బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఒక పార్టీతో 103 మందికి కరోనా: కంటైన్మెంట్ జోన్‌గా మారిన అపార్ట్‌మెంట్‌

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: కరోనావైరస్ పట్ల జాగ్రత్తగా ఉండాలని ప్రభుత్వాలు చెబుతున్నా.. కొందరు ప్రజలు మాత్రం నిర్లక్ష్యం వ్యవహరిస్తూ ఆ మహమ్మారి బారినపడుతున్నారు. తాజాగా, ఇలాంటి ఘటనే కర్ణాటకలో చోటు చేసుకుంది. ఓ అపార్ట్‌మెంట్‌లో ఓ పార్టీ కారణంగా 103 మంది కరోనా పాజిటివ్‌గా తేలింది.

అపార్ట్‌మెంట్‌లో పార్టీ..

అపార్ట్‌మెంట్‌లో పార్టీ..

బృహత్ బెంగళూరు మహానగర పాలకె(బీబీఎంపీ) అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఫిబ్రవరి 4న బొమ్మనహళ్లిలోని ఓ అపార్ట్‌మెంట్ ప్రాంగణంలో ఒక పార్టీ జరిగింది. ఆ పార్టీలో అపార్ట్‌మెంట్ వాసులందరూ పాల్గొన్నారు. ఆ తర్వాత వారిలో కొందరు డెహ్రాడూన్ పర్యటనకు వెళ్లేందుకు కరోనా టెస్టులు చేయించుకున్నారు. వారి టెస్ట్ ఫలితాలు ఫిబ్రవరి 10న వచ్చాయి. వారిలో చాలా మందికి కరోనా సోకినట్లు తేలింది.

ఒక్క పార్టీతో 103 మందికి కరోనా..

ఒక్క పార్టీతో 103 మందికి కరోనా..

ఈ క్రమంలో వెంటనే కరోనా బాధితులు అపార్ట్‌మెంట్ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్ వారికి సమాచారం ఇచ్చారు. దీంతో బీఎంసీ అధికారులను సంప్రదించి అపార్ట్‌మెంట్ వాసులందరికీ కరోనా పరీక్షలు నిర్వహించారు. మొత్తం 1052 మందికి టెస్టులు మందికి టెస్టులు చేయగా, 103 మందికి కరోనా సోకినట్లు తేలింది. వీరిలో 96 మంది అరవై ఏళ్లకు పైబడినవారేనని బీఎంసీ అధికారులు వెల్లడింాచరు.

కంటైన్మెంట్ జోన్‌గా మారిన అపార్ట్ మెంట్

కంటైన్మెంట్ జోన్‌గా మారిన అపార్ట్ మెంట్

కరోనా పాజిటివ్ వచ్చినవారిలో ఒకరు ఆస్పత్రిలో చేరగా మిగితా వారిని ఐసోలేషన్‌లో ఉంచామని తెలిపారు. అపార్ట్‌మెంట్‌లో ఉన్న అందర్నీ క్వారంటైన్లో ఉంచామని బీఎంసీ కమిషనర్ మంజునాథ్ చెప్పారు. పాజిటివ్ వచ్చినవారిలో చాలా మందికి లక్షణాలు లేవని బీఎంసీ అడిషనల్ కమిషనర్ రామకృష్ణ తెలిపారు. ప్రభుత్వ నిబంధనల మేరకు ఆ ప్రాంతాన్ని కంటైన్మెంట్ జోన్‌గా ప్రకటించామని పేర్కొన్నారు. అపార్ట్ మెంట్ వాసులకు అవసరమైన సరులను అందిస్తామని తెలిపారు. ఇలాంటి పార్టీలు చేసుకున్నప్పుడు.. కరోనా నిబంధనలు తప్పకుండా పాటించాలని అధికారులు సూచించారు. కాగా, కర్ణాటకలో ఇప్పటి వరకు 9,45,638 కరోనా కేసులు నమోదు కాగా, 9,27,580 మంది కోలుకున్నారు. 12,267 మంది కరోనాతో మరణించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 5,772 యాక్టివ్ కేసులున్నాయి.

English summary
A total of 103 people from an apartment in Bommanahalli in Bengaluru tested positive for Covid-19 after a recent party in the complex.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X