వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

coronavirus:వైరస్ ఉన్న రోగికి శస్త్రచికిత్స, క్వారంటైన్‌లోకి 10 మంది వైద్యుల బృందం..

|
Google Oneindia TeluguNews

కరోనా వైరస్ భయపెడుతోంది. ఢిల్లీ ఓక్లాలో గల అల్షిఫా హాస్పిటల్ ఓ రోగికి 10 మందితో కూడిన వైద్యబృందం సర్జరీ చేసింది. అయితే తర్వాత అతనికి కరోనా వైరస్ ఉంది అని తేలడంతో.. వైద్యులు ఆందోళన చెందారు. వెంటనే 10 మంది క్వారంటైన్‌లోకి వెళ్లిపోయారు. కరోనా వైరస్ పరీక్ష చేయించుకోగా.. వారి రిపోర్ట్ మంగళవారం రానుంది.

Coronavirus Cases India ఒక్కరోజే 1553 పాజిటివ్ కేసులు, 17 వేల మార్క్ దాటిన సంఖ్య, 543 మంది మృతి..!Coronavirus Cases India ఒక్కరోజే 1553 పాజిటివ్ కేసులు, 17 వేల మార్క్ దాటిన సంఖ్య, 543 మంది మృతి..!

ఆస్పత్రిలో ఏప్రిల్ 13వ తేదీన ఒకరు చేరారు. ఛాతీలో గలఅతని గడ్డను తొలగించారు. తర్వాత అతనికి నొప్పి రావడంతో రాం మనోహర్ లోహియా ఆస్పత్రికి తరలించారు. అక్కడ పరీక్షలు చేయగా.. కరోనా వైరస్ సోకిందని బయటపడింది. అయితే అతనికి ఆపరేషన్ చేసిన వైద్య సిబ్బంది హోం క్వారంటైన్‌లోకి వెళ్లారు. కరోనా పరీక్షలు చేయించుకున్నామని.. మంగళవారం నివేదిక వస్తోందని తెలిపారు.

10 Staff Members of Delhi Hospital Quarantined After Attending Covid-19 Patient

ఇది ఇలా ఉంటే మరోవైపు ఈ నెల 5వ తేదన వైద్యుడు మహిళను పరీక్షించారు. అయితే ఆమెకు కరోనా వైరస్ ఉందని తర్వాత తెలిసింది. సరైన జాగ్రత్తలు పాటించిన వైద్యునికి కూడా వైరస్ సోకింది. అతనిని వెంటనే ఐసోలేషన్ వార్డుకు తరలించారు. అతను కాంటాక్ట్‌లో ఉన్నవారికి కూడా పరీక్షలు చేశారు. అయితే వారికి కరోనా నెగిటివ్ రావడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఢిల్లీలో కరోనా వైరస్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 2 వేల మార్క్ దాటడం ఆందోళన కలిగిస్తోంది. నిజాముద్దీన్ ప్రార్థనలతో హస్తినలతోపాటు.. దేశవ్యాప్తంగా కూడా కేసులు వేగంగా పెరిగాయి.

Recommended Video

Fake News Buster EP 10 : సోడియం హైపోక్లోరైట్ మనుషులు వాడచ్చా ?

English summary
Ten staff members of the Alshifa Hospital in southeast Delhi's Okhla have been quarantined after they attended to a patient who tested positive for coronavirus
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X