వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జమ్మూకు వెళ్తుండగా.. 10మంది బీఎస్ఎఫ్ జవాన్లు అదృశ్యం

|
Google Oneindia TeluguNews

ముఘల్‌సరాయ్: సరిహద్దు భద్రతా దళం(బీఎస్ఎఫ్)కు చెందిన పది మంది సైనికులు అదృశ్యమయ్యారు. 83మంది సైనికులు ప్రత్యేక రైల్లో పశ్చిమబెంగాల్ నుంచి జమ్మూకు ప్రయాణిస్తుండగా అందులో 10మంది కనిపించకుండా పోయారని పోలీసులు తెలిపారు.

ఈ మేరకు ఆ సైనికుల కమాండర్ ఉత్తరప్రదేశ్‌లోని దీన్‌దయాళ్ ఉపాధ్యాయ నగర్ రైల్వే స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. పది మంది జవాన్లు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా కనిపించకుండా పోయారని కమాండర్ తన ఫిర్యాదులో పేర్కొన్నట్లు పోలీసులు వెల్లడించారు.

 10 BSF Jawans Travelling On Special Train From Bengal To Jammu Go Missing

జవాన్లు కనిపించకుండా పోయినట్లు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని భర్థమాన్ నుంచి బీహార్‌లోని ధన్‌బాద్ మధ్యలో వారు ఎక్కడో అదృశ్యమయ్యారని ఎస్ఐ జితేంద్ర కుమార్ తెలిపారు.
దీన్‌దయాళ్ ఉపాధ్యాయనగర్ రైల్వే స్టేషన్ వద్ద కమాండర్ సైనికులను హాజరు తీసుకోగా, పది మంది అదృశ్యమైనట్లు గుర్తించారు. దీంతో వెంటనే పోలీసులు ఫిర్యాదు చేశారు.

English summary
Ten Border Security Force jawans who were travelling on a train from West Bengal to Jammu have gone missing, the police said. The 10 jawans went missing between West Bengal's Bardhaman and Dhanbad in Bihar, the police said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X