వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఢిల్లీలో ఘోరం: ఒకే ఇంట్లో బయటపడిన 11మృతదేహాలు, హత్యా, ఆత్మహత్యా?

By Srinivas
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఢిల్లీలో షాకింగ్ సంఘటన వెలుగు చూసింది. ఓ ఇంట్లో 11 మంది మృతదేహాలు లభ్యమయ్యాయి. వారంతా ఒకే కుటుంబానికి చెందిన వారిగా భావిస్తున్నారు. ఆదివారం ఉదయం ఈ దారుణం చోటు చేసుకుంది. ఢిల్లీలోని బురారీ ప్రాంతానికి చెందిన కుటుంబంలోని 11 మంది విగతజీవులుగా కనిపించారు.

మృతి చెందిన వారిలో 7గురు మహిళలు, నలుగురు పురుషులు ఉన్నారు. మృతదేహాల కళ్లకు గంతలు, కాళ్లు చేతులు కట్టేసి ఉన్నట్లుగా తెలుస్తోంది. వారిది స్థానికంగా ఫర్నీచర్ షాప్. రోజు ఉదయం ఆరు గంటలకు దుకాణం తెరిచేవారు. ఈ రోజు ఏడున్నర గంటలు అయినా తెరవలేదు. అనుమానం వచ్చిన స్థానికులు ఇంట్లోకి వెళ్లి చూశారు.

11 members of a family found dead in Delhi: police

లోపల 11 మంది ఉరేసుకున్నట్లు కనిపించడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు ఆర్థిక సమస్యల కారణంగా ఆత్మహత్య చేసుకున్నారా? లేక ఎవరైనా చంపేశారా అనే కోణంలో పోలీసులు దర్యాఫ్తు చేస్తున్నారు. ఒకేసారి 11 మృతదేహాలను చూసి స్థానికులు భయాందోళనకు గురయ్యారు. పోలీసులు ఇంటిని సీజ్ చేసి విచారణ ప్రారంభించారు. కాగా, సంఘటన స్థలాన్ని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సందర్శించారు.

English summary
In a shocking incident, 11 bodies were recovered from a house in Burari area of New Delhi on early Sunday morning. The bodies include seven women and four men. The entire area has been cordoned off.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X