వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రతి ఆరుగురు ఎంపీలకు ఓ మంత్రి... 40 మంది మంత్రులతో మోడీ ప్రమాణ స్వీకారం... ?

|
Google Oneindia TeluguNews

నరేంద్రమోడీ ప్రభుత్వం గురువారం సాయంత్రం కొలువుదీరబోతుంది..అయితే పూర్తి మెజారీటీ సాధించిన మోడీ ఎవరికి తన క్యాబినెట్‌లో స్థానాన్ని కల్పిస్తున్నాడనే ఉత్కంఠకు తెరలేచింది. దీంతోపాటు స్వంతగా బీజేపీ నుండే 303 మంది ఎంపీలు గెలుపోందగా మరో 50 మంది మిత్రపక్ష పార్టీల ఎంపీలు గెలుపోందారు. దీంతో మిత్రపక్షాలకు ఎన్ని బెర్తులు కేటాయించనున్నారనే చర్చలు కొనసాగుతున్నాయి..

అయితే మోడీ రెండవ సారీ ప్రభుత్వంలో మొత్తం రాష్ట్ర్రమంత్రులతో కలిసి మొత్తం 70 నుండి 80 మంది సభ్యులతో ఆయన మంత్రివర్గ కూర్పు ఉండనుంది. దీంతో మిత్రపక్షా పార్టీలకు కూడ మంత్రిపదవులు ఇవ్వాలి కాబట్టి పార్టీ ఓ ఫార్మూల తీసుకున్నట్టు సమాచారం.. ఆ ఫార్మూలా ప్రకారం ప్రతి ఆరుగురు ఎంపీలకు ఒక మంత్రి పదవి ఇవ్వాలనే నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. అయితే ఇవి క్యాబినెట్ మంత్రి పదవులతో పాటు ఎంవోఎస్ మంత్రుల విషయంలో ఈ సూత్రాన్ని కొనసాగించనున్నారు.

1 minister per 6 Members of Parliament

ఇక మరోవైపు మోడీ ప్రమాణ స్వీకారం సయంలోనే సుమారు 40 మంది వరకు మంత్రులు కూడ ప్రమాణ స్వీకారం చేయనున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.కాగా మంత్రిపదవులకు సంబంధించి మంగళవారమే సుమారు అయిదారు గంటలపాటు పార్టీ చీఫ్ అమిత్ షా చర్చలు జరిపారు. ఇక బీజేపీ కాకుండా మిత్రపక్షాల్లో శివసేన 18 ఎంపీ స్థానాలను, జేడీయు 16 స్థానాల్లో ఎల్‌జేపీ 6 స్థానాల్లో గెలుపోందగా మరో నాలుగు పార్టీలు ఒకటి రెండు స్థానాల్లో గెలుపోందాయి.దీంతో వారికి ఆయా ఎంపీ స్థానాలను బట్టి మంత్రిపదవులు దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి.ఇక తెలుగు రాష్ట్ర్రాల నుండి కిషన్ రెడ్డికి స్థానం దక్కనుందని ప్రచారం జరుగుతోంది.

English summary
There will be about 70-80 ministers in the upcoming Modi government, including Ministers of State (MoS). However, on Thursday only 40-50 ministers will take the oath along with the Prime Minister.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X