వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జియోకు షాక్: రూ.2లకే సూపర్‌ఫాస్ట్ డేటా, పెండింగ్‌లో ధరఖాస్తులు

రిలయన్స్ జియో ప్రత్యర్థి టెలికం కంపెనీలకు షాకిస్తే.. బెంగుళూరుకు చెందిన ఓ స్టార్టప్ జియో‌కు షాకిచ్చే ఆఫర్‌ను తెచ్చింది. రూ.2 ఇస్తే చాలు సూపర్ పాస్ట్ డేటాను ఇస్తామని ప్రకటించింది.

By Narsimha
|
Google Oneindia TeluguNews

Recommended Video

100 MB Internet For Rs 2 !

బెంగుళూరు: రిలయన్స్ జియో ప్రత్యర్థి టెలికం కంపెనీలకు షాకిస్తే.. బెంగుళూరుకు చెందిన ఓ స్టార్టప్ జియో‌కు షాకిచ్చే ఆఫర్‌ను తెచ్చింది. రూ.2 ఇస్తే చాలు సూపర్ పాస్ట్ డేటాను ఇస్తామని ప్రకటించింది.

శుభవార్త: జియో ఫీచర్‌ఫోన్‌లో వాట్సాప్‌ కోసం ఇలా చేస్తే సరిశుభవార్త: జియో ఫీచర్‌ఫోన్‌లో వాట్సాప్‌ కోసం ఇలా చేస్తే సరి

ఉచిత వాయిస్ కాల్స్, ఉచిత డేటాలతో రిలయన్స్ జియో ప్రత్యర్థి కంపెనీలకు చుక్కలు చూపించింది. అంతేకాదు జియో మార్గంలోనే ఇతర టెలికం కంపెనీలు కూడ నడవాల్సిన పరిస్థితులు కూడ అనివార్య పరిస్థితులను కల్పించింది జియో.

జియో‌కు షాక్: రూ.1799, 1899లకే 4జీ ఎయిర్‌టెల్ 4జీ స్మార్ట్‌పోన్స్జియో‌కు షాక్: రూ.1799, 1899లకే 4జీ ఎయిర్‌టెల్ 4జీ స్మార్ట్‌పోన్స్

డేటా, వాయిస్ కాల్స్ తో పాటు ఫీచర్ ఫోన్‌ పేరుతో అతి చౌకగా ఫోన్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది జియో. అయితే జియో బాటలోనే ఎయిర్‌టెల్, ఐడియా, వోడాఫోన్‌లు కూడ కొత్త ఫోన్లను అందుబాటులోకి తీసుకువచ్చేలా ప్లాన్ చేస్తున్నాయి.

శుభవార్త: కిరాణ మార్కెట్లోకి ముఖేష్ అంబానీ, జియో కష్టమర్లకు డిస్కౌంట్శుభవార్త: కిరాణ మార్కెట్లోకి ముఖేష్ అంబానీ, జియో కష్టమర్లకు డిస్కౌంట్

జియో బంపర్ ఆఫర్: రూ.399 రీ ఛార్జీ చేస్తే, రూ.2599 క్యాష్ బ్యాక్జియో బంపర్ ఆఫర్: రూ.399 రీ ఛార్జీ చేస్తే, రూ.2599 క్యాష్ బ్యాక్

 రూ.2 లకే సూర్ ఫాస్ట్ డేటా

రూ.2 లకే సూర్ ఫాస్ట్ డేటా

బెంగళూరు నగరంలో ఐఎస్‌పీ లైసెన్స్‌తో ఫైబర్‌ ఆప్టిక్స్‌ ద్వారా డేటా సేవలు అందిస్తున్న వైఫై డబ్బా జియో ప్లాన్లతో పోలిస్తే ఇప్పటికే భారీగా వినియోగదారులను ఆకట్టుకుంటోంది. ప్రీ పెయిడ్‌ కస్టమర్లకు సరసమైన ధరల్లో డేటా ప్లాన్లను ఆఫర్‌ చేస్తోంది.కేవలం రూ.2లకే 100 ఎంబీ డేటా ఆఫర్‌ చేస్తోంది. అలాగే రూ.10లకే 500ఎంబీ, రూ.20లకు 1 జీబీ డేటా అందిస్తోంది.మరో వైపు జియో రూ.19 లపై 150 ఎంబీ అందిస్తోంది.

 రౌటర్ ద్వారా వైఫై సేవలు

రౌటర్ ద్వారా వైఫై సేవలు

లక్షలు ఖర్చుపెట్టి సెల్‌ టవర్లను ఏర్పాటు చేయాల్సిన అవసరం లేకుండా రూ. 4వేలతో రౌటర్‌ ద్వారా తమ సేవలను విస్తరిస్తోంది. అతి తక్కువ ఖర్చుతో అతి వేగవంతమైన డేటా అందించడమే తమ లక్ష్యమని వైఫై డబ్బా ఫౌండర్‌ శర్మ చెబుతున్నారు. వంద నుంచి 200మీటర్ల పరిధిలో 50బీపీఎస్‌తో రిలయబుల్‌ సేవల్ని అందిస్తున్నట్టు తెలిపారు.

 బెంగుళూరులో 350 రౌటర్లు ఏర్పాటు

బెంగుళూరులో 350 రౌటర్లు ఏర్పాటు

ఇప్పటికే బెంగళూరు నగరంలో 350 రౌటర్లను ఏర్పాటు చేశారు. ఈ రౌటర్ల ద్వారా వినియోగదారులకు సేవలను అందిస్తున్నారు. ఇం​కా 1800 అప్లికేషన్లు పెండింగ్‌లో ఉన్నాయి. ప్రస్తుతం స్థానిక్‌ కేబుల్‌ ఆపరేటర్ల భాగస్వామ్యంతో ఈ సేవలను అందిస్తున్నారు.

 కొత్త కనెక్షన్ కోసం వారం రోజులు

కొత్త కనెక్షన్ కోసం వారం రోజులు

కొత్త కనెక్షన్ ఇవ్వాలంటే వారం రోజుల సమయం తీసుకొంటున్నారు. అయితే రానున్న రోజుల్లో కొత్త కనెక్షన్ ఇవ్వడానికి 4 రోజుల సమయాన్ని మాత్రం తీసుకొనేలా వ్యూహన్ని రూపొందిస్తున్నట్టు డబ్బా పౌండర్ శర్మ చెబుతున్నారు.రాబోయే 3-4 ఏళ్లలో లక్షల వైఫై డబ్బాలను ఏర్పాటు చేయాలని యోచిస్తున్నట్టు చెప్పారు. కాగా వైఫై డబ్బాకి ప్రస్తుతం వై కాంబినేటర్‌ సహా కొన్ని సంస్థలు ఇన్వెస్టర్లుగా ఉన్నాయి.

English summary
Reliance changed the rules of the game by launching Jio; forcing the other telecom operators to either play by those rules or lose customers. But, this 13-month old startup from Bengaluru wants to change the way the entire game is played.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X