వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఒక రోజు: జైపూర్ పోలీస్ కమిషనర్‌గా 10 ఏళ్ల బాలుడు

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

జైపూర్: రాజస్ధాన్‌కు చెందిన గిరీశ్ శర్మ అనే బాలుడు జైపూర్ పోలీస్ కమిషనర్‌గా గురువారం బాధ్యతలు స్వీకరించాడు. అంతే కాదు వెంటనే తన కింది అధికారులకు ఆదేశాలు జారీ చేశాడు. చిన్న పిల్లాడు కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించడం ఏంటని అనుకుంటున్నారా?

దీనికంతటికి కారణం మేక్ ఏ విష్ పౌండేషన్. గిరీశ్ శర్మ అనే బాలుడు గత కొద్ది కాలంగా తీవ్ర కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నాడు. ఎక్కువ కాలం బ్రతకడు. అయితే ఆ బాలుడికి ఉన్నత చదవులు చదివి పోలీస్ కమిషన్ అవ్వాలని కోరిక ఉంది. బాలుడి కోరికను గుర్తించిన ప్రముఖ స్వచ్ఛంద సంస్ధ మేక్ ఏ విష్ పౌండేషన్ జైపూర్ నగర పోలీస్ కమిషనర్ జంగా శ్రీనివాసరావుకు వివరించింది.

10-year-old boy becomes Jaipur police commissioner for a day

దీంతో అందుకు అంగీకరించిన ఆయన బాలుడుని ఒకరోజు పోలీస్ కమిషనర్‌గా బాధ్యతలు అప్పగించాడు. పోలీస్ కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించిన వెంటనే ప్రత్యేక చాంబర్‌లో గిరీశ్ శర్మ సమావేశం ఏర్పాటు చేశాడు. కింది స్థాయి అధికారులతో మాట్లాడారు. అనంతరం ఫైళ్లపై సంతకాలు కూడా చేశాడు. ఆ తర్వాత పోలీసులు నుంచి గౌరవ వందనం స్వీకరించాడు.

ఈ సందర్భంగా గిరీశ్ శర్మ మాట్లాడుతూ సంతోషంగా ఉంది. దేశానికి ద్రోహం చేసేది దొంగలేనని అలాంటి వారిని పట్టుకోవడమే తన లక్ష్యమని చెప్పాడు. మేక్ ఏ విష్ పౌండేషన్ సభ్యురాలు స్మిత షా మాట్లాడుతూ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న పిల్లల కోరికలు తీర్చడమే మా పని అన్నారు. ఈ విధంగా చేయడం వల్ల పిల్లలు సంతోషంగా ఉండి, ట్రీట్‌మెంట్‌కు త్వరగా సహకరిస్తారని ఆమె అన్నారు.

English summary
Ten-year-old Girish Sharma wanted to be police commissioner and his dream came true on Thursday when he was made Jaipur Police Commissioner for a day.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X