వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వెంటిలేటర్ సాయంతో మృత్యువుతో పోరాడుతున్న చిన్నారి విశాఖకి మన సాయం అవసరం

Google Oneindia TeluguNews

హైదరాబాద్: "తన నోటు పుస్తకాలన్నీ ఆ మూల దుమ్ముకొట్టుకుని పడివున్నాయి.ఈ జ్ఞాపకాల వరుసల్లో చిందరవందరగా సర్దకుండా ఉన్న అలమరలు,పుస్తకాలను చూసి నా మీద చిరాకుపడటానికైనా తను ఇక్కడ ఉండుంటే బావుండు. తన పుస్తకాలను, కష్టపడి బహుమతిగా సాధించుకున్న స్కూలుబ్యాగు వీటిని ఎప్పుడూ నిర్లక్ష్యం చేసేది కాదు. కానీ ఇప్పుడు అవన్నీ అలా గదిలో శ్రద్ధ లేకుండా పడివున్నాయి. నేను ప్రతి రోజూ రాత్రి తన మంచం పక్కకి తనతో గడిపిన సంతోషాల జ్ఞాపకాలను గుర్తుచేసుకోటానికి వెళ్తుంటాను. హాస్పిటల్లో చేరే ముందు రోజు కూడా తనకిష్టమైన పుస్తకాల్లో మునిగిపోయి చదువుకోవటం నాకింకా గుర్తే. ఇదిగో ఎప్పుడూ చేతిలో పుస్తకంతో ఈ కిటికీ పక్కన కూర్చుని కిటికీలోంచి మొక్కలను చూసేది."

10-year-old Vishaka Needs Your Support In Fighting Multiple Organ Failure

"రోజూ పొద్దున్నే తను మర్నాటికల్లా వచ్చేస్తుందేమో అన్పించి తన పక్కను అదే పనిగా సర్దుతుంటాను. అది కొంచెం మనశ్శాంతినిస్తుంది. అదే నా ఆశ కూడా. విశాఖ ఎక్కడుందనే తన తమ్ముడి ప్రశ్నలకు జవాబివ్వటానికి నా దగ్గర శక్తి లేదు. పాపని హాస్పిటల్లో చేర్చినప్పటి నుంచీ, తన తమ్ముడు రాత్రిపూట పడుకోవటానికి ఒప్పుకోవట్లేదు. చీకట్లో పడుకోవటానికి భయపడుతున్నాడు. వాడి అక్క ప్రాణం కోసం పోరాడుతోందనే విషయం ఎలా చెప్పను? వాళ్ల నాన్న అక్కను పొద్దున్నే కలుద్దామని సముదాయిస్తుంటారు. కానీ ఇప్పుడు వాడికి కూడా మేము అబద్ధం చెప్తున్నామని అర్థమైపోయి మమ్మల్ని కోపంగా చూస్తున్నాడు. వాడికి వాళ్ళ అక్కను చూడాలని చాలా ఉంది. కానీ మేమెలా వాడికి అక్క స్థితి గురించి నచ్చచెబుతాం? ఈ చేదునిజాన్ని తట్టుకోడానికి వాడింకా చాలా చిన్నవాడు. తన అక్క మెషీన్ సాయంతో జీవిస్తూండటం తను చూడలేడు," అంటూ కళ్ళనీళ్లతో విశాఖ అక్క తన వేదన పంచుకున్నారు.

విశాఖ తల్లిదండ్రులు ఎన్నడూ తమ పాప స్కూలునించి అలాంటి ఫోన్ కాల్ వస్తుందని ఊహించలేదు. కానీ ఆరోజే వేరుగా గడిచింది. విశాఖ అమ్మానాన్నలకి స్కూలుకి రమ్మన్న ఆ రోజు చీకటిరోజు. వారు వెళ్ళేసరికి పాప మంచంపై పాలిపోయి, అలసటతో, జ్వరంతో వణుకుతూ కన్పించింది.

సంజీవ్ (విశాఖ నాన్న) మాట్లాడుతూ, "మేము వెంటనే పాపని హాస్పిటల్లో చేర్పించాం.ఇదివరకు కూడా డెంగ్యూ వల్ల రెండుసార్లు హాస్పిటల్లో చేర్పించాల్సి రావటంతో ఈసారి సమయం వృథా చేయలేదు. డెంగ్యూ తన కిడ్నీలను,కాలేయాన్ని, ఊపిరితిత్తులని బాగా బలహీనపర్చి వాటి పనితీరును పాడుచేసేసింది." అన్నారు.

10-year-old Vishaka Needs Your Support In Fighting Multiple Organ Failure

పాప తన సొంత గదిలో పడుకొని ఇప్పటికి 12 రోజులవుతోంది. ఇప్పుడు ఆ హాస్పిటల్ బెడ్ యే శాశ్వతమైన బెడ్ గా కన్పిస్తోంది. తనకి మల్టిపుల్ ఆర్గాన్ ఫెయిల్యూర్ (ఒకేసారి ఎక్కువ అవయవాలు పనిచేయక ఫెయిల్ అవటం) జరిగిందని డాక్టరు చెప్పారు. తన కిడ్నీ, కాలేయం, ఊపిరితిత్తుల పనితీరు ఇదివరకే క్షీణించింది. ఈ తీవ్ర అనారోగ్యం వల్ల అడ్మిట్ అయినప్పటి నుండి వెంటిలేటర్ పైనే ఉంది. అమ్మానాన్నలు ఇప్పటికే 5,00,000 రూపాయలను సర్దుబాటు చేసి, అప్పులు చేసి ఈనాటి వరకూ హాస్పిటల్ ఖర్చులు భరిస్తూ వచ్చారు.

పాప తండ్రి, సంజీవ్ ఆర్టీవో ఆఫీసులో ఏజెంట్ గా పనిచేస్తూ సంపాదించే 7000 రూపాయల తక్కువ మొత్తంతో ఆ కుటుంబం ఇప్పుడు భారీగా అంటే 7లక్షల వరకూ కూడబెట్టటానికి చాలా కష్టపడుతోంది.

తన పదేళ్ల కూతురి భవిష్యత్తు అయోమయంలో పడటంతో సంజీవ్ ఇప్పుడు బందీలా అన్నివైపులా ఇరుక్కుపోయానని భావిస్తున్నారు. ఈ కుటుంబం విశాఖను రక్షించటానికి ఆఖరి ఆశగా క్రౌడ్ ఫండింగ్ మార్గాన్ని ఆశ్రయించింది. విశాఖ తల్లిదండ్రులు ఇప్పుడున్న అనిశ్చిత పరిస్థితి నుంచి తమ పాపను కాపాడుకునే ఆశతో మీ నుంచి సాయం కోరుతున్నారు. ఆమె తండ్రి మాటల్లో, " నా పాపకి జీవితంలో రెండవ అవకాశం వచ్చి తీరాలి."

ఇది చదివే పాఠకులందరికీ, నా విన్నపం ఇదే...

మనందరం మనుషులం, అవసరంలో ఉన్నవారికి అండగా నిలబడటం మన కనీస కర్తవ్యంగా భావిస్తాం. విశాఖ కేవలం సంజీవ్ కూతురే కాదు, మనందరి పాప కూడా. ఆ మిగిలిన మొత్తాన్ని మనమే ఎలా అయినా కూడబెట్టి తన ప్రాణాలు కాపాడటానికి ప్రయత్నించాలి. మనుషులందరిలో ఉండే ప్రేమాభిమానాలపై నమ్మకంతో నేను మీ అందరినీ ఈ గొప్ప పనికి విరాళాలు కోరుతున్నాను. తనకి మీరు సాయంగా ఇచ్చే మొత్తం, మీ చిన్న అడుగు మానవత్వానికి నిర్వచనంగా ప్రతిబింబిస్తుంది.

10-year-old Vishaka Needs Your Support In Fighting Multiple Organ Failure

ప్రాణాలు కాపాడటం కన్నా మంచి పని మరోటి లేదని గుర్తుచేసుకోండి. డాక్టరులు మన బిడ్డను కాపాడటానికి సిద్ధమైనప్పుడు, డబ్బును, ఇతర అవసరాలను సమకూర్చాల్సిన బాధ్యత ఇప్పుడు మనదే.మనందరం చేతులు కలిపి మనవంతుగా ఎంత వీలైతే అంత విశాఖ ఆరోగ్య ఖర్చులకి డబ్బు పోగేద్దాం. ఆ పాప మంచి ఆరోగ్యంతో జీవించాలని ఆశపడుతోంది. తన తల్లిదండ్రులకి ఈ చిన్నారి కోరికను తీర్చడానికి మనందరం నడుంబిగిద్దాం. ఆ పాప తండ్రి చెప్పినట్లు తనకి జీవితంలో రెండో అవకాశం వచ్చి తీరాలి.

ఈ గొప్పపనికి మీ సాయం కోరుతున్నాం, మా ఈ అభ్యర్థనకి విరాళమిచ్చి పదేళ్ల పాప విశాఖను కాపాడిన సంతృప్తిని పొందండి. ఏది ఎలా ఉన్నా మనందరం మనుషులమే, తమ పాప ప్రాణం కోసం హాస్పిటల్లో పోరాడుతుంటే చూసే తల్లిదండ్రుల భావోద్వేగాలు, వారి పరిస్థితి మనందరం కూడా అర్థం చేసుకోగలం.
మన విశాఖను కాపాడటానికి మాకు సాయం చేయండి. ఆమె మనందరి ఆశ, సంతోషం కూడా. ఏ పసిబిడ్డ వెంటిలేటర్ పై కష్టపడే స్థితికి రాకూడదు. తగిన మొత్తం చేరటానికి మాకు దయచేసి సాయపడండి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X