వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాశ్మీర్‌లో ఉగ్ర కుట్ర: సరిహద్దులో 100మంది ఉగ్రవాదులు, పాక్ కమాండోలు

|
Google Oneindia TeluguNews

Recommended Video

ఉగ్రవాదులు, కమాండోలను సిద్ధం చేస్తున్న పాక్ ! || Oneindia Telugu

న్యూఢిల్లీ: జమ్మూకాశ్మీర్‌కు ప్రత్యేక పత్తిని కల్పించే ఆర్టికల్ 370ని కేంద్రం రద్దు చేయడంతో భారత్‌పై పాకిస్థాన్ అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్‌ తరచూ తన అక్కసును వ్యక్తం చేస్తున్నాడు. కాశ్మీర్ విషయంలో అగ్రదేశం అమెరికా కూడా భారత్‌కు అనుకూలంగా మాట్లాడటంతో దిక్కుతోచని స్థితిలోకి వెళ్లిపోయాడు ఇమ్రాన్ ఖాన్.

కాశ్మీర్‌పై మాటల్లేవ్! పీవోకే ఐతే ఓకే: తేల్చేసిన వెంకయ్య నాయుడు కాశ్మీర్‌పై మాటల్లేవ్! పీవోకే ఐతే ఓకే: తేల్చేసిన వెంకయ్య నాయుడు

ఈ క్రమంలో భారత సరిహద్దులో మన సైనికులను లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడాలని పాక్ ప్రయత్నిస్తోంది. ఇప్పటికే నియంత్రణ రేఖ(ఎల్ఓసీ) వద్ద పాకిస్థాన్ ఆర్మీ దాదాపు 100మందికిపైగా ఉగ్రవాదులను, మరో వందమందికిపైగా సైనికులను పాకిస్థాన్ సిద్ధం చేసిందని భద్రతా అధికారులకు సమాచారం అందింది.

100 commandos, 100 terrorists: Pakistan planning a major bloodbath in Kashmir

సరిహద్దులో పాకిస్థాన్ ఐఎస్ఎస్జీ కమాండోలు చేస్తున్న కార్యకలాపాలను నిశితింగా పరిశీలిస్తున్నామని ఆర్మీ అధికారులు తెలిపారు. ఇప్పటికే ఆఫ్గనిస్థాన్‌కు చెందిన 12మంది జిహాదీలను జైషే సంస్థ లీసా వ్యాలిలోకి దింపినట్లు ఐబీ వర్గాలు తెలిపాయి.

దేశంలోని ముఖ్య నగరాల్లో ఉగ్రవాదులు దాడులకు పాల్పడే అవకాశం ఉందన్న సమాచారంతో దేశ వ్యాప్తంగా భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో హైఅలర్ట్ కొనసాగుతోంది. పాకిస్థాన్ ఎలాంటి కవ్వింపు చర్యలకు తెగబడినా.. గట్టి బుద్ధి చెబుతామని భారత భద్రతా దళాలు స్పష్టం చేశాయి.

English summary
Pakistan is on over-drive mode, following the abrogation of Article 370. Apart from planning a blood bath in Jammu and Kashmir, Pakistan Ishas also deployed over 100 Special Service Group commandos along the Line of Control (LoC).
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X