వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

1000 శాతం సబబే... పౌరసత్వ సవరణ బిల్లుపై మోడీ

|
Google Oneindia TeluguNews

Recommended Video

CAB 2019 Is 1000% Right : Will You Agree With PM Modi ? || Oneindia Telugu

పౌరసత్వ సవరణ బిల్లుపై ఈశాన్య రాష్ట్రాలతో పాటు పలు ఉత్తరాధి రాష్ట్రాల్లో నిరసనలు మిన్నంటుతున్న నేపథ్యంలోనే ప్రధాని మోడీ మాత్రం బిల్లును మరోసారి సమర్థించారు. పౌరసత్వ బిల్లును తీసుకురావడం 1000 శాతం సబబేనంటూ వ్యాఖ్యానించారు. కొత్త చట్టం పొరుగుదేశాలైన పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్గానిస్తాన్ దేశాల నుండి వచ్చిన శరణార్థులు...అనేక ఇబ్బందులు పడుతున్న హిందువుల రక్షణ కోసమే బిల్లు తీసుకువచ్చామని ప్రధాని పునరుద్ఘటించారు. దీంతో బిల్లును తీసుకురావడం ముమ్మాటికి న్యాయమేనని నొక్కి వ్యాఖ్యానించారు.

మరోవైపు పశ్చిమబెంగాల్‌తో పాటు అసోంలో జరిగే అందోళనలు, హింసాత్మక సంఘటనల వెనుక విపక్షాల అస్త్రం ఉందని ప్రధాని మోడీ ఆరోపణలు చేశారు. ఇందుకోసం కాంగ్రెస్ పార్టీతో పాటు ఆ పార్టీ మిత్రపక్ష పార్టీలు ఆందోళనకు పురిగొల్పుతున్నాయని ఆయన మండిపడ్డారు. ప్రతిపక్ష పార్టీలు భవిష్యత్‌పై దిక్కుతోచకనే హింసను ప్రేరేపిస్తున్నాయని ఆయన విమర్శించారు.

1000 percent correct decision of Citizenship Bill : pm modi

అందోళనల్లో నిరసనకారులు వేసుకున్న డ్రస్సులను బట్టే.. వారిని గుర్తించవచ్చని అన్నారు. ఈ నేపథ్యంలోనే పౌరసత్వ బిల్లుపై శత్రుదేశమైన పాకిస్తాన్ వాదననే కాంగ్రెస్ పార్టీ తీసుకువస్తుందని దుయ్యబట్టారు.

బిల్లుపై విపక్షాలు రాద్దాంతం చేయడం మంచిపద్దతి కాదని ఆయన హితవు పలికారు. పోరుగు దేశాల నుండి భారత్‌కు వచ్చిన వారు దుర్భరమైన జీవితం అనుభవిస్తున్నారని వారికి తగిన గౌరవం ఇవ్వాల్సిన అవసరం ఉందని అందుకే పౌరసత్వ బిల్లును పార్లమెంట్ ఉభయసభలు కూడ అమోదించాయని మోడి గుర్తు చేశారు. ఝార్ఖండ్ ఎన్నికల ప్రచారంలో పాల్గోన్న మోడీ పైవిధంగా వ్యాఖ్యానించారు.

English summary
decision was “1000 percent correct”.said Amid protests in West Bengal and Assam over the new Citizenship law, Prime Minister Narendra Modi on Sunday reiterated the importance of the law.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X