వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బెంగాల్‌లో 10 మంది సిట్టింగ్ ఎంపీలకు షాకిచ్చిన మమతా ...టీఎంసీ అభ్యర్థుల జాబితా ఇదే..!

|
Google Oneindia TeluguNews

కోల్‌కతా: కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం రాకుండా గట్టిగా పోరాడుతున్న తృణమూల్ అధినేత్రి బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ 2019 లోక్‌సభ అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు. పశ్చిమ బెంగాల్‌లో 42 లోక్‌సభ స్థానాలున్నాయి. అయితే ఈ సారి దీదీ 10 మంది సిట్టింగ్ ఎంపీలకు షాక్ ఇచ్చారు. వారికి టికెట్ నిరాకరించారు. అయితే ఈ సారి మమతా బెనర్జీ మహిళలకు శుభవార్త చెప్పారు. తృణమూల్ కాంగ్రెస్ నుంచి 41శాతం టికెట్లు మహిళలకు కేటాయిస్తున్నట్లు ఆమె ప్రకటించారు. మహిళలను పెద్ద సంఖ్యలో చట్టసభలకు పంపడం చాలా గర్వంగా ఉందని మమతా పేర్కొన్నారు.

దేశ పరిస్థితిని చూస్తే బాధగా ఉంది: ప్రియాంకా గాంధీ తొలి రాజకీయ ప్రసంగందేశ పరిస్థితిని చూస్తే బాధగా ఉంది: ప్రియాంకా గాంధీ తొలి రాజకీయ ప్రసంగం

ఇక 41శాతం మహిళలకు టికెట్ కేటాయిస్తున్న మమతా బెనర్జీ తమ అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. ఇందులో బెంగాల్ సెలబ్రిటీలు కూడా ఉన్నారు. మిమి చక్రబర్తి, నస్రత్ జహాన్‌లాంటి సెలబ్రిటీలు ఈసారి బెంగాల్ బరిలో తృణమూల్ తరపున బరిలో నిలవనున్నారు. ఇక ఎప్పటిలాగే మమతా బెనర్జీ మోడీ సర్కార్ పై నిప్పులు చెరిగారు. ఈ సారి ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు బీజేపీ అన్ని దారులు వెతుక్కుంటోందని మమతా మండిపడ్డారు. డబ్బులను తరలించేందుకు వీవీఐపీలకు చెందిన చార్టర్డ్ విమానాలను, హెలికాఫ్టర్లను వినియోగిస్తున్నట్లు తనకు సమాచారం ఉందని అన్నారు.

10 sitting MPs dropped as Trinamool releases list for 2019 elections

ఇక ఈ ఎన్నికల్లో బీజేపీకి గట్టిగా బుద్ధి చెప్పాలని ఆమె ప్రజలకు పిలుపునిచ్చారు. బీజేపీ సర్కార్ రైతులకు ఇచ్చిన హామీలను విస్మరించిందని, రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలులో భారీ కుంభకోణానికి పాల్పడిందని మమతా ధ్వజమెత్తారు. ఇక యువతకు ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి వారిని కూడా మోసం చేసిందని ఆమె మండిపడ్డారు. ఇక ఈసారి సిట్టింగ్ ఎంపీలకు టికెట్ ఇవ్వలేదని అయితే వారికి తప్పకుండా పార్టీలో ప్రాధాన్యత కల్పిస్తామని మమతా బెనర్జీ హామీ ఇచ్చారు. ఇక ఒడిషా, అస్సోం, జార్ఖండ్, బీహార్, అండమాన్‌లలో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను బరిలో నిలుపుతుందని ఆమె స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే పశ్చిమ బెంగాల్‌ ఏప్రిల్ 11 నుంచి ప్రారంభం కానున్న ఏడుదశల పోలింగ్‌లలో పాల్గొననుంది.

English summary
The West Bengal Chief Minister and Trinamool Congress (TMC) supremo Mamata Banerjee on Tuesday announced a list of TMC candidates for all the 42 Lok Sabha seats of the state, dropping 10 sitting MPs. While announcing, Banerjee said, “Trinamool Congress will field 41 per cent female candidate in the upcoming Lok Sabha elections. This is a proud moment for us.”
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X