ఢిల్లీలో కేసుల ఉప్పెన; తాజాగా 10,665 కరోనా కేసులు; 11 వేలకు పైగా బాధితులు హోం ఐసోలేషన్
దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతుంది. గత 24 గంటల్లో జాతీయ రాజధానిలో తాజా కోవిడ్ కేసుల సంఖ్య దాదాపు రెట్టింపు అయ్యింది. మే 12 నుండి అతిపెద్ద రోజువారి కేసుల నమోదు లో కరోనా కేసుల సంఖ్య 5481 నుండి 10,665కి చేరుకుంది. గత 24 గంటల్లో ఎనిమిది మరణాలు కూడా నమోదయ్యాయి. ఇక తాజాగా నమోదైన కరోనా కేసులు జూన్ 26 నుండి అత్యధికంగా నమోదు కావడం ఇదే మొదటిసారి. నిన్నటితో పోలిస్తే కేసులు 94 శాతం పెరిగాయి.
కరోనా
థర్డ్
వేవ్,
ఒమిక్రాన్
కేసుల
పెరుగుదలతో
కేంద్రం
కొత్త
హోం
ఐసోలేషన్
నిబంధనలు

ఢిల్లీలో థర్డ్ వేవ్ ఎఫెక్ట్ ..కేసుల సానుకూలత రేటు 11.88 శాతం
దేశ రాజధాని ఢిల్లీకి కరోనా థర్డ్ వేవ్ భయం పట్టుకుంది. ప్రస్తుతం కరోనా కేసులతో పాటుగా ఒమిక్రాన్ కేసులు కూడా విపరీతంగా పెరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది కరోనావైరస్ యొక్క తేలికపాటి లక్షణాలతో ఉన్న అత్యంత వ్యాప్తి చెందగల వేరియంట్. ప్రస్తుతం కేసుల సానుకూలత రేటు 11.88 శాతం గా నమోదయింది. ఇది మే 14 తర్వాత అత్యధికం అని చెప్పొచ్చు. కోవిడ్ కేసులు పెరుగుదల మాత్రమే కాకుండా అధిక సంఖ్యలో ఆసుపత్రులలో చేరుతున్న వారి సంఖ్య కూడా పెరుగుతోంది.దీంతో ఢిల్లీలో కరోనా ఆందోళన వ్యక్తం అవుతుంది.

ఢిల్లీలో పెరుగుతున్న ఆస్పత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య
బుధవారం నాడు ఢిల్లీలోని లోక్‌నాయక్ జయప్రకాష్ హాస్పిటల్ లేదా ఎల్ఎన్జెపి డైరెక్టర్ డాక్టర్ సురేష్ కుమార్ మాట్లాడుతూ ఆసుపత్రిలో చేరే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ప్రస్తుతం కోవిడ్ రోగుల కోసం రిజర్వు చేసిన 2,000 పడకలలో 45 మాత్రమే అందుబాటులో ఉన్నాయని, రోజువారీ అడ్మిషన్లు రోజుకు రెండు లేదా మూడు నుండి 15 నుండి 20 వరకు పెరిగాయని ఆయన అన్నారు. భారతదేశంలో థర్డ్ వేవ్ ఏర్పడిందని, ఢిల్లీ ఆరోగ్య మంత్రి సత్యేందర్ జైన్ మాట్లాడుతూ, కరోనా థర్డ్ వేవ్ ను నిర్వహించడానికి ప్రైవేట్ ఆసుపత్రులలో 40 శాతం పడకలు రిజర్వ్ చేయబడుతున్నాయని వెల్లడించారు.

రోజులు లక్ష కేసులైనా సరే వైద్య సదుపాయాలు కల్పిస్తాం : కేజ్రీవాల్
రోజుకు లక్ష కోవిడ్ కేసులను పరిష్కరించేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. హోమ్ ఐసోలేషన్‌లో ఉన్న రోగులకు సంబంధించి కూడా ఇతర ఏర్పాట్లు చేయబడ్డాయని వెల్లడించారు .ఆరోగ్య మంత్రిత్వ శాఖ మహారాష్ట్ర, ఢిల్లీ, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు, కర్ణాటక, జార్ఖండ్, గుజరాత్ రాష్ట్రాలను 'ఆందోళన కరమైన రాష్ట్రాలుగా గుర్తించింది. భారతదేశంలో గత 8 రోజుల్లో 6.3 రెట్లు ఎక్కువ కేసులు నమోదయ్యాయని ఆరోగ్య మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ లవ్ అగర్వాల్ వెల్లడించారు.

ఢిల్లీలో హోమ్ ఐసోలేషన్‌లో 11,551 మంది రోగులు
ప్రస్తుతం ఢిల్లీలో 11,551 మంది రోగులు హోమ్ ఐసోలేషన్‌లో ఉన్నారు. కోవిడ్ కేసుల ఆకస్మిక పెరుగుదలను నిరోధించడానికి ఢిల్లీ ప్రభుత్వ కార్యాలయాలకు వారాంతపు కర్ఫ్యూ విధించారు. వర్క్ ఫ్రం హోం పని చేయాలని సూచించారు. పరిమితుల ప్రకారం, ప్రైవేట్ కార్యాలయాలు 50 శాతం సామర్థ్యంతో మాత్రమే పని చేస్తాయి. పొడవైన క్యూలు మరియు రద్దీని నివారించడానికి బస్సులు మరియు ఢిల్లీ మెట్రో పూర్తి సామర్థ్యంతో పనిచేస్తాయి. వచ్చే రెండు వారాలు కీలకమని, ప్రజలు జాగ్రత్తగా వ్యవహరించాలని ఢిల్లీ ప్రభుత్వం పదేపదే విజ్ఞప్తి చేస్తుంది. కరోనా నిబంధనలను తూచా తప్పకుండా పాటించాలని ఢిల్లీ సర్కారు ప్రజలను కోరుతోంది.