వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మధ్యప్రదేశ్‌లో ప్రలోభాల పర్వం : 10 మంది ఎమ్మెల్యేలకు పదవులు, భారీ నగదు : కమల్‌నాథ్ ఆరోపణ

|
Google Oneindia TeluguNews

భోపాల్ : ఎగ్జిట్ పోల్ ఫలితాలతో మధ్యప్రదేశ్ రాజకీయం రసవత్తరంగా మారుతుంది. కాంగ్రెస్ పార్టీకి బలం లేదని బీజేపీ లేఖతో మొదలైన పరిణామాలు .. ప్రలోభాల పర్వం వరకు కొనసాగుతున్నాయి. తమ పార్టీ ఎమ్మెల్యేలను బీజేపీ ప్రలోభాలకు గురిచేస్తోందని ఆ రాష్ట్ర సీఎం కమల్‌నాథ్ మీడియాకు తెలిపారు.

గవర్నర్‌కు బీజేపీ లేఖ

గవర్నర్‌కు బీజేపీ లేఖ


గవర్నర్‌కు బీజేపీ లేఖతో అదేం లేదు .. బలపరీక్షకు ఓకే అన్నారు కమల్‌నాథ్. కానీ తాజాగా మాత్రం బీజేపీపై ఆరోపణలు గుప్పించారు. తమ పార్టీకి చెందిన 10 మంది ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురిచేస్తున్నారని ఆరోపించారు. వారికి ఫోన్ చేసి భారీగా నగదు, మంత్రి పదవులు ఇస్తామని ఆఫర్ ఇస్తున్నారని చెప్పారు. కానీ మా ఎమ్మెల్యేలు తమతోనే ఉన్నారని స్పష్టంచేశారు.

ఎంపీలో కూడా బీజేపీ హవా ..

ఎంపీలో కూడా బీజేపీ హవా ..

ఎగ్జిట్ పోల్ అంచనాలతో కేంద్రంలో బీజేపీ 330 స్థానాలు గెలుచుకుంటుందని వివరించాయి. దీంతోపాటు మధ్యప్రదేశ్‌లో కూడా కమలం వికసిస్తోంది. 28 సీట్ల వరకు గెలుస్తుందని .. కాంగ్రెస్ 3 సీట్లకే పరిమితం అవుతుందని లెక్కలు వేసింది. 2014లో బీజేపీ 26 సీట్లు గెలువగా .. కాంగ్రెస్ మూడు సీట్లు గెలిచింది. అంటే గత ఫలితాలే మళ్లీ రిపిట్ అవుతాయనే చర్చ జరగుతుంది.

మద్దతు లేదు కదా ..?

మద్దతు లేదు కదా ..?

మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతు లేదని బీజేపీ ఆరోపించింది. ప్రభుత్వం మైనారిటీలో ఉందని .. బీజేపీ నేతలు ఆరోపించగా విశ్వాస పరీక్షకు ఓకేనని కమల్ నాథ్ స్పష్టంచేశారు. అంతేకాదు గత ఐదు నెలల్లో నాలుగుసార్లు తమ బలాన్ని నిరూపించుకున్నామని కమల్ నాథ్ స్పష్టంచేశారు. అంతేకాదు తమ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి అస్థిరత పరిచేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. మొదటిరోజు నుంచి ప్రభుత్వాన్ని పడేయాలనే ఆలోచనతో బీజేపీ ఉందని .. ఇప్పటికే నాలుగు పర్యాయాలు బలాన్ని నిరూపించుకున్నామని పేర్కొన్నారు. కానీ వారు మరోసారి బలపరీక్ష కావాలని కోరుతున్నారని .. ఇప్పటికీ తమకు ఎలాంటి ఇబ్బంది లేదని కమల్‌నాథ్ తేల్చిచెప్పారు.

English summary
madhya Pradesh CM Kamal Nath has claimed that 10 of his MLAs have reported to him and said they were receiving phone calls and being offered money and posts.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X