• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ప్రభుత్వ గణాంకాలు, జీడీపీలో రాజకీయ నేతల జోక్యంపై ఆర్థికవేత్తల ఆందోళన

|

న్యూఢిల్లీ : స్థూల జాతీయ ఉత్పత్తి (జీడీపీ), ఉద్యోగాలకు సంబంధించిన సమాచారం రాజకీయ పార్టీలు కలుగజేసుకోవడంపై 108 ఆర్థికవేత్తలు, సామాజికేత్తలు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇది ఆయా సంస్థల సమగ్రతను దెబ్బతీయడమేనని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇటీవల జీడీపీ, ఎన్ఎస్ఎస్వో రూపొందించిన ఉద్యోగుల డేటాను బహిర్గతం చేయొద్దని ఆదేశాలు వచ్చిన నేపథ్యంలో ఈ మేరకు మేధావులు స్పందించారు.

మసీదు కాల్పులు : 49కి చేరిన మృతుల సంఖ్య, ఆస్ట్రేలియాకు చెందిన నిందితుడు అరెస్ట్

సంస్థల సమగ్రత దెబ్బతీయుద్దు ..

సంస్థల సమగ్రత దెబ్బతీయుద్దు ..

గత కొన్ని దశాబ్ధాలుగా భారతదేశం ఆర్థిక, సామాజికంగా అభివృద్ధి చెందుతోందని, ఇది గణాంక సంస్థల సమగ్రతను నిదర్శమని అభిప్రాయపడ్డారు. కొన్ని సందర్బాల్లో జీడీపీ, ఉద్యోగుల డేటాకు సంబంధించి అంచనాలు తప్పాయని .. కానీ ఏ సందర్భంలోనూ రాజకీయ నేతల కలిగించుకోలేదని, అలాగే ఆర్థికవేత్తల నిర్ణయాన్ని ప్రభావితం చేయలేదని పేర్కొన్నారు.

మాకు మద్దతివ్వండి ...

మాకు మద్దతివ్వండి ...

వివిధ విభాగాల ఆర్థిక నిపుణులు, గణాంక నిపుణులు, సొంతంగా పరిశోధించే ఆర్థికవేత్తలు తమతో గళం విప్పి .. ప్రస్తుతం జరుగుతోన్న పరిణామాలపై స్పందించాలని ఆర్థికవేత్తలు, సామాజికవేత్తలు కోరారు. ఈ విధంగా చేయడంతో ఆయా సంస్థల సమగ్రతను కాపాడిన వారవుతారని ఐఐఎంకు చెందిన రాకేశ్ బసంత్, యూనివర్సిటీ మస్సాచుసెట్ కు చెందిన జేమ్స్ బాయ్స్, హర్వార్డ్ వర్సిటీకి చెందిన ఎమిలీ బ్రెజా, ఢిల్లీ వర్సిటీకి చెందిన సతీశ్ దేశ్ పాండ్, బ్రిటిష్ కొలంబియా వర్సిటీకి చెందిన పాత్రిక్ ప్రాన్కోస్, రామకుమార్, ఐఐఎం, హేమ స్వామినాథన్, జేఎన్ యూ రోహిత్ ఆజాద్ కోరారు.

జోక్యం చేసుకోవద్దు ..

జోక్యం చేసుకోవద్దు ..

గణాంక, ఇతర అంశాల్లో సెంట్రల్ స్టాటిస్టిక్స్, నేషనల్ శాంపిల్ సర్వే ఆర్గనైజేషన్ పనుల్లో రాజకీయ నేతలు కల్పించుకోవద్దని .. వారి పనికి విఘాతం కలిగించొద్దని వారు పేర్కొన్నారు. ఇలా చేయడం వల్ల స్వేచ్ఛగా పనిచేసే వీలుంటని వారు సూచించారు. ఇప్పటికీ కూడా రాజకీయ నేతల చేతల్లో బందీగా ఉండటం వల్ల ఒనగూరే ప్రయోజనం ఏమీ లేదని ప్రస్తావించారు.

తేడా గమనించండి ..

తేడా గమనించండి ..

ఇలా చేయడం వల్ల సీఎస్వో, జీడీపీ వృద్ధి 2016-17 సంవత్సరంలో 1.1 శాతం నుంచి 8.2కి పెరిగిందని ... ఇది దశాబ్ధంలో అధికని గుర్తుచేశారు. జోక్యం లేకుండా పనులు జరుగుడంతో ఆర్థికరంగం డెవలప్ అవుతోందని చెప్పడానికి ఇదే ఉదహరణ చెప్పారు. అలాగే పిరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వేలో మితిమీరిన జోక్యంతో 2017-18 ఏడాదిలో దాని వృద్ధిరేటు మందగించిందని ఉదహరించింది.

ఒత్తిడి తట్టుకోలేక ..

ఒత్తిడి తట్టుకోలేక ..

ఎన్ ఎస్ ఎస్ వో జాబితా తయారీ ఆలస్యమవుతోందని ప్రభుత్వంతో ఒత్తిడి రావడం వల్ల జాతీయ గణాంకాల కమిషన్ సభ్యులు, తాత్కాలిక చైర్మన్ పదవులకు రాజీనామా చేశారని తెలిపారు.

English summary
Expressing concerns over "political interference" in influencing statistical data in India, as many as 108 economists and social scientists Thursday called for restoration of "institutional independence" and integrity to the statistical organisations. Their joint statement comes in the backdrop of controversy over revision of gross domestic product (GDP) numbers and withholding employment data by the NSSO. Two members of the National Statistical Commission (NSC), including the acting chairman, subsequently resigned because they felt the NSSO was delaying the release of the report, though the NSC itself had officially cleared it, they added.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more
X