వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్లాస్టిక్ ఇస్తే ఒక పూట భోజనం పెడతాం... ఎక్కడో తెలుసా...?

|
Google Oneindia TeluguNews

రాజస్థాన్‌లో క్లీన్ అండ్ గ్రీన్‌గా మార్చేందుకు రాజస్థాన్‌లోని అంబికాపూర్ నగర పాలక సంస్థ వినుత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. ముఖ్యంగా ప్లాస్టిక్ రహిత నగరంగా అంబికాపూర్‌ను తీర్చి దిద్దడం కోసం నడుంబిగించింది. కిలో ప్లాస్టిక్‌ను తీసుకువెళితే ఒకపూట భోజనం పెట్టే ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. మరోవైపు అరకిలో ప్లాస్టిక్‌ అయితే బ్రేక్ ఫాస్ట్‌ను అందించేందుకు ప్రణాళికలు సిద్దం చేసింది.

నగరాలను క్లీన్‌ అండ్ గ్రీన్‌గా ఉంచడంతో పాటు ప్లాస్టిక్ రహిత సమాజంగా తీర్చిదిద్దేందుకు దేశంలోని పలు నగరాలు అనేక ప్రయత్నాలు చేస్తున్నాయి.ముఖ్యంగా ప్లాస్టిక్ వల్ల అనేక దుష్పరిణామాలు చేకూరుతున్న విషయం తెలిసిందే.దీంతో ప్లాస్టిక్ నిరోధించేందుకు పలు రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. వీటితో పాటు నగరంలో బీదరకం కూడ ప్రధాన సమస్యంగా పరిణమించింది. ఇందుకోసం పలు రాష్ట్ర ప్రభుత్వాలు బీదవారికి ప్రత్యేక బోజనాలు పెట్టేందుకు ప్రత్యేక పథకాలు తీసుకువచ్చాయి.

1 kg plastic waste will be offered a full meal

ఇందులో భాగంగానే రాజస్థాన్ లోని అంబికాపూర్ కార్పోరేషన్ అటు బీదరికాన్ని ఇటు నగరాన్ని క్లీన్‌గా ఉంచే ప్రక్రియను చేపట్టింది.దీంతో నగరంలో ఉన్న వేస్ట్ ప్లాస్టిక్‌ను తీసుకువచ్చే వారికి బోజనాన్ని అందించనుంది. కిలో వేస్ట్ ప్లాస్టిక్‌ను తీసుకెళ్లిన వారికి ఒక పూట బోజనం అందించడంతోపాటు అరకిలో ప్లాస్టిక్ తీసుకెళ్లిన వారికి టిఫిన్‌ను అందించనున్నట్టు నగర మేయర్ అజయ్ టర్కి ప్రకటించారు. కాగ ఇందుకోసం మున్సిపాలిటి బడ్జెట్‌ను కూడ పెట్టిందని ఆయన తెలిపారు.మరోవైపు నగరంలో ఇళ్లు లేని పేదలకు గృహవసతి కూడ కల్పించనున్నట్టు ప్రకటించారు.

కాగా సేకరించిన ప్లాస్టిక్ ద్వార రోడ్డును నిర్మాణం చేపట్టేందుకు సన్నద్దమవుతున్నారు. ఇక ఇప్పటికే దేశంలో సానిటేషన్‌ కాంపయిన్‌తోపాటు,వేస్ట్ మేనేజ్‌మెంట్ లో పలు ప్రయోగాలు చేశామని వేస్ట్ మేనేజ్‌మెంట్‌లో దేశంలోనే 40వ ర్యాంకులో అంబికాపూర్ ఉంది.

English summary
The country's first garbage cafe has been launched here in Chhattisgarh. Under this, the Municipal Corporation will provide food to the poor and homeless in lieu of plastic waste. Persons fetching 1 kg plastic waste will be offered a full meal while those collecting 500 grams waste will get a substantial breakfast.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X