వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భారత్‌లో కోవిడ్-19కు 100 రోజులు పూర్తి... ఆ హాస్పిటల్ ఎదుర్కొన్న సవాళ్లేంటి..?

|
Google Oneindia TeluguNews

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనావైరస్.. భారత్‌లోకి ప్రవేశించి వంద రోజులు పూర్తి చేసుకుంది. అంటే భారత్‌లో తొలి కరోనావైరస్ కేసు నమోదై వంద రోజులు పూర్తయ్యాయి. ఢిల్లీలోని లోక్‌నాయక్ హాస్పిటల్‌లో మార్చి 2వ తేదీన తొలి కోవిడ్-19 కేసు వచ్చింది. ఆ తర్వాత నాలుగు రోజులకు లోక్‌ నాయక్ హాస్పిటల్ అలర్ట్ అయ్యింది. చకచకా కోవిడ్-19ను నియంత్రించేందుకు చర్యలు చేపట్టింది.

50 మందికి తగ్గిన కరోనా: తీసుకెళ్లేందుకు రానీ ఫ్యామిలీస్, గాంధీలోనే రీ-అడ్మిట్, సిటీలో 2192 మంది..?50 మందికి తగ్గిన కరోనా: తీసుకెళ్లేందుకు రానీ ఫ్యామిలీస్, గాంధీలోనే రీ-అడ్మిట్, సిటీలో 2192 మంది..?

 మార్చిలో లోక్‌నాయక్ హాస్పిటల్‌లో తొలి కేసు నమోదు

మార్చిలో లోక్‌నాయక్ హాస్పిటల్‌లో తొలి కేసు నమోదు

ప్రపంచ దేశాలను గడగడలాడించిన కోవిడ్-19 భారత్‌లో ప్రవేశించి 100 రోజులు దాటింది. తొలి కేసు మార్చి 2న ఢిల్లీలోని లోక్‌నాయక్ హాస్పిటల్‌లో వెలుగు చూసింది. వెంటనే హాస్పిటల్‌లోని వైద్యులు, ఇతర సిబ్బంది ఈ వైరస్‌ను నిలువరించేందుకు చర్యలు తీసుకున్నారు. వెంటనే 11 ఐసోలేషన్ గదులను కోవిడ్-19 పేషెంట్ల కోసం ఏర్పాటు చేశారు. తొలి కరోనావైరస్ పేషంట్ మార్చి 17న లోక్‌నాయక్ హాస్పిటల్‌లోని ఐసొలేషన్ గదిలో అడ్మిట్ అయ్యాడు.ఇక అప్పటి నుంచి వంద రోజుల పాటు 3760 మంది కోవిడ్ -19 పేషెంట్లు ఇక్కడ చికిత్స పొందారు. ఇందులో వ్యాధి తీవ్రత ఉన్నవారే ఎక్కువగా ఉండటం విశేషం. ప్రస్తుతం ఢిల్లీ నగరంలో రోజుకు 2వేలకు పైగా కేసులు నమోదు అవుతుండటంతో లోక్‌నాయక్ హాస్పిటల్‌ను కేవలం కోవిడ్-19 హాస్పిటల్‌గా మార్చడం జరిగింది. ఢిల్లీ ప్రభుత్వానికి కూడా లోక్‌నాయక్ హాస్పిటల్ వైరస్‌ పై పోరాడేందుకు ఒక ఆయుధంగా మారింది. ఈ హాస్పిటల్‌లో కోవిడ్-19 సోకిన గర్బిణీ స్త్రీలకు డెలివరీలు, కరోనావైరస్ వచ్చిన ఇతర పేషెంట్లకు కూడా డయాలసిస్ నిర్వహిస్తున్నారు.

 పూర్తిస్థాయిలో కోవిడ్-19 హాస్పిటల్‌గా మార్పు

పూర్తిస్థాయిలో కోవిడ్-19 హాస్పిటల్‌గా మార్పు

ఇప్పటి వరకు కోవిడ్-19 పాజిటివ్ వచ్చిన పేషెంట్లలో 1130 మందికి డయాలసిస్ నిర్వహించినట్లు వైద్యులు చెబుతున్నారు. ఇప్పటి వరకు కోవిడ్-19 వచ్చిన గర్భిణీ స్త్రీలు 144 మంది చిన్నారులుకు జన్మనిచ్చారని చెప్పారు. ఇందులో సిజేరియన్ ద్వారా 60 మంది పుట్టగా.. మరో 84 నార్మల్ డెలివరీలు అయ్యాయని హాస్పిటల్ తెలిపింది. పేషెంట్‌లను చూసుకోవడంలో తమ డాక్టర్లు ఇతర వైద్య సిబ్బంది కంటిమీద కునుకు లేకుండా పనిచేశారని హాస్పిటల్ వర్గాలు వెల్లడించాయి. ఇక వార్డుతో మొదలు పెడితే ఏప్రిల్ నాటికల్లా పూర్తిస్థాయిలో కోవిడ్-19 హాస్పిటల్‌గా మార్చడం జరిగింది.ఇక ఔట్ పేషెంట్‌ విభాగం ఆర్థోపెడిక్ బ్లాక్‌కు మార్చారు. అనంతరం మార్చి చివరినాటికి పూర్తిగా మూసివేయడం జరిగింది. ఇక అప్పటికే చికిత్స పొందుతున్న పేషెంట్లను గురు తేజ్ బహదూర్ హాస్పిటల్‌కు మార్చడం జరిగింది. ఇక ఔట్ పేషెంట్ విభాగంలో కూడా పడకలను ఏర్పాటు చేసింది హాస్పిటల్ సిబ్బంది.

 ఇంత త్వరగా వ్యాపిస్తుందని ఊహించలేదు

ఇంత త్వరగా వ్యాపిస్తుందని ఊహించలేదు

కరోనావైరస్ ఈస్థాయిలో వ్యాపిస్తుందని ఎప్పుడూ ఊహించలేదన్నారు డాక్టర్ కిషోర్ సింగ్. ఇక లోక్‌నాయక్ హాస్పిటల్‌లో 107 వెంటిలేటర్లు ఉండగా ఇంకా అవసరమవుతాయని ఎప్పుడూ ఊహించలేదని చెప్పారు. 2009-10లో స్వైన్ ఫ్లూ వచ్చిన సమయంలో ఒక ప్రత్యేకమైన ఐసొలేషన్ వార్డును ఏర్పాటు చేయడం జరిగిందని గుర్తు చేశారు. ఒకప్పుడు 18 ఐసీయూ బెడ్లు మాత్రమే ఉండేవని పీపీఈ కిట్లను కూడా ఐసీయూలోకి వెళ్లినప్పుడే ధరించేవారమని గుర్తు చేసుకున్న డాక్టర్... ఇప్పుడు నిత్యం పీపీఈ కిట్లు ధరిస్తున్నామని చెప్పారు. కరోనావైరస్ కేసులు విపరీతంగా పెరుగుతాయని ఊహించామని అయితే ఇంత తర్వాత అది కూడా తక్కువ సమయంలో విపరీతంగా పెరుగుతాయని ఊహించలేదని చెప్పారు. రోజుకు 50-100 కేసులు మాత్రమే వస్తాయని ఆ సమయంలో 1000 కేసులు హ్యాండిల్ చేసేలా అంతా సిద్ధంగా ఉండాలని సీఎం కేజ్రీవాల్ అప్పుడు సూచించారని డాక్టర్ చెప్పారు. కానీ ఇప్పుడు పరిస్థితి అంతకుమించి ఉందని చెప్పారు.

Recommended Video

తెలుగురాష్ట్రాల మధ్య Bus సర్వీసులకు బ్రేక్.. AP లో సిటీ బస్సులకు గ్రీన్ సిగ్నల్! || Oneindia Telugu
 పేషెంట్లకు అంతా తామై వ్యవహరిస్తున్న సిబ్బంది

పేషెంట్లకు అంతా తామై వ్యవహరిస్తున్న సిబ్బంది

ఈ 100 రోజుల్లో హాస్పిటల్‌ సిబ్బంది ఎన్నో విషయాలను నేర్చుకుందని డాక్టర్ చెప్పారు. ముందు పేషెంట్లకు కావాల్సిన ఆహారం ఇతరత్ర విషయాలు పేషెంట్ కుటుంబ సభ్యులే చూసుకునే వారని కానీ ఇప్పుడు అంతా తామై చూసుకుంటున్నామని ఓ నర్సు చెప్పింది. ఇక పేషెంట్ బంధువులు లేదా కుటుంబ సభ్యులు నేరుగా హెల్ప్ డెస్క్‌ వద్దకు వచ్చి తమ వారితో వీడియో కాల్ ద్వారా మాట్లాడే ఏర్పాటు చేసినట్లు హాస్పిటల్ వర్గాలు వెల్లడించాయి. ఢిల్లీలో రోజుకు 3వేల కేసులు వస్తుండగా మొత్తం 124 హాస్పిటల్స్ ఉన్నాయి. ఇందులో ప్రభుత్వం ప్రైవేట్ హాస్పిటల్స్ ఉన్నాయి. ఇక హోటళ్లు, బాంక్వెట్ హాల్స్, రైల్వే కోచ్‌లు, స్టేడియంలలో కూడా పేషెంట్ల చికిత్స కోసం ఢిల్లీ ప్రభుత్వం వినియోగిస్తోంది. ఇదిలా ఉంటే 15000 మంది హోం ఐసోలేషన్‌లో ఉన్నట్లు సమాచారం.

English summary
Four days after the city reported its first case of Covid-19 on March 2, Lok Nayak hospital had sprung into action to take on the virus challenge.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X