వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఒడిశాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 11 మంది మృతి, పలువురికి గాయాలు...
ఒడిశాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ముర్తాన్ హండి వద్ద వ్యాన్ బోల్తాకొట్టింది. ప్రమాదంలో 11 మంది అక్కడికక్కడే మృతి చెందారు. వ్యాన్లో 35 మంది ప్రయాణికులు ఉన్నట్టు తెలుస్తోంది. స్థానికులు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. గాయపడ్డవారి పరిస్థితి విషమంగా ఉంది. దీంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని పోలీసులు వెల్లడించారు.

Covishield : ‘కొవిషీల్డ్’ ను వారికి ఇవ్వొద్దు, జర్మన్ వ్యాక్సిన్ కమిషన్ కీలక సూచనలు!
ఛత్తీస్ఘడ్కి చెందిన 35 మంది సిందుగౌడ పరిధిలో గల ముర్తాన్హండి వచ్చారు. అంత్యక్రియలకు హాజరై.. తిరిగి స్వగ్రామానికి వ్యాన్లో వెళ్తున్నారు. ఇంతలో ప్రమాదం కబళించింది. చనిపోయిన వారిని గుర్తించాల్సి ఉంది. వ్యాన్ ప్రమాదం జరగడానికి గల కారణం తెలియరాలేదు. కానీ విచారణలో ఏం జరిగిందో తెలిసే అవకాశం ఉంది అని పోలీసులు అంటున్నారు.