వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నోట్ల రద్దుతో కమలానికి కష్టకాలమే

ప్రధాని నరేంద్ర మోడీ సారథ్యంలో బిజెపి కేంద్రంలో అధికారం చేపట్టిన తర్వాత తొలిసారి విషమ పరీక్షను ఎదుర్కొంటున్నది. వచ్చేనెలలో జరిగే ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్ అత్యంత కీలకం.

|
Google Oneindia TeluguNews

లక్నో: ప్రధాని నరేంద్ర మోడీ సారథ్యంలో బిజెపి కేంద్రంలో అధికారం చేపట్టిన తర్వాత తొలిసారి విషమ పరీక్షను ఎదుర్కొంటున్నది. వచ్చేనెలలో జరిగే ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్ అత్యంత కీలకం.

80 స్థానాలకు 71 స్థానాలను గెలుచుకుని విజయ ఢంకా మోగించిన బిజెపి అదే ప్రభంజనం మున్ముందు కొనసాగించే అవకాశాలు లేవని ఆ పార్టీ నాయకత్వానికి తెలుసు. దీనికి తోడు గత నవంబర్ 8వ తేదీన రూ.1000, రూ.500 నోట్లు రద్దుచేస్తూ ప్రధాని నరేంద్రమోదీ తీసుకున్న నిర్ణయం యావత్ భారతాన్ని అతలాకుతలంచేస్తున్నది. మరీ ముఖ్యంగా సాధారణ ప్రజలు పడ్డ ఇబ్బందులు అన్నీ ఇన్నీ కాదు.

లక్షల మంది నగదు కోసం రోడ్డున పడ్డారు. తమ వద్దనున్న పాతనోట్ల మార్పిడి మొదలు తర్వాత రోజువారీ ఖర్చుల కోసం బ్యాంకుల వద్ద, ఎటిఎం కేంద్రాల వద్ద కోట్ల మంది భారతీయులు పడ్డ కష్టాలు వర్ణనాతీతం. ఈ నేపథ్యంలో ముందుకు వచ్చిన ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు తప్పనిసరిగా ప్రతికూలంగా మారతాయని భావిస్తున్నారు. దీనిపై ఓ ఆంగ్ల దినపత్రిక సర్వే నిర్వహించింది. కనుక ఒక్కసారి దాని పరిణామాలను పరిశీలిద్దాం..

పాక్

పాక్

పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో ఉగ్రవాద శిబిరాలపై లక్షిత దాడుల తర్వాత బిజెపి పట్ల ప్రజల అభిమానం పతాకస్థాయికి చేరుకున్నది. కానీ పెద్ద నోట్ల రద్దు తర్వాత పరిణామాలు పూర్తిగా దిగజారిపోయాయి.

యూపీ

యూపీ

యుపి యువ సిఎంగా అఖిలేశ్ యాదవ్ ప్రగతి సాధించే లక్ష్యంతో ముందుకు సాగుతున్న నేతగా ఇమేజ్ సాధించుకున్నాడు. ఈ ద్రుక్పథం సమాజ్‌వాదీ పార్టీ కంటే ఆయనకు ఎక్కువ ప్రజాదరణను తెచ్చిపెట్టింది.

ఉత్తర ప్రదేశ్

ఉత్తర ప్రదేశ్

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని 71 జిల్లాల్లో బిజెపికి 32 జిల్లాల్లో సానుకూల పరిస్థితులు ఉన్నాయి. 30 జిల్లాల్లో మాత్రం అధికార సమాజ్ వాదీ పార్టీకి పట్టు ఉంది.

మాయావతి

మాయావతి

మాజీ ముఖ్యమంత్రి మాయావతి సారథ్యంలోని బహుజన సమాజ్ పార్టీకి కేవలం ఏడు జిల్లాల్లో మాత్రమే పట్టు ఉన్నది. ప్రగతి పేరిట ఆమె ఓట్లు పొందగల శక్తి సామర్థ్యాలు లేవు.

హస్తం

హస్తం

ఇక హస్తం గుర్తు పార్టీ కాంగ్రెస్ పార్టీ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో రోజురోజుకు దిగజారిపోతున్నది. కేవలం ఒకే ఒక జిల్లాల్లో ఆధిపత్యం కలిగి ఉంది.

కేంద్రం

కేంద్రం

కేంద్రం రూ.1000, రూ.500 నోట్లను రద్దుచేసిన తర్వాత తలెత్తిన నగదు కొరత సమస్యతతో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచి ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లిన కార్మికులు సరైన ఉపాధి లేక, ఉన్న ఉపాది కోల్పోయారు. తినడానికి తిండి లేక బలవంతంగా తమ స్వస్థలాలకు బయలుదేరి వెళ్లారు.

నోట్ల రద్దు

నోట్ల రద్దు

నోట్ల రద్దు ప్రభావంతో పారిశ్రామిక ఉత్పత్తి కనీసం 30 శాతం పడిపోయిందని ఒక అంచనా.

నోట్లరద్దు

నోట్లరద్దు

నోట్ల రద్దు కారణంగా ఉత్తరప్రదేశ్‌లోని మహిళలు షాక్ కు గురయ్యారు. తొలి నుంచి తాము పొదుపుచేసుకున్న భారీ మొత్తం నగదు తమ భర్తకు అందజేయాల్సి వచ్చిందని దిగ్భ్రాంతికి గురయ్యారు.

గుండెకాయ

గుండెకాయ

దేశానికి గుండెకాయగా మారిన ఉత్తరప్రదేశ్ లో ప్రజలంతా నగదు కొరత సమస్యతో బాధపడుతూనే ఉన్నారు. అయితే ప్రధాని మోదీ దేశ ప్రజల కోసమే ఈ నిర్ణయం తీసుకున్నారని వారు భావిస్తున్నారు.

యూపీ

యూపీ

ఉత్తరప్రదేశ్ వాసులు ప్రధాని నరేంద్రమోదీ వాగ్దానంపై నమ్మకం పెట్టుకున్నారు. డిసెంబర్ 30 తర్వాత నగదు కొరత కష్టాలు తీరతాయన్న ఆయన హామీ అమలుకు నోచుకోలేదని భావిస్తున్నారు. దీనివల్ల యూపీలో బిజెపి ప్రజాదరణ తగ్గుముఖం పట్టింది.

English summary
10 ways demonetisation will affect Uttar Pradesh polls.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X