వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రేషన్ షాపు కోసం రగడ: కాల్పులు జరిపిన బీజేపీ నేత, ఒకరి మృతి, సీఎం సీరియస్

|
Google Oneindia TeluguNews

ఉత్తర ప్రదేశ్‌లో దారుణం జరిగింది. రేషన్ షాపుల కేటాయింపుపై గొడవకు దారితీసింది. కోపోద్రిక్తుడైన బీజేపీ నేత కాల్పులు జరపడంతో.. ఓ యవకుడు మృతిచెందాడు. అయితే అధికారి ముందు ఘటన జరగడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఘటనపై యోగి సర్కార్ స్పందించింది.

బల్లియా జిల్లా రియోటి ప్రాంతం దుర్జాన్‌పూర్ ప్రాంతంలో రేషన్ షాపు కేటాయింపుపై చర్చ జరుగుతోంది. అయితే బీజేపీ నేత ధీరేంద్ర సింగ్ కాల్పులు జరిపాడు. దీంతో జై ప్రకాశ్ పాల్ అనే వ్యక్తి చనిపోయాడు. ఫైర్ చేశాక.. దీరేంధ్ర సింగ్ అక్కడినుంచి పారిపోయాడు.

1 Killed after BJP Leader Fires into Crowd in Ballia..

సమావేశంలో రెండు వర్గాల మధ్య గొడవ జరిగిందని ఎస్పీ దేవేంద్ర నాథ్ తెలిపారు. ఘటనపై విచారణ జరుగుతోంది.. 20 మందిపై తమకు ఫిర్యాదు అందిందని తెలిపారు. బాధితుని సోదరుడు చంద్రమ ఫిర్యాదు చేశారని తెలిపారు. ఘటనపై సీఎం యోగి ఆదిత్యనాథ్ స్పందించారు. సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ సురేశ్ పాల్‌పై సస్పెన్షన్ వేటు వేశారు. సర్కిల్ అధికారి చంద్రకేశ్ సింగ్, ఇతర పోలీసులపై కూడా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Recommended Video

Rahul Gandhi పై దాడి ఘటన పై తెలంగాణ కాంగ్రెస్ నేతల నిరసన, యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ అరెస్ట్

నిందితుడిని వదిలేయబోమని.. కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇందులో అధికారుల బాధ్యతరాహిత్యం ఉంటే వారిపై చర్యలు తప్పవని తేల్చిచెప్పారు. కాల్పుల నేపథ్యంలో గ్రామంలో శాంతి భద్రతలను పర్యవేక్షించేందుకు పోలీసు బలగాలను మొహరించారు. పోలీసుల పికెటింగ్ ఏర్పాటు చేసి పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

English summary
youth was shot dead after a BJP leader fired into a crowd in front of local administrative officials over a dispute at a meeting for selection of ration shops in Ballia district of Uttar Pradesh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X