలీలు ఉండి ఉంటారని అంచనా.

1 Crore Migrants Went Home Due to Covid-19 Lockdown, but..

పశ్చిమబెంగాల్ నుంచి 13.85 లక్షల మంది, రాజస్తాన్ నుంచి 13.08 లక్షల మంది, మధ్యప్రదేశ్ నుంచి 7.54 లక్షల మంది, జార్ఖండ్ నుంచి 5.30 లక్షల మంది, పంజాబ్ నుంచి 5.16 లక్షల మంది, అసోం నుంచి 4.26 లక్షల మంది, కేరళ నుంచి 3.11 లక్షల మంది మహారాష్ట్ర నుంచి 1.83 లక్షల మంది వలసకూలీలు సొంత గ్రామాలకు వెళ్లిపోయారని కేంద్రమంత్రి సంతోష్ గంగ్వార్ తెలిపారు. జమ్ముకశ్మీర్‌కు 48 వేల 780 మంది, దాద్రా నగర్ హవేలి, డమన్ డయ్యుకి 43 వేల 747 మంది చేరుకున్నారని తెలిపారు.

వలసకూలీలను స్వస్థలాలకు తీసుకెళ్లేందుకు భారతీయ రైల్వే 4 వేల 611 శ్రామిక్ రైళ్లను నడిపిందని మరో ప్రశ్నకు కేంద్రమంత్రి సమాధానం ఇచ్చారు. మే 1వ తేదీ నుంచి 63.07 లక్షల మంది కార్మికులను ఉత్తరప్రదేశ్, బీహర్, జార్ఖండ్, ఒడిశా; మధ్యప్రదేశ్ ఇతర రాష్ట్రాలకు పంపించామని పేర్కొన్నారు. వారికి ఉచితంగానే ఆహారం, మంచినీరు అందించామని వివరించారు.

Recommended Video

COVID-19:కరోనా ను పుట్టించింది చైనా నే.. గుట్టు బయటపెడితే చంపేస్తాం అన్నారు! -Virologist Dr. Li-Meng

English summary
25 per cent or 1.05 crore have returned to their respective states due to coronavirus epidemic and ensuing lockdown.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X