బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కథ క్లైమాక్స్ కు: 11 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు, స్పీకర్ క్లారిటీ, ఆరోజు డిసైడ్ చేస్తా !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: కర్ణాటకలోని కాంగ్రెస్-జేడీఎస పార్టీల సంకీర్ణ ప్రభుత్వం కథ క్లైమాక్స్ కు చేరుకుంది. 11 మంది రెబల్ ఎమ్మెల్యేలు రాజీనామా చేశారని తనకు సమాచారం అందిందని కర్ణాటక స్పీకర్ రమేష్ కుమార్ స్వయంగా మీడియాకు చెప్పారు. అయితే మంగళవారం తాను రాజీనామా పత్రాలు పరిశీలించి ఓ నిర్ణయం తీసుకుంటానని రమేష్ కుమార్ అన్నారు.

శనివారం బెంగళూరులోని ఇందిరానగర్ లో మీడియాతో మాట్లాడిన స్పీకర్ రమేష్ కుమార్ ఎమ్మెల్యేల రాజీనామా ేఖలు తన చాంబర్ లో ఇచ్చారని సమాచారం వచ్చిందని మీడియాకు చెప్పారు. తాను శనివారం ఉదయం విధాన సౌధలోనే ఉన్నానని, మేము రాజీనామా చెయ్యడానికి వస్తున్నామని ఏ ఎమ్మెల్యే తనతో సంప్రదించలేదని స్పీకర్ రమేష్ కుమార్ స్పష్టం చేశారు.

11 MLAs resigned, says Karnataka Speaker Ramesh Kumar

Recommended Video

నాటకీయ పరిణామాల మధ్య దేవెగౌడతో చంద్రబాబు భేటీ

ఆదివారం తన కార్యాలయానికి సెలవు, సోమవారం తాను కార్యాలయంలో అందుబాటులో ఉండనని, మంగళవారం విధాన సౌధ చేరుకుని ఎమ్మెల్యేలు సమర్పించిన రాజీనామా పత్రాలు పరిశీలించి చట్టపరంగా చర్యలు తీసుకుంటానని స్పీకర్ రమేష్ కుమార్ మీడియాకు చెప్పారు.

తనకు అనేక సమస్యలు ఉన్నాయని, ఈ రోజు ఉదయం (శనివారం) 4 గంటలకే తాను ఎయిర్ పోర్టు చేరుకుని అమెరికా నుంచి వచ్చిన కుటుంబ సభ్యులను రిసీవ్ చేసుకున్నానని, తరువాత జయదేవ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తన సమీప బందువును పరామర్శించడానికి ెళ్లానని రమేష్ కుమార్ మీడియాకు చెప్పారు.

ఎమ్మెల్యేలను కలవకుండా తను తప్పించుకుని తిరగలేదని, ఏ పార్టీతో తనకు సంబంధం లేదని, తాను స్పీకర్ గా ఉన్నానని రమేష్ కుమార్ వివరించారు. ఎమ్మెల్యేలు రాజీనామా చేశారని తాను ప్రభుత్వానికి, సీఎంకు, కాంగ్రెస్, జేడీఎస్ పార్టీ నాయకులు చెప్పాల్సిన అవసరం తనకు లేదని, ఏ పార్టీతో తనకు సంబంధాలు లేవని స్పీకర్ రమేష్ కుమార్ మీడియాకు చెప్ారు.

English summary
What are the options before Speaker Ramesh Kumar if number game starts and Governor accepts the resignation of dozens of MLAs resignation.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X