వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భారత్‌లో కనిపించే ఈ జాతి జంతువులే నిపా వైరస్‌కు మూలకారణం: పరిశోధకులు

|
Google Oneindia TeluguNews

నిపా వైరస్... ప్రమాదకరమైన వైరస్. గతేడాది ఒక్క కేరళలోనే 17 మంది ప్రాణాలు తీసిన అతిప్రమాదకరమైన వైరస్. ప్రస్తుతం మళ్లీ కోరలు చాచేందుకు సిద్ధమవుతోంది. భారత్‌లో గబ్బిలం జాతికి చెందిన 11 జంతువులు నిపా వైరస్‌ను వ్యాప్తి చేసేందుకు సిద్ధంగా ఉన్నాయని పరిశోధకులు తమ ప్రాథమిక పరీక్షల ద్వారా వెల్లడించారు. దక్షిణాసియాలో ఎక్కువగా కనిపించే ఫ్రూట్ బ్యాట్‌కు నిపా వైరస్ సోకిందని అది పండ్లను కొరికినప్పుడు ఆ వైరస్ అందులోకి ప్రవేశించే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు తెలిపారు.

గబ్బిలం జాతికి చెందిన 113 జంతువుల్లో 31 జంతువుల శాంపిల్స్‌ను పరీక్షించడం జరిగింది. ఇ:దులో 11 జంతువుల్లో నిపా వైరస్ లక్షణాలు కనిపించినట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. వీరు పలు అంశాలను పరిగణలోకి తీసుకుని పరీక్షలు నిర్వహించారు. అయితే ఇందులో ఫలితాలు 83శాతం అక్యూరసీతో సరిపోలినట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. అయితే ఈ జంతువులు ఎలాంటి వాటిని ఆహారంగా తీసుకుంటాయనేదానిపై ఇంకా స్టడీ చేయాల్సి ఉందని పరిశోధకులు తెలిపారు. ఆ ఆహారంను మనుషులు తీసుకుంటే వారికి నిపా వైరస్ సోకి ప్రాణాలకే ప్రమాదంగా మారే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు తెలిపారు. రైనా ప్లో రైట్ అనే శాస్త్రవేత్త నేతృత్వంలో ఈ పరీక్షలు అమెరికాలోని మోంటానా స్టేట్ యూనివర్శిటీలో నిర్వహించారు. ఈ శాస్త్రవేత్తల బృందంలో కేరళ అగ్రికల్చర్ యూనివర్శిటీకి చెందిన పీఓ నమీర్ కూడా ఉన్నారు.

nipah
ఈ పరిశోధనలు కచ్చితత్వంతో కూడినవని నమీర్ అన్నారు. ఇక భారత్‌లో కూడా ఈ తరహా పరీక్షలు నిర్వహించాల్సి ఉందని చెప్పారు. ఇప్పటి వరకు భారత్‌లో శాంప్లింగ్ చేయలేదని చెప్పిన నమీర్... నిపా వైరస్ తమతో పాటు మోసుకెళ్లే జంతువులు భారత్‌లోనే ఉన్నట్లు ఆయన చెప్పారు. ఇందుకోసమే భారత్‌లోని గబ్బిలాల జాతిని పోలి ఉండే జంతువుల నుంచి శాంపిల్స్ సేకరించి పరీక్షలు జరిపేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని నమీర్ చెప్పారు. గబ్బిలాల జాతికి చెందిన జంతువులను గుర్తించి వాటిపై పరీక్షలు నిర్వహిస్తే ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుని ప్రజల ఆరోగ్యాలను కాపాడిన వారమవుతామని చెప్పారు. ముఖ్యంగా కేరళ లాంటి రాష్ట్రంలో ఒక్క ఏడాదిలోనే రెండు సార్లు నిపా వైరస్ మూలాలు బయటపడినట్లు గుర్తుచేశారు నమీర్.
English summary
A team of scientists have found preliminary evidence that 11 different species of bats found in India are potential carriers of the deadly Nipah virus, that killed 17 people in Kerala last year. Until now, the virus was confirmed only in the Indian flying fox (Pteropus medius), a fruit bat species found across south Asia and treated as a major disease vector.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X