వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

11ఏళ్ల యువశ్రీ బతకాలంటే మీ సాయం కావాలి: ఆమె తల్లి వేదన

Google Oneindia TeluguNews

హైదరాబాద్: పిల్లలకి సంబంధించి విషయాల్లో చాలా మంది తల్లిదండ్రులు రకరకాల ఇబ్బందులుపడుతుంటారు. ప్రతి అయిదు మంది భారతీయులలో ఒకరికి తమ జీవితకాలంలో ఎప్పుడో ఒకసారి కాలేయ వ్యాధి వచ్చే అవకాశం ఉంది. అలాగే పదకొండేళ్ళ యువశ్రీ కూడా లివర్ కు సంబంధించిన వ్యాధికి గురైంది. గతేడాది ఆగస్టులో యువశ్రీకి ఈ వ్యాధి సోకిందని తెలీగానే ఆమె తల్లిదండ్రులు షాక్ కి గురయ్యారు.

డాక్టర్లు యువశ్రీకి లివర్ మార్పిడి చేయాలని సూచించారు. ఆ పాప తండ్రి ప్రైమరీ స్కూలులో డ్రైవర్ గా పదివేల జీతానికి పనిచేస్తున్నారు. యువశ్రీ తల్లేమో ఇళ్లల్లో చిన్నచిన్న పనులు చేస్తుంటారు. వైద్యానికి అయ్యే ఖర్చు దాదాపు ఇరవైరెండున్నర లక్షలు అవుతాయి. వీరు జీవితకాలం దాచుకున్నదంతా, తమ దగ్గరున్న విలువైన వస్తువులన్నీ అమ్మగా వచ్చిన డబ్బు కనీసం చికిత్స మొదలుపెట్టడానికి సరిపోలేదు.

11-Year-Old Yuvasri Needs Help To Get Postoperative Care

ఈ దశలో, ఎవరో యువశ్రీ తల్లిదండ్రులకి క్రౌడ్ ఫండింగ్ ప్రయత్నించమని సలహా ఇచ్చారు. వారు డబ్బును ఎలా అయినా కూడగట్టాలని ప్రయత్నిస్తూ దీనికి కూడా సిద్ధపడతారు. వారాల్లోపలే యువశ్రీకి కావాలసినంత డబ్బు సమకూరి చెన్నై గ్లెనెగల్స్ గ్లోబల్ హాస్పిటల్లో కాలేయ మార్పిడి ఆపరేషన్ కి అన్నీ సిద్ధమయ్యాయి.

ఆపరేషన్ విజయవంతమై, డాక్టర్లు యువశ్రీ పూర్తిగా కోలుకుంటుందని చెప్పారు. కానీ మామూలు జీవితం గడపటానికి ఇంకా సమయం పడుతుందని చెప్పారు. ఆపరేషన్ తర్వాత పోస్ట్ ఆపరేటివ్ కేర్ చాలా సీరియస్ గా తీసుకోవాలని, దానిపైనే ఆరోగ్యం ఆధారపడి ఉంటుందని తెలిపారు. ఖరీదైన మందులు , వచ్చే నెలల్లో ఆమె సంరక్షణకి మరో పది లక్షలు అవసరమవుతాయి. మళ్లీ ఆ పాప తల్లిదండ్రులకి వారి పాప జీవితం డబ్బుల్లేక అపాయంలో పడే స్థితికి వచ్చింది.

11-Year-Old Yuvasri Needs Help To Get Postoperative Care

విధికి తలవంచి యువశ్రీ తల్లిదండ్రులు తమ పాప సంరక్షణా ఖర్చులకి మళ్ళీ మెడికల్ క్రౌడ్ ఫండింగ్ ప్రయత్నించాలనుకుంటున్నారు. " తెలిసిన వారు.. తెలియని వారు.. స్నేహితులు ఒకేలా మాకు సాయం చేశారు. అలానే యువశ్రీ కాలేయ మార్పిడి ఆపరేషన్ జరిగింది," అని ఆమె తండ్రి అన్నారు.

"ప్రజల దయాకరుణలపై నమ్మకం ఉంచటం తప్ప మాకు మరో దారి లేదు, ఆమె హాస్పిటల్ ఖర్చులు అయినా వస్తాయని అనుకుంటున్నాం." అని పాప తల్లి కన్నీళ్ళతో చెప్పారు. " యువశ్రీ పడే బాధ నుంచి కాపాడలేకపోతున్నాను. అదే నన్ను కృంగదీస్తోంది." అన్నారు.

11-Year-Old Yuvasri Needs Help To Get Postoperative Care

యువశ్రీ ఆరోగ్యం మామూలవటానికి, ఆమె ఫండ్ రైజర్ కి మీరు ఇక్కడ విరాళం అందించవచ్చు. అలాగే మీ దగ్గరి వారితో సోషల్ మీడియాలో యువశ్రీ దీనస్థితిని షేర్ చేసి కూడా మీరు సాయపడవచ్చు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X