వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నేపాల్ పోలీసుల దాష్టీకం: సరిహద్దు వద్ద కాల్పులు, ఒక భారతీయుడు మృతి, ఇద్దరికీ గాయాలు...

|
Google Oneindia TeluguNews

అంతర్జాతీయ సరిహద్దు విషయంపై డ్రాగన్ చైనా కయ్యానికి కాలు దువ్వుతుండగా.. పనిలో పనిగా నేపాల్ కూడా గొడవకు సిద్ధమంటోంది. భారత్‌తో సరిహద్దుపై పార్లమెంట్‌లో కొత్త మ్యాప్ ప్రవేశపెట్టబోతోంది. శుక్రవారం సరిహద్దు ప్రజలపై కాల్పులకు తెగబడింది. నేపాల్ పోలీసులు జరిపిన కాల్పుల్లో ఒక భారతీయుడు మృతిచెందగా.. మరో ఇద్దరు గాయపడ్డారు. వారిని వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తీసుకెళ్లారు.

ఇండియా-నేపాల్ సరిహద్దులో గల బీహర్ సీతమర్హి వద్ద శుక్రవారం కాల్పులు జరిగాయి. సోనేబర్ష పోలీసు స్టేషన్ పరిధిలో గల లాల్ బండీ జన్కీ నగర్ సరిహద్దు వద్దకు కొందరు స్థానికులు చేరుకున్నారు. అయితే నేపాల్ పోలీసులు కాల్పులు జరపడంతో ఒకరు చనిపోగా, ఇద్దరు గాయపడ్డారని సశస్త్ర సీమబల్ పాట్నా ఐజీ సంజయ్ కుమార్ తెలిపారు. సరిహద్దు వరకు స్థానికులు చేరుకోగా.. నేపాల్‌కు చెందిన ఆర్మ్ డ్ పోలీసు ఫోర్స్ కాల్పులు జరిపిందని తెలిపారు.

1 killed, 2 injured in firing by Nepal police near India-Nepal border in Bihar

Recommended Video

Donald Trump Considering సస్పెండింగ్ H1B Visas

అంతర్జాతీయ సరిహద్దు వద్దకు స్థానికులు చేరుకోవడంతో గొడవ మొదలైంది. అయితే నేపాల్ పోలీసులు మాత్రం తమ ఆయుధాలను లాక్కొనే ప్రయత్నం చేశారని ఆరోపిస్తున్నారు. అందుకోసమే కాల్పులు జరిపామని చెబుతోంది. కానీ దీనిని స్థానికులు, భారత పోలీసులు మాత్రం ధృవీకరించడం లేదు. కరోనా వైరస్ విజృంభించడంతో మార్చి 22వ తేదీన నేపాల్ అంతర్జాతీయ సరిహద్దును మూసివేసిన సంగతి తెలిసిందే.

English summary
Indian was killed and two others injured in alleged firing by Nepal police in Bihar’s Sitamarhi near the India-Nepal border on Friday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X