వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

11నెలల పాపకు తీవ్ర గుండెవ్యాధి: సాయం చేసి ఆదుకోండి

Google Oneindia TeluguNews

'గత 7 నెలలుగా, నా 11 నెలల వయస్సున్న కుమార్తె పరిస్థితి అత్యంత దీనస్థితికి చేరుకుంది. కనీసం ఆమె తన కళ్లను కూడా ఎక్కువసేపు తెరిచి ఉంచలేదు. ఆమె తింటున్న ప్రతిసారీ వాంతి చేసుకునేది. దీంతో అసలు తినడమే మానేసింది. ఆమెకు అత్యవసర గుండె శస్త్రచికిత్స అవసరం. అయితే నా జేబులో రూ. 1000 కూడా లేవు. నా కూతురు శస్త్రచికిత్స కోసం డబ్బు ఏర్పాటు చేయడానికి నేను చాలా కష్టాలు పడుతున్నాను. ప్రతిసారి నా బిడ్డ తన పెద్ద పెద్ద నల్లని కళ్లతో నన్ను చూస్తుంటే.. నా హృదయం విచ్ఛిన్నం అవుతుంది. కనీసం తన జీవితాన్ని నిలబెట్టలేకపొతే, ఒక తండ్రిగా నేను విఫలమైనట్లు భావిస్తున్నాను" అని శివాని తండ్రి శివ కుమార్ తన దీనగాథను పంచుకున్నాడు.

తీవ్ర గుండె వ్యాధితో బాధపడుతున్న ఈ చిన్నారిని ఆదుకోండి

నవంబర్ 2017 లో శివ, ఆశా దంపతులకు పాప పుట్టింది. అప్పుడు ఆశా కళ్ళు ఆనందంతో కన్నీళ్ళతో నిండిపోయాయి. " పాప అంటే నాకు చాలా ఇష్టం. తను తన పెద్ద పెద్ద బూడిద రంగు కళ్ళతో మిణుకు మిణుకుమంటూ చూస్తూ ఏంతో అందంగా కనిపిస్తుంది" అంటూ చెప్పుకొచ్చింది ఆశ. కానీ, అతి తక్కువ కాలంలోనే మా పాప జబ్బు బారినపడింది. తరచుగా జ్వరం, జలుబుతో బాధపడేది. ఆమెకు కొన్ని నెలల పాటు ఇచ్చాం. కానీ ఆమె ఫ్లూ తగ్గలేదు. అనేకమంది స్థానిక వైద్యులను సంప్రదించినా కూడా ఎటువంటి ఫలితమూ కనపడలేదు. మొదట చాలా మంది డాక్టర్లు కేవలం తాత్కాలిక ఉపశమనానికి మాత్రమే మందులను రాసిస్తూ వచ్చారు.

11-Months-Old Fights A Deadly Heart Disease

శివాని 8 నెలల వయస్సులోకి అడుగుపెట్టినప్పుడు, ఆమె ఫ్లూ నెమ్మదిగా న్యుమోనియాకి మళ్లింది. వెంటనే ఢిల్లీ అపోలో హాస్పిటల్లో చేర్చారు. అక్కడ న్యుమోనియా నయమయింది కానీ, జ్వరం మాత్రం తగ్గలేదు. కొంతకాలం తర్వాత, వైద్యులు పరీక్షలు నిర్వహించి, తను గుండె జబ్బుతో బాధపడుతున్నట్లు కనుగొన్నారు.

11-Months-Old Fights A Deadly Heart Disease

" ఆమె గుండెలో రంధ్రం ఉందని తేల్చారు". ఆమాటకు ఎలా స్పందించాలో కూడా అర్ధం కాక, నిశ్చేష్టులమైపోయాము. అంత చిన్న పసిబిడ్డకు అంత పెద్ద రోగం. ఒక్కోసారి పాలు తాగకుండా ఏడ్చేది. నాకు అర్ధమయ్యేది.. తను ఏదో సమస్యతో ఇబ్బందిపడు తుందని. క్రమంగా, ఆమె చిన్న చేతులు, కాళ్ళు నీలి రంగులోకి మారిపోతుండటం, ఊపిరి సరిగ్గా అందకుండా పోవడం వంటి సమస్యలు ఎదురవడం కూడా ప్రారంభమయ్యింది. "ఈ భయంకరమైన వ్యాధి నుంచి మా శివానీని ఎలా రక్షించాలనే దాని గురించి తీవ్రంగా చింతిస్తున్నాము" అని ఆ చిన్నారి శివాని తల్లి ఆశా కన్నీటి పర్యాంతమైంది.

శివాని పరిస్థితి చాలా క్లిష్టమైనదని వైద్యులు ధృవీకరించారు . ఆమెకు తక్షణమే ఓపెన్ హార్ట్ శస్త్రచికిత్స అవసరమని తేల్చారు. శస్త్రచికిత్స మొత్తం వ్యయం రూ. 3 లక్షలు. క్రమంగా శివ, ఆశా పాప అవసరమయ్యే మెడిసిన్స్, శస్త్రచికిత్స కోసం డబ్బు సమకూర్చవలసిన అవసరం ఏర్పడింది. శివాని ఇప్పుడు, కొన్ని మందులు తీసుకుంటూ ఇంట్లోనే ఉంది. కనీసం తన తల్లిదండ్రుల వద్ద, కనీస అవసరాలకు కూడా డబ్బులు లేని కారణంగా శివాణీ ఇబ్బందులుపడాల్సి వస్తుంది.

11-Months-Old Fights A Deadly Heart Disease

శివానీ తగినంత శ్వాస సరిగ్గా ఆడకపోవడం మూలంగా శరీరానికి అవసరమైన ప్రాణవాయువును సైతం సరిగ్గా పొందడం లేదు. ఆమె త్వరత్వరగా శ్వాసను పీల్చుకుని వదిలివేస్తూ ఉంది. ఆమెకి ఎక్కువ సమయం కూడా లేదని అర్ధమవుతూ ఉంది. కానీ తన తల్లిదండ్రులు ఆమె గుండె శస్త్రచికిత్స కోసం రూ. 3 లక్షల వరకూ చెల్లించాల్సి ఉంటుంది.

"నేను, నా కుటుంబంతో కలిసి, ఆలీ విహార్లో నివసిస్తున్నాము. కార్మికునిగా పని చేస్తూ, నెలకు రూ.10,000. సంపాదిస్తున్నాను. ఇల్లు మొత్తం నా సంపాదన మీదే ఆధారపడి ఉంది. ముగ్గురు ఇంటి సభ్యుల (నా భార్య, నా తల్లి, శివాని) బాధ్యత నేను చూసుకుంటున్నాను. అత్యంత ఖర్చుతో కూడుకున్న ఆమె శస్త్రచికిత్సకు, మెడిసిన్స్ కోసం డబ్బును ఆదా చేయడానికి నేను, నా భార్య రోజులో ఒక పూట మాత్రమే భోజనం చేయడం ప్రారంభించాము. ప్రతి క్షణం మరణం వైపు చూస్తున్న శివానీ ప్రాణాలు నిలబెట్టడం కోసం మా చేతికి దొరికిన ఏ ప్రయత్నాన్ని మేము వదులుకోదలచుకోలేదు. అన్ని అసమానతలు మాకు వ్యతిరేకంగా ఉన్నాయని మాకు తెలుసు కానీ మేము ఆశని కోల్పోలేదు," అంటూ శివాని తండ్రి కన్నీటి పర్యంతమయ్యాడు.

మందులు, పరీక్షలు డాక్టర్ సందర్శనల కోసం తరచుగా డబ్బును చెల్లించాల్సి వస్తుంది. వారు ఇప్పటికే తమ పొదుపు మొత్తాన్ని ఉపయోగించారు. కొంత మొత్తాన్ని సేకరించడానికి ఆశా, తన ఆభరణాలని సైతం విక్రయించింది, కానీ వారి లక్ష్యం 3 లక్షలు. అయితే వారు ఉన్న డబ్బు మొత్తం అయిపోయి, చేతిలో 1000 కూడా మిగలని పరిస్థితిలో ఉన్నారు.

11-Months-Old Fights A Deadly Heart Disease

మీరు ఎలా సహాయపడగలరు?

గత కొన్ని నెలలుగా, శివ, ఆశా తమ శివాని ఫ్ సేవింగ్ మందులను కొనుగోలు చేసేందుకు తాము సంపాదించిన పూర్తి మొత్తాన్ని వెచ్చించారు. ఇప్పుడు వారి 11 నెలల వయసున్న కుమార్తెకు అత్యంత ముఖ్యమైన ఓపెన్ హార్ట్ శస్త్రచికిత్స అవసరం. వారు వారి కుమార్తె జీవితాన్ని కాపాడటానికి కాలంతో పోటీ పడి పరుగు పెడుతున్నారు. ఏదిఏమైనా మీ సహకారం లేకుండా విజయం సాధించలేరు. ఆ పసిబిడ్డను రక్షించడానికి చేతులు కలపండి. చిన్న సహకారం కూడా శివానిని కాపాడుతుంది. వాట్సాప్, ఫేస్బుక్ వంటి సామాజిక మాధ్యమాలలో మీ కుటుంబ సభ్యులు , స్నేహితులతో వారి పరిస్థితిని షేర్ చేసికూడా మీరు కొంతమేర సహకారాన్ని అందివ్వగలరు. దయచూపండి.

11-Months-Old Fights A Deadly Heart Disease

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X