వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తమిళనాడు సీఎం ఆయనే: ఎమ్మెల్యేల తీర్మానం: దినకరన్ కు షాక్ ఇచ్చిన మేడమ్, రిలాక్స్ !

తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం మంగళవారం కాస్త ఊపిరిపీల్చుకున్నారు. ప్రభుత్వాన్ని నిలబెట్టడానికి అవసరం అయిన ఎమ్మెల్యేల మద్దతు కోసం పళనిసామి.

|
Google Oneindia TeluguNews

చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం మంగళవారం కాస్త ఊపిరిపీల్చుకున్నారు. ప్రభుత్వాన్ని నిలబెట్టడానికి అవసరం అయిన ఎమ్మెల్యేల మద్దతు కోసం పళనిసామి, పన్నీర్ సెల్వం చేస్తున్న ప్రయత్నాలు 95 శాతం ఫలించాయని చెప్పవచ్చు.

జయలలిత పోయస్ గార్డెన్ : రూ. 100 కోట్లు గుర్తుందా, పళని ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు !జయలలిత పోయస్ గార్డెన్ : రూ. 100 కోట్లు గుర్తుందా, పళని ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు !

అన్నాడీఎంకే పార్టీకి చెందిన 135 మంది ఎమ్మెల్యేలు (ముగ్గురు మిత్రపక్ష ఎమ్మెల్యేలు) మంగళవారం సమావేశానికి హాజరుకావాలని సీఎం ఎడప్పాడి పళనిసామి పిలుపునిచ్చారు. పుదుచ్చేరీలోని టీటీవీ దినకరన్ వర్గానికి సైతం పళనిసామి ఆహ్వానం పంపారు.

చెన్నై హెడ్ క్వాటర్స్ లో

చెన్నై హెడ్ క్వాటర్స్ లో

చెన్నైలోని రాయపేట్ లోని అన్నాడీఎంకే పార్టీ ప్రధాన కార్యాలయంలో మంగళవారం తమిళనాడు ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం అధ్యక్షతన ఆ పార్టీ ఎమ్మెల్యేల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో తమిళనాడు మంత్రులు అందరూ పాల్గొన్నారు.

 టెన్షన్ టెన్షన్ తో పళని, పన్నీర్

టెన్షన్ టెన్షన్ తో పళని, పన్నీర్

అన్నాడీఎంకే పార్టీ ప్రధాన కార్యాలయంలో జరుతున్న సమావేశానికి ఎంత మంది ఎమ్మెల్యేలు వస్తారు ? అంటూ తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామి, పన్నీర్ సెల్వం టెన్షన్ టెన్షన్ తో ఎదురు చూశారు. ఎమ్మెల్యేలు గ్రూపులు గ్రూపులుగా పార్టీ ప్రధాన కార్యాలయానికి చేరుకున్నారు.

అదే రిపీట్ అవుతుందా ? ఆందోళన

అదే రిపీట్ అవుతుందా ? ఆందోళన

గత సోమవారం అన్నాడీఎంకే పార్టీ ప్రధాన కార్యాలయంలో సీఎం పళనిసామి, పన్నీర్ సెల్వం అధ్యక్షతన అన్నాడీఎంకే పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేల సమావేశం నిర్వహించారు. ఆ సందర్బంలో కేవలం 75 మంది ఎమ్మెల్యేలు మాత్రం సమావేశానికి హాజరుకావడంతో పళనిసామి, పన్నీర్ సెల్వం ఆందోళన చెందారు.

సంఖ్య పెరిగింది, కానీ ?

సంఖ్య పెరిగింది, కానీ ?

మంగళవారం రాయ్ పేట్ లోని అన్నాడీఎంకే పార్టీ కార్యాలయంలో జరిగిన ఆ పార్టీ ఎమ్మెల్యేల సమావేశానికి పళనిసామి, పన్నీర్ సెల్వం ఊహించినట్లే ఎమ్మెల్యేలు హాజరైనారు. మంత్రులతో సహ మొత్తం 111 మంది ఎమ్మెల్యేలు హాజరైనారు. దినకరన్ గ్రూప్ లో ఉండి పుదుచ్చేరి రిసార్ట్ నుంచి జారుకున్న సిరివిల్లిపుత్తూరు ఎమ్మెల్యే ఎం. చంద్రప్రభ సైతం ఈ సమావేశానికి హాజరైనారు. పన్నీర్ సెల్వం అధ్యక్షతన జరిగిన సమావేశంలో పళనిసామి సీఎంగా ఉండాలని ఏకగ్రీవ నిర్ణయం తీసుకున్నారు.

మా ముఖ్యమంత్రి ఆయనే !

మా ముఖ్యమంత్రి ఆయనే !

పన్నీర్ సెల్వం అధ్యక్ష్తతన జరిగిన అన్నాడీఎంకే పార్టీ శాసన సభ్యుల సమావేశంలో ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామి నాయకత్వాన్ని ఏకగ్రీవంగా తీర్మానించారు. సీఎం పళనిసామి ఎలాంటి నిర్ణయం తీసుకున్నా మాకు సమ్మతమే అంటూ పన్నీర్ సెల్వం చేసిన తీర్మానాన్ని శాసన సభ్యులు అందరూ ఏకగ్రీవంగా ఆమోదించారు. తమిళనాడు ప్రభుత్వానికి పూర్తి మెజారిటీ కావాలంటే ఇంకా ఆరు మంది శాసన సభ్యల మద్దతు అవసరం అవుతోంది.

English summary
At a crucial meeting of AIADMK legislators at the party headquarters here, which, according to sources, saw the participation of 109 MLAs (the AIADMK has 135 legislators including ministers), an unanimous resolution was passed supporting CM Edappadi K. Palaniswami.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X