వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పోస్ట్ కోవిడ్ బాధితులకు కొత్త సమస్య .. జుట్టు రాలుతున్న కేసులు, ఆస్పత్రులకు పరుగులు

|
Google Oneindia TeluguNews

కరోనా మహమ్మారి బారిన పడి కోరుకున్నవారు ఇప్పుడు కొత్త సమస్యలు ఎదుర్కొంటున్నారు. కోవిడ్ బారినపడి కోలుకున్న వారిలో తల వెంట్రుకలు రాలిపోతున్న సమస్య ఇప్పుడు విపరీతంగా పెరిగింది. జుట్టు ఊడిపోతుందని ఆసుపత్రుల బాట పడుతున్న బాధితుల సంఖ్య వంద శాతం పెరిగిందని వైద్యులు చెబుతున్నారు. కరోనా మహమ్మారి శరీరంలోని ఆర్గాన్స్ మీదనే కాకుండా, చర్మం, జుట్టు వంటి వాటిపై కూడా తన ప్రభావాన్ని చూపిస్తుంది అని వైద్య నిపుణులు తాజాగా జుట్టు రాలిపోతున్న సమస్యతో ఆసుపత్రులకు పెరుగుతున్న కేసులను బట్టి చెప్తున్న పరిస్థితి ఉంది.

భారత్ లో పెరుగుతున్న కొత్త కేసులతో ఆందోళన .. తాజాగా 44,230 కొత్త కేసులు, 555 మరణాలు !!భారత్ లో పెరుగుతున్న కొత్త కేసులతో ఆందోళన .. తాజాగా 44,230 కొత్త కేసులు, 555 మరణాలు !!

ఇక తాజాగా ఢిల్లీలోని ఇంద్రప్రస్థ అపోలో హాస్పిటల్‌లో కరోనా వైరస్ రోగులలో జుట్టు రాలడంపై 100 శాతం ఫిర్యాదులు పెరిగాయని వైద్యులు తెలిపారు. సాధారణంగా, దక్షిణ ఢిల్లీలోని ప్రైవేట్ హాస్పిటల్ లో వారానికి నాలుగు నుండి ఐదుగురు పేషెంట్ మాత్రమే వచ్చే వారిని, కానీ ఇటీవల కాలంలో ఆ సంఖ్య విపరీతంగా పెరిగింది అని చెబుతున్నారు. ఏదేమైనా, మే నెల నుండి జుట్టు రాలడం కేసులు బాగా నమోదవుతున్నాయి. అప్పటి నుండి మేము రెట్టింపు కేసులను చూస్తున్నామని వైద్యులు వెల్లడించారు. సాధారణంగా, కోవిడ్ -19 రోగులు వ్యాధి నుండి కోలుకున్న ఒక నెల తర్వాత నుండి జుట్టు రాలుతున్న సమస్యను ఎదుర్కొంటున్నారని, కొన్ని సందర్భాలలో కరోనా సోకిన సమయంలో కూడా వారికి జుట్టు రాలడం గమనించవచ్చునని వైద్యులు చెప్పారు.

100 per cent rise in hair loss complaints among COVID patients

ఆహారపు అలవాట్లలో మార్పు, కరోనా సోకిన సమయంలో జ్వరం, ఒత్తిడి, ఆందోళన, ఆకస్మిక హార్మోన్ల మార్పులతో పాటుగా నిరంతరం కరోనా తగ్గించటానికి చేసే ప్రతి చర్యలవల్ల జుట్టు రాలుతుంది అని వైద్యులు అంటున్నారు. పోషకాహారాలతో జుట్టు రాలడాన్ని నివారించవచ్చని, ఒత్తిడిని తగ్గించుకోవాలి అని, ధ్యానం చేయడం, ఆరోగ్యకరమైన భోజనం చేయడం సహజ పోషక పదార్థాలు తీసుకోవడం వల్ల జుట్టు రాలడాన్ని నివారించవచ్చు అని వారంటున్నారు. ఏదేమైనా కరోనా సోకిన చాలా మందిలో కరోనా నుండి కోలుకున్న తరువాత జుట్టు రాలడం ప్రధాన సమస్యగా మారింది.

English summary
Post covid victims are now facing new problems. The problem of hair loss in those who have recovered from a covid attack has now increased exponentially. Doctors say that the number of victims who go to the hospital for hair loss has increased by 100 percent.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X