వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కశ్మీర్ వ్యాలీలో... 5 నెలల్లో 100మంది తీవ్రవాదులు, 50 మంది సైనికుల హతం...!

|
Google Oneindia TeluguNews

అయిదు నెలల్లో వందమంది తీవ్రవాదులు హతమయ్యారని భద్రతా దళాల అధికారులు తెలిపారు. అయితే పుల్వామ దాడిలో మృత్యువాత పడిన 40 మందితోపాటు మే 31 వరకు 52మంది జవాన్లు కూడ మిలిటెంట్ల దాడిలో మృతి చెందారని భద్రతా దళ అధికారులు ప్రకటించారు.

దీంతో పాటు ఉగ్రవాదుల్లో చేరే వారు కూడ 50 మంది వరకు చేరారని వెళ్లడించారు. జమ్ము కశ్మీర్‌లో తీవ్రవాదంపై ఉక్కుపాదం మోపుతున్న కేంద్ర ప్రభుత్వం రోజుకోకరి చొప్పున ఏరి పడేస్తుంది. ఇక పుల్వామా దాడి తర్వాత అప్రమత్తమైన భద్రత దళాలు తీవ్రవాదులపై దాడీని తీవ్రతరం చేశాయి. ఈనేపథ్యంలో పుల్వామా దాడీ తర్వాత ఇప్పటి వరకు 100 మంది తీవ్రవాదులు హతమయ్యారని వెల్లడించారు. అందులో ఇరవై అయిదు మంది విదేశీ తీవ్రవాదులు కాగా మిగతా 75మంది స్థానిక తీవ్రవాదులు ఉన్నట్టు భద్రత దళాలు చెప్పాయి.

100 militants were killed till May 31 of this year

అయితే తీవ్రవాదులు ప్రతినెల సరాసరిగా 20 మందికి మ‌ృత్యువాత పడుతున్నారని చెప్పిన భద్రతా దళలు కూడ పుల్వామా దాడిలో మృత్యవాత పడిన 40మందితో పాటు మొత్తం 52మంది సైనికులు తీవ్రవాదుల దాడిలో చనిపోయారని చెప్పారు. కాగా ఎనౌకౌంటర్లలో చనిపోయిన తీవ్రవాదుల్లో కమాండర్లుగా ఉన్న జకీరర్ ముసా, అన్సార్ ఘాజ్‌వాత్ ఉల్ హింద్ సంస్థ అధినేత కూడ ఉన్నారని చెప్పారు.

కాగా మ‌ృతి చెందిన తీవ్రవాదుల్లో 25 మంది కశ్మీర్‌లోని షోపియాన్ జిల్లా నుండి కాగా మరో 15 మంది పుల్వామా, 14 మంది అవంతిపోర జిల్లా నుండి ఉండగా 12 మంది కుల్గాం జిల్లాలో హతమయ్యారని తెలిపారు.అయినా ఉగ్రవాద సంస్థల్లో చేరుతున్న వారి సంస్థ పెరుగుతూ వస్తుదని చెప్పారు. ఇక రెండు నెలల నుండే 50 మంది వరకు ఉగ్రవాద సంస్థల్లో చేరారని చెప్పారు.అయితే తీవ్ర వాద సంస్థల్లో చేరకుండా తల్లి తండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలని భద్రతా దళాలు కశ్మీర్ ప్రజలకు సూచించారు.

English summary
Over 100 militants were killed in "unrelenting operations" by security forces against various militant outfits in the Kashmir Valley till May 31, police said
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X