వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

19 రాష్ట్రాల్లోని 110 నగరాల్లో ఏకకాలంలో సీబీఐ సోదాలు

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ : అవినీతిపరుల గుండెల్లో రైళ్లు పరుగెత్తించింది సీబీఐ. ఇవాళ ఏకకాలంలో 110 ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టి హడలెత్తించింది. 30 కేసులకు సంబంధించి 19 రాష్ట్రాల్లో .. 110 ప్రాంతాల్లో సీబీఐ బృందాలు సోదాలు నిర్వహించాయి. ప్రధానంగా అవినీతి, ఆయుధాల స్మగ్లింగ్ ఆరోపణలపై విసృతంగా గాలించాయి. సీబీఐ దాడులతో నేర ప్రవృత్తి కలిగిన వ్యాపారులు బెంబేలెత్తిపోయారు. పక్కా ప్రణాళికతో ఏకకాలంలో 110 చోట్ల దాడులు చేయడంతో బిత్తరపోయారు.

ఉక్కుపాదం ..
అవినీతి, నేరప్రవృతి, ఆయుధాల స్మగ్లింగ్ తదితర ఆరోపణలు ఉన్న కేసులను సీబీఐ తిరగతోడింది. దాదాపు 30 కేసులకు సంబంధించి ఫైల్ చేసిన ఎఫ్ఐఆర్ తెరిచింది. తమ సిబ్బందితో కలిసి దేశంలోని 19 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో మెరుపుదాడులు నిర్వహించింది. ఈ నెల 2న బ్యాంకు ఫ్రాడ్ కేసులకు సంబంధించిన దాడులు నిర్వహించారు. దాదాపు 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 50 నగరాల్లో దాడులు చేశారు. ఆ వెంటనే అంతకుమించి స్థాయిలో మెరుపు తనిఖీలు చేపట్టి .. అవినీతిపరుల గుండెల్లో రైళ్లు పరుగెత్తించారు.

110 raids, 19 states, 30 FIRs: CBIs nationwide crackdown against corruption, arms smuggling

ప్రధాన నగరాల్లో ...
ఢిల్లీ, ముంబై, లుధియానా, థానె, వాల్‌సాడ్, పుణె, పలానీ, గయా, గుర్గావ్, చండీగఢ్, భోపాల్, సూరత్, కోలార్ ఇతర చోట్ల దాడులు నిర్వహిస్తున్నట్టు సీబీఐ ఉన్నతాధికారులు మీడియాకు వివరించారు. 16 కేసుల్లో మోసపూరిత సొమ్ము రూ.1100 కోట్లు ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. ఈ కేసుల్లో వివిధ కంపెనీలు, సంస్థలు, ప్రమోటర్లు, డైరెక్టర్లు, బ్యాంకు అధికారులు, ఇతరులు ఉన్నారని పేర్కొన్నారు. బ్యాంకులకు రూ.13 వేలకు కుచ్చుటోపీ పెట్టి విదేశాల్లో నక్కిన నీరవ్ మోడీ, మొహుల్ చోక్సీ ఉదంతం .. కేంద్రాన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. దీంతో మిగతా ఆర్థిక నేరగాళ్లపై ఉక్కుపాదం మోపాలని దాడులు చేయిస్తున్నట్టు విశ్వసనీయంగా తెలసింది.

English summary
in a nationwide crackdown, the Central Bureau of Investigation on Tuesday conducted searches at around 110 places in 19 states and Union Territories.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X