వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శతాధిక వృద్దుడు భేష్: కరోనా మహమ్మారిని జయించిన హీరో, ఆస్పత్రిలో చాక్లెట్ కేక్ కట్ చేసి.

|
Google Oneindia TeluguNews

కరోనా మహమ్మరి నుంచి బయటపడటం అంటే మాములు విషయం కాదు. పున:జన్మ అన్నట్టే.. అయితే వైరస్ వచ్చిన వారికి రోగ నిరోధక శక్తి ఉంటే జయిస్తున్నారని.. వృద్దులు, పిల్లలకు వస్తే అంతే సంగతి అని అంటున్నారు. కానీ కొన్నిచోట్ల అద్భుతాలు జరుగుతున్నాయి. ఇటలీలో శతాధిక వృద్దుడు వైరస్ రక్కసిని జయించాడు. అలాగే హైదరాబాద్‌లో కూడా నెలల వయస్సున్న చిన్నారని వైరస్‌ను ఓడించింది. దీంతో వైరస్ వస్తే వయసుతో సంబంధం లేదు అని మరోసారి రూడీ అయ్యింది. ముంబైలో ఓ శతాదిక వృద్దుడు అర్జున్ గోవింద్ నరింగ్రేకర్ వైరస్‌ను దిగ్విజయంగా జాయించాడు.

 కరోనా విజృంభణ: దేశంలో 9 లక్షల దాటిన కరోనా కేసులు, రికవరీ రేటూ పెరిగింది కరోనా విజృంభణ: దేశంలో 9 లక్షల దాటిన కరోనా కేసులు, రికవరీ రేటూ పెరిగింది

జూలై 1న వైరస్..

జూలై 1న వైరస్..

ముంబైకి చెందిన శతాధిక వృద్దుడు అర్జున్.. స్కూల్‌లో హెడ్మాస్టర్‌గా పనిచేసి పదవీ విరమణ పొందారు. ఇంటిపట్టునే ఉంటుండగా.. జూలై 1వ తేదీన ఆయనకు వైరస్ వచ్చింది. దీంతో అతనిని ముంబై బాలాసాహెబ్ థాకరే ట్రామా కేర్ ఆస్పత్రికి తరలించారు. వైరస్ సోకిన.. అతను వైద్యానికి బాగా స్పందించారు. 15 రోజుల్లోపే అతను వైరస్‌ను ఓడించాడు. అయితే అతని బర్త్ డే వస్తుందని కుటుంబసభ్యుల ద్వారా సిబ్బంది తెలుసుకున్నారు.

ఆస్పత్రిలో బర్త్ డే

ఆస్పత్రిలో బర్త్ డే

ఇంకేముంది అతని బర్త్ డే ఆస్పత్రిలో జరపాలని నిర్ణయం తీసుకున్నారు. కేక్ తెప్పించాలని సూపరింటెండెంట్ డాక్టర్ విద్యపై ఒత్తిడి తీసుకొచ్చారు. చివరికి ఫుల్ చాకొలేట్ కేక్ తీసుకొచ్చి... బర్త్ డె సెలబ్రేషన్స్ చేసుకున్నారు. 100 క్యాండిల్ పెట్టి మరీ.. వేడుకగా జరుపుకున్నారు. ఆస్పత్రిలో వైరస్ తగ్గిన వృద్దుడు బర్త్ డే వేడుక ఫ్యామిలీ మెంబర్స్, వైద్యారోగ్య సిబ్బందిని సంబరానికి గురిచేసింది.

Recommended Video

COVID 19 మృతుల అంత్యక్రియలకు రూ. 15వేలు, Quarantine కేంద్రాల్లో మెరుగైన సేవలు : AP CM Jagan
మహమ్మారి విజృంభణ

మహమ్మారి విజృంభణ

ఇటు మహారాష్ట్రలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. మంగళవారం ఒక్కరోజే 6 వేల 741 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో వైరస్ సోకిన మొత్తం కేసుల సంఖ్య 2 లక్షల 60 వేలు దాటింది. మంగళవారం 213 మంది చనిపోగా.. వైరస్ సోకి చనిపోయిన వారి సంఖ్య 10 వేల 695గా ఉంది. ఇటు ముంబైలో కూడా పరిస్థితి దారుణంగా మారింది. మంగళవారం 969 పాజిటివ్ కేసులతో మొత్తం కేసులు 94 వేల 863గా ఉంది. మంగళవారం 70 మంది చనిపోవడంతో.. మొత్తం ముంబైలో చనిపోయినవారి సంఖ్య 5302గా ఉంది.

English summary
100-year-old coronavirus patient, Arjun Govind Naringrekar, recovered from the virus and was discharged from hospital in Mumbai on Tuesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X