వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జమ్మూలో లోయలో పడ్డ బస్సు 11 మంది విద్యార్థులు మృతి

|
Google Oneindia TeluguNews

జమ్మూ కశ్మీర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పూంచ్‌ జిల్లాలో జరిగిన ఈ ప్రమాదంలో 11 మంది విద్యార్థులు మృతి చెందారు. సురాన్‌కోట్ నుంచి మొఘల్ రోడ్దుకు విద్యార్థులు పిక్నిక్ వెళుతున్నారు. షోపియప్ వైపు ప్రమాదం జరగడంతో ఎఫ్ఐఆర్ అక్కడే నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇదిలా ఉంటే విద్యార్థులంతా పూంచ్ జిల్లాకు చెందినవారిగా పోలీసులు గుర్తించారు. మృతి చెందిన వారిలో 9 మంది ఆడపిల్లలు ఉన్నారు.

bus accident
బస్సు లోయలో పడకముందు ఓ డివైడర్‌ను వేగంగా వచ్చి ఢీకొందని ఆ తర్వాత లోయలో పడిపోయినట్లు పూంచ్ జిల్లా డిప్యూటీ కమిషనర్ రాహుల్ యాదవ్ తెలిపారు. విద్యార్థులంతా సురాన్ కోట్‌లోని ఓ కంప్యూటర్ ఇన్స్‌టిట్యూట్‌లో చదువుతున్నట్లు యాదవ్ తెలిపారు.వారంత చుట్టుపక్కల గ్రామాల్లో నివసించేవారని చెప్పారు. గాయపడిన ఏడుగురు విద్యార్థులను చికిత్స కోసం సౌర మెడికల్ ఇన్స్‌టిట్యూట్‌కు తరలించారు.

విద్యార్థులను పిక్నిక్‌కు తీసుకెళుతున్న బస్సు అతివేగంతో అదుపుతప్పి లోయలోకి పడిపోయిందని పోలీస్ వర్గాలు తెలిపాయి. ఘటనపై గవర్నర్ సత్యపాల్ తీవ్ర విచారంను వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం ప్రకటించారు.గాయపడిన విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. చిన్నారులంతా త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు. పూంచ్ మరియు రాజౌరీలను మొఘల్ రోడ్ అనుసంధానం చేస్తుంది. అక్కడ భారీ మంచు కురుస్తుండటంతో శీతాకాలమంతా అది మూసే ఉంటుంది.

English summary
Eleven students, that included nine girls, of a private computer training institute were killed while seven others were injured on Thursday in a road accident on Mughal Road in Jammu and Kashmir’s Poonch district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X