వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

10 రోజులే: 10వ తరగతి పరీక్షలపై కేంద్ర మానవ వనరుల శాఖ కీలక ప్రకటన

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: సీబీఎస్‌ఈ మిగిలిన పదవ తరగతి పరీక్షలపై నెలకొన్న ఉత్కంఠపై కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంగళవారం స్పష్టతనిచ్చింది. ఈశాన్య ఢిల్లీకి చెందని విద్యార్థులు మినహా దేశ వ్యాప్తంగా ఎలాంటి 10వ తరగతి పరీక్షలు నిర్వహించబడవని తెలిపింది.

కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ ఈ మేరకు ట్విట్టర్ వేదికగా స్పందించింది. పరీక్షలకు సన్నద్ధమయ్యేందుకు అందరూ విద్యార్థులకు 10 రోజుల సమయం ఇవ్వడం జరుగుతుందని పేర్కొంది.

 10th board exams over for entire country except for North-East Delhi : HRD Ministry

మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ ఇంతకుముందు మాట్లాడుతూ.. ఒకటి లేదా రెండ్రోజుల్లో పదవ తరగతి పరీక్షలకు సంబంధించిన తేదీలను ప్రకటించడం జరుగుతుందని తెలిపారు. వెబినార్ నిర్వహించిన సందర్భంగా ఆయన ఈ మేరకు వ్యాఖ్యానించారు.

జేఈఈ, నీట్ లాంటి పోటీ పరీక్షలకు భారీ సంఖ్యలో సన్నద్ధమవుతున్న విద్యార్థులను ఉద్దేశించి మంత్రి మాట్లాడారు. ఈ పరీక్షలకు కొత్త తేదీలను ప్రకటించడం జరుగుతుందని చెప్పారు.

దేశంలోని ఇంజినీరింగ్ కాలేజీల్లో ప్రవేశాల కోసం జేఈఈ(మెయిన్) పరీక్షలను జులై 18 నుంచి 23 మధ్య, మెడికల్ కాలేజీల్లో ప్రవేశం కోసం నీట్ పరీక్షలను జులై 26న నిర్వహించడం జరుగుతుంది.

English summary
Ending all the speculations regarding holding of remaining papers of class 10th board exam, the Ministry of Human Resource Development (MHRD) on Tuesday said that no board examinations will be held for the class 10 students nationwide, except for the students from North-East Delhi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X