వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

1170 సార్లు కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు, 103 ఉగ్రవాదుల హతం

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ : నక్కజిత్తుల పాకిస్థాన్ వైఖరి మారడం లేదు. సరిహద్దుల్లో కాల్పుల విరమణ ఒప్పందానికి యదేచ్చగా తూట్లు పొడుస్తోంది. ఈ ఏడాది జూన్ 6 వరకు 1170 సార్లు కాల్పులు జరిపిందని కేంద్ర హోంమంత్రిత్వశాఖ నివేదికలో పేర్కొంది. ఇది గత ఏడాది 1629 సార్లుగా ఉంది. అంటే ఆరునెలల్లో 11 వందల సార్లు కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడిస్తే .. మరో ఆరునెలల్లో ఇంతేస్థాయిలో కాల్పులు జరిపిన గతడాది కన్నా ఎక్కువ ఉల్లంఘించినట్లవుతుంది.

కవ్వింపు చర్యలు .. ధీటుగా సమాధానం
సరిహద్దుల్లో పాకిస్థాన్ కవ్వింపు చర్యలకు దిగడంతో భారత్ కూడా ధీటుగానే స్పందించింది. జూన్ 6 వరకు 103 ఉగ్రవాదులను భారత సైన్యం మట్టుబెట్టింది. అయితే గతేడాది 254 మంది ఉగ్రవాదులను హతమార్చిన సంగతి తెలిసిందే. గతేడాది కంటే కశ్మీర్‌లో ఉగ్రవాద చర్యలు ఎక్కువయ్యాయని హోం మంత్రిత్వ శాఖ పేర్కొంది. గతేడాది 238 ఉగ్రవాద కార్యకలాపాలను జవాన్లు ధీటుగా తిప్పికొట్టాయని వివరింంచింది. ఆ సమయంలో 86 మంది భద్రతా సిబ్బంది .. 37 మంది పౌరులు కూడా నెలకొరిగారని గుర్తుచేసింది.

103 terrorists killed in J&K this year, Pakistan violated ceasefire 1,170 times

అయితే కశ్మీర్‌లో ఇప్పటివరకు స్థానికుల రాళ్లదాడులు తగ్గాయని తెలిపింది. గతేడాది 750 సార్లు రాళ్లతో భద్రతా సిబ్బందిపై స్థానికులు దాడిచేసినట్టు పేర్కొంది. అంతేకాదు గతేడాది 329 ఉగ్రవాద కార్యకలపాలు జరిగాయని స్పష్టంచేసింది. 2016లో హిబ్బుల్ ముజాహీద్దిన్ కమాండర్ బుర్హన్ వనిని మట్టుబెట్టాక కశ్మీర్‌లో అల్లర్లు చెలరేగిన సంతి తెలిసిందే. ఈ అల్లర్లలో 150 మంది ఉగ్రవాదులు ... 82 మంది భద్రతా సిబ్బంది, 15 మంది పౌరులను చనిపోయినట్టు తన నివేదికలో ప్రత్యేకంగా ప్రస్తావించింది కేంద్ర హోంశాఖ.

English summary
Indian security forces killed over 100 terrorists in Jammu and Kashmir till June 6 this year, according to defence sources. In 2019, the security forces eliminated 103 terrorists in Jammu and Kashmir, while in 2018, 254 terrorists were killed, according to a report by ANI.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X