వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లెఫ్టినెంట్ గవర్నర్ కుర్చీలో 11 ఏళ్ళ బాలుడు, ఎక్కడంటే?

మాజీ ఐపీఎస్ అధికారిణి, పుదుచ్ఛేరి లెఫ్టినెంట్‌ గవర్నర్‌ కిరణ్ బేడీ తనను కలిసేందుకు వచ్చిన 11 ఏళ్ళ బాలుడిని తన కుర్చీలోనే కూర్చోబెట్టారు.కిరణ్‌బేడీ ఇటీవల కాలంలో తరచూ వార్తల్లోకెక్కుతున్నారు.

By Narsimha
|
Google Oneindia TeluguNews

పుదుచ్చేరి: మాజీ ఐపీఎస్ అధికారిణి, పుదుచ్ఛేరి లెఫ్టినెంట్‌ గవర్నర్‌ కిరణ్ బేడీ తనను కలిసేందుకు వచ్చిన 11 ఏళ్ళ బాలుడిని తన కుర్చీలోనే కూర్చోబెట్టారు.కిరణ్‌బేడీ ఇటీవల కాలంలో తరచూ వార్తల్లోకెక్కుతున్నారు. వినూత్న కార్యక్రమాలు చేస్తూ ఆమె వార్తల్లో నిలుస్తున్నారు.

తనను కలిసేందుకు వచ్చిన ఓ బాలుడికి అప్యాయ ఆతిథ్యం ఇచ్చారు. ఏకంగా గవర్నర్‌ కుర్చీలోనే అతన్ని కూర్చోబెట్టారు.రాజ్‌ నివాస్‌కు ప్రజల సందర్శనార్థం అనుమతి ఉంది. శనివారం ఓ కుటుంబం అక్కడికి రాగా.. అదే సమయంలో కిరణ్‌ బేడీ కార్యాలయంలో ఉన్నారు. విషయం తెలుసుకున్న ఆ కుటుంబసభ్యులతో వెళ్లి ఆమెను కలిశారు. వారితో కాసేపు మాట్లాడారు కిరణ్‌బేడీ.

11-year-old boy sits in LG Kiran Bedi's chair during Raj Nivas visit

బాలుడిని ఆప్యాయంగా పలకరించారు. అంతేకాదు, తన కుర్చీలో కూర్చోమని స్వయంగా కిరణ్ బేడీయే ఆ బాలుడితో అన్నారు. దీంతో, ఆ బాలుడు ఆ కుర్చీలో కూర్చుని ఆనందపడ్డాడు.

ఈ విషయాన్ని కిరణ్ బేడీ తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలిపారు. సందర్శనార్థం వచ్చే చిన్నారులను కొంచెం సేపు లెఫ్టినెంట్ గవర్నర్ కుర్చీలో కూర్చోబెడతానని ఆమె ట్విట్టర్‌లో తెలిపారు. ''ఏమో దీనిని స్ఫూర్తి పొంది.. ఏదో ఓ రోజున వాళ్లే ఈ పుదుచ్చేరికి లెఫ్టినెంట్ గవర్నర్ అవుతారేమో, ఎవరికి తెలుసు?''అని ఆ ట్వీట్ లో స్ఫూర్తిదాయక ట్వీట్ ను బేడీ చేశారు.

English summary
An 11-year-old boy who met Puducherry Lt Governor Kiran Bedi at Raj Nivas here was pleasantly surprised when the former IPS officer asked him have a seat in her chair at her office.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X